»   » సినీ నటి పేరు చెప్తావా? సారీ చెప్పు లేదా జైలుశిక్ష వేస్తాం.. కమల్‌పై మహిళా కమిషన్ ఫైర్..

సినీ నటి పేరు చెప్తావా? సారీ చెప్పు లేదా జైలుశిక్ష వేస్తాం.. కమల్‌పై మహిళా కమిషన్ ఫైర్..

Posted By:
Subscribe to Filmibeat Telugu

విలక్షణ నటుడు కమల్ హాసన్‌పై జాతీయ మహిళా కమీషన్ మండిపడింది. కేరళలో కిడ్నాప్, లైంగిక దాడి బాధితురాలైన సినీ నటి పేరును మీడియా సమావేశంలో కమల్ చెప్పడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేసింది. లైంగికదాడి గురైన వ్యక్తి పేరును మీడియాలో రాయకూడదు, ప్రస్తావించకూడదనే విషయాన్ని విస్మరించారనే అంశంపై కమల్‌ తీరును మహిళ కమిషన్ చైర్‌పర్సన్ లలిత కుమారమంగళం మండిపడింది. ఈ వ్యవహారాన్ని సుమోటోగా తీసుకొని కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.

సినీతారలను ప్రత్యేకంగా ఎందుకు చూడాలి..

సినీతారలను ప్రత్యేకంగా ఎందుకు చూడాలి..

బుధవారం చెన్నైలో జరిగిన మీడియా సమావేశంలో కమల్ హాసన్ మాట్లాడుతూ.. లైంగికదాడికి గురైన సినీ నటి పేరును మీడియాకు వెల్లడించారు. సినీ పరిశ్రమలో మహిళ భద్రతను ప్రత్యేకంగా ఎందుకు చూడాలి? ఓ సమూహంలో మహిళలు ఉంటే నేను చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తాను. వారికి ఎలాంటి ముప్పు కలుగకుండా చర్యలు తీసుకుంటాను. మహిళా భద్రత విషయంలో సినీ తారలను ప్రత్యేకంగా ఎందుకు చూడాలి. ఆమె సినీ నటి (ఆమె పేరు చెప్తు) కావడం వల్ల సపోర్ట్ చేయడం లేదు. అని అన్నారు. బిగ్‌బాస్ కార్యక్రమం నిర్వహణపై హిందూ సంస్థ అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించారు.

Bigg Boss Tamil : Case Filed Against Kamal Haasan for his show
ద్రౌపది పేరును ద్రౌపదిగానే..

ద్రౌపది పేరును ద్రౌపదిగానే..

లైంగిక దాడి బాధితురాలి పేరును బయటకు చెప్పకూడదనే విషయాన్ని కమల్ దృష్టికి తీసుకురాగా, ఆమె పేరును బయటకు చెప్తే తప్పేమీ లేదు. ఆమె పేరును మీడియాలో మీరు కూడా ప్రస్తావించారు. ఆమె పేరు ద్రౌపది అయితే ద్రౌపది అనే పిలువాలి. మహిళ అని ఎందుకు పిలువాలి అని కమల్ ఎదురు ప్రశ్న వేశారు.

బాధితురాలి పేరు చెప్పవద్దు..

బాధితురాలి పేరు చెప్పవద్దు..

సినీ నటి పేరును బయటకు చెప్పడంపై జాతీయ మహిళ కమిషన్ చైర్ పర్సన్ కుమారమంగళం స్పందిస్తూ.. కమల్ అద్భుతమైన నటుడు. అందులో ఎలాంటి సందేహం లేదు. లైంగికదాడి గురైన బాధితురాలి పేరు బయటకు చెప్పడం చాలా సున్నితమైన అంశం అని అన్నారు. చట్ట ప్రకారం లైంగిక దాడి బాధితురాలి పేరు చెప్పడం తప్పు. ఐపీసీ సెక్షన్ 228 ఏ ప్రకారం బాధితురాలి పేరు చెప్పడం నేరం అని ఆమె అన్నారు.

సుమోటోగా కేసు.. సారీకి డిమాండ్

సుమోటోగా కేసు.. సారీకి డిమాండ్

చట్టాన్ని అతిక్రమించిన నేపథ్యంలో కమల్‌కు జరిమానా విధించవచ్చు లేదా రెండేళ్ల జైలుశిక్ష విధించవచ్చు. బాధితురాలు గానీ, ఆమె ఫ్యాన్స్ గానీ ఫిర్యాదు చేస్తే కేసు బుక్ చేస్తాం. సుమోటోగా పోలీసులు కేసు నమోదు చేయవచ్చు అని కుమారమంగళం అన్నారు. కమల్ వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకొని సుమోటోగా కేసు నమోదు చేస్తాం. ఆయన చేసిన వ్యాఖ్యలు సారీ చెప్పాలని కమల్‌కు నోటీసులు పంపుతామని ఆమె స్పష్టం చేశారు.

English summary
Hours after Tamil actor Kamal Haasan named the sexual assault victim in the Malayalam actor abduction and sexual assault case, National Commission for Women (NCW) chairperson Lalitha Kumaramangalam demanded an apology from the actor.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X