»   » షాకిచ్చే కొత్త ట్విస్ట్: కమల్, గౌతమి బ్రేకప్ కు కారణం రమ్యకృష్ణ? అసలేం జరిగింది?

షాకిచ్చే కొత్త ట్విస్ట్: కమల్, గౌతమి బ్రేకప్ కు కారణం రమ్యకృష్ణ? అసలేం జరిగింది?

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: ప్రముఖ హీరో కమల్ హాసన్‌తో విడిపోతున్నట్టు ఆయనతో సహజీవనం చేస్తున్న నటి గౌతమి వారం క్రిందట ప్రకటించి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే వీరు విడిపోవటానికి కారణం ఏమిటన్నది మాత్రం బయిటకు రాలేదు. మీడియాలో వీరిద్దరు విడిపోవటానికి కారణం కమల్ కూతురు శృతి హాసన్ అని వచ్చింది.

అయితే ఈ విషయమై శృతి అలాంటిదేమీ లేదని బహిరంగ ప్రకటన చేసింది. అయితే ఇప్పుడు మరో యాంగిల్ ని తమిళ మీడియా హైలెట్ చేస్తూ వార్తలు మొదలెట్టింది. అది రమ్యకృష్ణ వల్లే కమల్ ..గౌతమిలు విడిపోయారని. అయితే ఇందులో నిజమెంత అనేది ఎవరికీ తెలియదు. కానీ కమల్ , గౌతమి విడిపోవటానికి కారణం రమ్యకృష్ణ అని ఎలా చెప్పుతున్నారనేది మీరు క్రింద చదవవచ్చు.

తమిళ మీడియా కథనం ప్రకారం...ప్రస్తుతం కమల్ డైరక్ట్ చేస్తున్న శభాష్ నాయుడు చిత్రంలో రమ్య కృష్ణ నటిస్తోంది. అంతేకాకుండా అందులో శృతి హాసన్ సైతం మేజర్ రోల్ , కమల్ కూతురుగా కనిపించనుంది. గౌతమి...కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తోంది. ఇక షూటింగ్ సమయంలో రమ్యకృష్ణకు, గౌతమి మధ్య విభేధాలు వచ్చినట్లు చెప్తున్నారు. అవి పెరిగి, పెద్దవయ్యాయని అంటున్నారు.

రమ్యకృష్ణతో డిస్ట్రబ్ అయ్యి..

రమ్యకృష్ణతో డిస్ట్రబ్ అయ్యి..

గౌతమికి, రమ్యకృష్ణకు విభేధాలు, మిస్ అండరస్టాండింగ్స్ రావటంతో వెంటనే గౌతమి చెన్నై వెనక్కి వచ్చేసిందిట. కమల్ మాత్రం రమ్యకృష్ణనే సపోర్ట్ చేసారట. ఫోన్ చేసి కూడా అసలు విషయం ఏమిటని గౌతమిని అడగలేదట. దాంతో గౌతమి చాలా డిస్ట్రబ్ అయ్యిందిట. దాంతో ఆమె ఈ కఠిన నిర్ణయం తీసుకుందని చెప్తున్నారు.

గౌన్ వేసుకోనందిట

గౌన్ వేసుకోనందిట

రమ్యకృష్ణకు,గౌతమికు మధ్య విభేదాలకు కారణం...గౌతమి డిజైన్ చేసిన గౌన్ ని, రమ్యకృష్ణ వేసుకోనని తిరస్కరించిందట. అంతేకాకుండా ఈవిషయమై గౌతమిపై కామెంట్స్ చేసిందిట. మరో ప్రక్క కమల్ సైతం రమ్యకృష్ణనే సపోర్ట్ చేసారట. దాంతో గౌతమి అవమానం ఫీలైందని తమిళ వెబ్ మీడియా అంటోంది.

కమల్ తో రమ్య..

కమల్ తో రమ్య..

