22ఏళ్ళ తరువాత మళ్ళీ కమల్ తో నటించనున్న స్టార్ యాక్టర్
కోలీవుడ్ లోక నాయకుడు కమల్ హాసన్ ప్రస్తుతం పాలిటిక్స్ తో పాటు తన రెగ్యులర్ సినిమాలతో కూడా బిజీ అవుతున్నాడు. ఇక నెక్స్ట్ ఆయన చేయబోతున్న సినిమాలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నట్లు అర్ధమవుతోంది. ఇండియన్ సినిమా ఆల్ రెడీ సెట్స్ పై ఉన్న విషయం తెలిసిందే. ఇక ఆ సినిమా తరువాత ఎక్కువగా హైప్ క్రియేట్ చేస్తున్న ప్రాజెక్ట్ "విక్రమ్".
విక్రమ్ సినిమా ఎనౌన్స్మెంట్ వచ్చినప్పటి నుంచి కూడా ఇండస్ట్రీలో అనేక రకాల రూమర్స్ వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే ఆ సినిమాను డైరెక్ట్ చేస్తోంది లోకేష్ కనగరాజన్. కార్తీ ఖైదీ సినిమాతో బాక్సాఫీస్ హిట్ అందుకున్న ఈ దర్శకుడు నెక్స్ట్ మాస్టర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. విజయ్ హీరోగా నటించిన ఆ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.

ఇక త్వరలో లోకేష్ కమల్ హాసన్ తో విక్రమ్ అనే సినిమాను మొదలు పెట్టనున్నాడు. అయితే ఆ సినిమాలో ప్రభుదేవా మరొక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. చివరగా కమల్ హాసన్ తో ప్రభుదేవా "నవ్వండి! లవ్వండి!" అనే సినిమా చేశాడు. 1988లో వచ్చిన ఆ సినిమాను సింగీతం శ్రీనివాసరావు డైరెక్ట్ చేశాడు. ఇక మళ్ళీ 22ఏళ్ల తరువాత ప్రభుదేవా స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. మరి ఆ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











