»   » సోషల్ మీడియా సింగింగ్ సెన్సేషన్... రాకేష్ ఉన్నిని కలిసిన కమల్ హాసన్!

సోషల్ మీడియా సింగింగ్ సెన్సేషన్... రాకేష్ ఉన్నిని కలిసిన కమల్ హాసన్!

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  సోషల్ మీడియా సింగింగ్ సెన్సేషన్... రాకేష్ ఉన్నిని కలిసిన కమల్ హాసన్!

  కేరళకు చెందిన ఓ కూలీ తన అద్భుతమైన గానమాధుర్యంతో పాడిన పాటకు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది. కమల్ హాసన్ నటించిన విశ్వరూపం చిత్రంలోని 'ఉన్నై కానాద నాన్‌ఇండ్రి నాన్‌...' అంటూ అతడు పాడిన పాట కొన్ని రోజులుగా వైరల్ అవుతోంది.

  ఈ వైరల్ వీడియో ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్ చూసి ముగ్ధుడైపోయి అతడిని వివరాలు కావాలంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టడంతో... సినీ సంగీత ప్రముఖుల దృష్టి ఆ కూలీపై పడింది. కేరళ రాష్ట్రంలోని ఆళప్పుళ ప్రాంతంలో రబ్బరు తోటల్లో పని చేసే రోజు కూలీ రాకేష్‌ ఉన్నిగా అతడిని గుర్తించారు.

  Kamal Haasan met singing sensation Rakesh Unni

  శంకర్ మహదేవన్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు అతడికి ఫోన్ చేసి అభినందించారు. కొందరు సంగీత దర్శకులు తమ సినిమాల్లో పాట పాడే అవకాశం ఇస్తామంటూ ఆఫర్లు ఇచ్చారు. రాకేష్ ఉన్ని గురించి తెలుసుకున్న కమల్ హాసన్ అతడిని తన ఇంటికి పిలిపించుకుని అభినందించారు.

  విశ్వరూపం సంగీత దర్శకుడు ఘిబ్రాన్ త్వరలోనే అతడితో ఓ పాట రికార్డ్ చేయబోతున్నట్లు ప్రకటించడం గమనార్హం. ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్లో కమల్ హాసన్‌ను రాకేష్ ఉన్ని కలిసిన వీడియోను అభిమానులతో పంచుకున్నారు.

  English summary
  Kamal Haasan met singing sensation Rakesh Unni. Just days after a video of Rakesh Unni, a rubber plantation worker from Kerala, signing went viral, not only did find out his whereabouts, the talented singer got a chance to sing in front of his matinee idol Kamal Haasan! Rakesh sang Unnai Kaanadhu, a song from Vishwaroopam, and Kamal Haasan was so impressed with his voice that he hugged Rakesh in the end.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more