కమల్ తో గతంలో రమ్యకృష్ణ...పంచతంత్రం చిత్రం చేసింది. అందులో ఆమె నెగిటివ్ టచ్ ఉన్న వాంప్ పాత్రను పోషించింది. అప్పటినుంచి కమల్ కు, రమ్య కృష్ణకు మధ్య టెర్మ్స్ బాగున్నాయి. ఏదో సెట్ లో జరిగిన సంఘటనతో ఆమెను విడవలేమనని, సాటి ఆర్టిస్ట్ తో తను విభేధించలేనని కమల్ వాదించాడట. అయితే కమల్ డైరక్టర్ కావటంతో..ఆయనే కలగచేసుకోవాలి కదా అని గౌతమి వాదన అని చెప్తున్నారు.

కమల్ మొదట వివాహం..

కమల్ మొదట వివాహం..

కమల్ 1978లో నృత్య కళాకారిణి వాణీ గణపతిని వివాహం చేసుకున్నారు. దశాబ్ద కాలం పాటు వారి వైవాహిక జీవితం సజావుగా సాగింది. ఆ తరువాత మనస్పర్ధల కారణంగా విడిపోయారు.

వివాహానికి ముందే శృతి

వివాహానికి ముందే శృతి

మొదటి భార్య నుంచి విడిపోయిన కొన్నాళ్లకు బాలీవుడ్ నటి సారికను ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు కమల్. నిజానికి వీరి పెళ్లి కన్నా ముందే అంటే 1986లో శ్రుతీహాసన్ పుట్టారన్నది గమనార్హం. 1991లో ఈ దంపతులకు అక్షరా హాసన్ పుట్టారు.

కాన్సర్ సోకినప్పుడు

కాన్సర్ సోకినప్పుడు

కాగా 2002లో విడాకులు తీసుకోవాలను కున్నారు. ఆ తర్వాత రెండేళ్లకు చట్టపరంగా విడాకులు తీసుకున్నారు. అటుపైన కొన్నాళ్లకు గౌతమితో కమల్ అనుబంధం మొదలైంది.ముఖ్యంగా ఆమెకు కేన్సర్ సోకినప్పుడు బాగా దగ్గరయ్యారు.

గౌతమి మొదటి భర్తతో డైవర్స్

గౌతమి మొదటి భర్తతో డైవర్స్

తెలుగమ్మాయి అయిన గౌతమి హీరోయిన్‌గా బిజీగా ఉన్నప్పుడే 1998లో వ్యాపారవేత్త సందీప్ భాటియాను వివాహం చేసుకున్నారు గౌతమి. 1999లో వారికి పాప పుట్టింది. తర్వాత మనస్పర్థల కారణంగా గౌతమి, సందీప్ భాటియా విడాకులు తీసుకున్నారు.

పదమూడేళ్ల నుంచీ..

పదమూడేళ్ల నుంచీ..

భర్త నుంచి విడిపోయాక కొన్నేళ్లు ఒంటరిగానే ఉన్న గౌతమికి కమల్‌తో మంచి అనుబంధం ఏర్పడడం, అది సహజీవనంగా మారడం అందరికీ తెలిసిందే. దాదాపు పదమూడేళ్లుగా ఈ ఇద్దరూ కలసి ఉంటున్నారు. ఇన్నేళ్ల బంధానికి ఇప్పుడు ఫుల్‌స్టాప్ పెట్టేశారు.

కలల హీరో ..కమల్

కలల హీరో ..కమల్

తన జీవితంలో తీసుకున్న అత్యంత కఠినమైన నిర్ణయమని తెలిపింది. 13 ఏళ్లుగా తమ సహజీవనం కొనసాగుతోందని, ఈ నిర్ణయం తనకు చాలా బాధ కలిగిస్తోందని గౌతమి పేర్కొంది. కమల్ తన కలల హీరో అని, చిన్నప్పటి నుంచి తన అభిమాన నటుడని, ఆయన నుంచి విడిపోయినప్పటికీ తన హీరో కమల్ హాసనేనని గౌతమి పేర్కొంది.

అత్యంత బాధాకరమైన నిర్ణయం

అత్యంత బాధాకరమైన నిర్ణయం

కమల్ హాసన్‌తో ఉన్న 13 సంవత్సరాల్లో ఆయన నుంచి ఎన్నో నేర్చుకున్నానని గౌతమి తెలిపారు. తన జీవితంలో తీసుకున్న అత్యంత బాధాకరమైన నిర్ణయమిదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సినీ పరిశ్రమకు రాకముందే కమల్‌ తన కలల హీరో అని గౌతమి కొనియాడారు. కమల్‌కు మరిన్ని విజయాలు రావాలని ఆమె ఆకాంక్షించారు.

