»   » నటనకు కమల్ హాసన్ గుడ్ బై!.. ఆ సినిమానే చివరిదట.. పాలిటిక్స్ కోసం..

నటనకు కమల్ హాసన్ గుడ్ బై!.. ఆ సినిమానే చివరిదట.. పాలిటిక్స్ కోసం..

Posted By:
Subscribe to Filmibeat Telugu
నటనకు కమల్ హాసన్ గుడ్ బై!.. ఆ సినిమానే చివరిదట.. పాలిటిక్స్ కోసం..

ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నానని విలక్షణ నటుడు కమల్ హసన్ ప్రకటన చేసిన తర్వాత తమిళ పాలిటిక్స్‌ వేడెక్కాయి. తమిళనాట నెలకొన్న రాజకీయ సంక్షోభం కారణంగానే పాలిటిక్స్‌లోకి రావాలని నిర్ణయం తీసుకొన్నానని తెలిపిన విషయం తెలిసిందే. తాను ఏ పార్టీలో చేరను.. సొంతంగా రాజకీయ పార్టీ స్థాపిస్తానని ప్రకటన చేశారు కూడా. అంతేకాకుండా భావస్వారూప్యం ఉన్న పార్టీలతో భాగస్వామ్యమవుతానని చెప్పుకొచ్చారు.

సినిమాలకు స్వస్తి

సినిమాలకు స్వస్తి

కమల్ హాసన్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయాల్లోకి వస్తున్నందున సినిమాలకు స్వస్తి చెబుతాను. అధికారికంగా ప్రకటన చేయగానే నటనకు గుడ్‌బై చెబుతాను. రాజకీయాలు ప్రస్తుతం ముఖ్యమైనందున కఠిన నిర్ణయం తీసుకోవాల్సిందే. నా నిర్ణయం చాలా బాధతో కూడుకొన్నది అని కమల్ అన్నారు.

కమిట్‌మెంట్స్ ఉన్నందున

కమిట్‌మెంట్స్ ఉన్నందున

ప్రస్తుతం ఇంకోనాళ్లు సినిమాలు చేస్తుంటాను. ఎందుకంటే కొన్ని కమిట్ మెంట్స్ ఉన్నందున వాటిని నెరవేర్చాల్సి వస్తుంది. సినిమాలు తగ్గించుకుంటూనే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్తాను అని కమల్ ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు.

రజనీకి సొంత అభిప్రాయం..

రజనీకి సొంత అభిప్రాయం..

గతవారం కమల్ హాసన్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో సమావేశం కావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకొన్నది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. రజనీకాంత్ తనకు మంచి స్నేహితుడు. రాజకీయాలపై ఆయనకు సొంత అభిప్రాయం ఉంది. రజనీ ఏ దారిని ఎంచుకొంటారో ఆయన ఇష్టం అని కమల్ అన్నారు. రజనీకి నాకు పోల్చడం సరికాదని అన్నారు.

చివరి చిత్రం ఇదే..

చివరి చిత్రం ఇదే..

ప్రస్తుతం కమల్ హాసన్ బిగ్‌బాస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడు. త్వరలోనే ఈ రియాల్టీ షో పూర్తి కానున్నది. అంతేకాకుండా విశ్వరూపం ప్రోస్ట్ ప్రోడక్షన్ పనులపై ఆయన దృష్టిపెట్టాడు. తలైవాన్ ఇరుక్కిరాన్ అనే పొలిటిక్ థ్రిల్లర్‌లో నటించనున్నారు. హిందీలో రిలీజ్ అయ్యే ఈ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్ కూడా నటించనున్నారు.

English summary
Veteran actor Kamal Haasan has gone on confirm that he would quit acting before joining politics. When asked if he would quit cinema for politics, he said Well, if I take up a position legally, I will have to. It will be painful. Apart from this his next film – Thalaivan Irukkiraan, a political thriller. It might have a Hindi release too with Saif Ali Khan in the lead.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu