»   » కమల్‌ ఓకే అన్నారు...రజనీ ఇంకా తేల్చలేదు

కమల్‌ ఓకే అన్నారు...రజనీ ఇంకా తేల్చలేదు

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : నడిగర్‌ సంఘంగా పిలిచే దక్షిణ భారత చలనచిత్ర నటీనటుల సంఘం ట్రస్టీగా ప్రముఖ నటుడు కమలహాసన్‌ను గౌరవ పదవిలో నియమిస్తూ ఆ సంఘ కార్యవర్గ సమావేశం నిర్ణయించింది. సార్వత్రిక ఎన్నికల తరహాలో నడిగర్‌ సంఘం ఎన్నికలు ఉత్కంఠ పరిస్థితుల మధ్య ఇటీవల జరిగిన విషయం తెలిసిందే.

29 పదవులకు జరిగిన ఈ ఎన్నికల్లో నాలుగు కార్యవర్గ సభ్యుల పదవులు మినహా మిగిలిన అన్నింటినీ విశాల్‌ నేతృత్వంలోని 'పాండవర్‌' జట్టు కైవసం చేసుకుంది. నూతన కార్యవర్గ సమావేశం ఉదయం చెన్నైలోని స్టార్ హోటల్‌లో జరిగింది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

Kamal Haasan appointed trustee of 'Nadigar Sangam'

సమావేశం అనంతరం అధ్యక్షుడు నాజర్‌, ప్రధాన కార్యదర్శి విశాల్‌, ఉపాధ్యక్షులు పొన్‌వణ్ణన్‌, కార్తి తదితరులు విలేర్లతో మాట్లాడుతూ... పాండవర్‌ జట్టు అనే మాట ఎన్నికలతో ముగిసిపోయిందన్నారు. ఇకపై నడిగర్‌ సంఘం ఒకే జట్టుగా కొనసాగనుందని తెలిపారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు సహకరించిన ముఖ్యమంత్రి జయలలిత, నగర పోలీసుశాఖ, పాఠశాల యంత్రాంగం, ఎన్నికల అధికారులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.

తమకు మార్గదర్శకంగా ఉండాలని నడిగర్‌ సంఘం సీనియర్లను కోరామని చెప్పారు. అందుకు రజనీకాంత్‌, కమలహాసన్‌తో చర్చించామని తెలిపారు. ఇందులో నడిగర్‌ సంఘం ట్రస్టీగా ఉండేందుకు కమలహాసన్‌ అంగీకరించారని, రజనీకాంత్‌ ఇంకా తమ అభిప్రాయాన్ని వెల్లడించలేదని పేర్కొన్నారు. ముందుగా జరిగిన కార్యక్రమంలో ఐసరి గణేష్‌ మాట్లాడుతూ... తన తండ్రి పేరిట ఉన్న ట్రస్టు ద్వారా ఆర్థికంగా ఇబ్బందిపడుతున్న కళాకారులకు అందిస్తున్న నిధిని రూ.వెయ్యికి పెంచినట్లు తెలిపారు.

English summary
After the bitterly fought battle for the posts of the South Indian Artistes Association (Nadigar Sangam), the newly elected office bearers held their first press conference on Sunday. It was also announced that Kamal Haasan would be one of the nine trustees of the Nadigar Sangam. Rajinikanth had not reverted on the same.
Please Wait while comments are loading...