పెళ్లిపై నమ్మకం లేకే

పెళ్లిపై నమ్మకం లేకే

తెలుగులో 'విచిత్ర సోదరులు' చిత్రం నుంచి కమల్, గౌతమిల స్నేహం చిగురించింది. తమ సహజీవనం గురించి గతంలో వీరు మాట్లాడుతూ వివాహ బంధంపై తమకు అంత విశ్వాసం లేకపోవడం వల్లే సహజీవనం చేస్తున్నట్లు తెలిపారు. 35 ఏళ్ల వయసులో రొమ్ము క్యాన్సర్‌‌కు గురైన గౌతమి అతి కష్టం మీద ఆ వ్యాధిని జయించారు. ఆ సమయంలో ఆమెకు కమల్ తోడుగా నిలిచారు.

అప్పటినుంచే మొదలు

అప్పటినుంచే మొదలు

ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లాలో పుట్టిన గౌతమి విశాఖలోని గీతం యూనివర్సిటీలో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. గౌతమి తొలిసారిగా నటించిన చిత్రం 'దయామయులు'. ఈ సినిమా 1987లో విడుదలైంది. అక్కడి నుంచి ఆమె సినీ ప్రస్థానం మొదలైంది. తెలుగు, తమిళ చిత్రాల్లో ఆమె నటించి మెప్పించారు.

రాజీపడి ఉండలేక

రాజీపడి ఉండలేక

పదమూడేళ్ల బంధాన్ని కాదనుకోవడం అంత సులువు కాదు. ఒక బంధానికి చాలా సిన్సియర్‌గా కట్టుబడి ఉన్న నేపథ్యంలో ఇద్దరి దారులు వేరని తెలిసినప్పుడు రెండు దార్లు ఉంటాయి. ఒకటి తమ కలలలను భగ్నం చేసుకుని రాజీపడి పోయి ఉండటం, రెండోది విడిపోయి ఎవరి దారిన వాళ్లు జీవించడం. మనసు ముక్కలయ్యే ఈ నిజాన్ని జీర్ణించుకోవడానికి కొంత సమయం పట్టింది. ఇది అనాలోచితంగా తీసుకున్న నిర్ణయం కాదు. చివరికి ఒక నిర్ణయం తీసుకునేలా చేసింది అని గౌతమి చెప్పుకొచ్చారు.

మార్పులకు తగినట్లుగా నిర్ణయాలు

మార్పులకు తగినట్లుగా నిర్ణయాలు

అందరి దగ్గర సానుభూతి సంపాదించుకోవాలన్నది నా అభిమతం కాదు. ఈ జీవిత ప్రయాణంలో మార్పు అనేది అనివార్యం అని అర్థమైంది. జీవితం ఎప్పుడూ ఒకేలా సాగదు. పరిస్థితులకు అనుగుణంగా కొన్ని మార్పులు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతి మార్పుకీ ఓ కారణం ఉంటుంది. ఈ మార్పులు ముందుగా గ్రహించలేనివి. అయితే వీటి ప్రభావం అనుబంధాల మీద చాలానే ఉంటుంది అని గౌతమి అన్నారు.

బెస్ట్ మదర్ గా ఉండాలనే

బెస్ట్ మదర్ గా ఉండాలనే

పదమూడేళ్ల బంధానికి ముగింపు పలకడం అనే నిర్ణయం తీసుకోవడం ఏ మహిళకైనా కష్టమే. పైగా ఇప్పుడు నేనున్న స్థితిలో చాలా కష్టం. కానీ, తప్పదు. ఎందుకంటే ముందు నేను తల్లిని. నా బిడ్డకు 'బెస్ట్ మదర్'గా ఉండటం నా బాధ్యత. అలాగే, నేనూ ప్రశాంతంగా ఉండడం నాకు ముఖ్యం అని గౌతమి చెప్పుకొచ్చారు.

ఇంకా ఆయన చాలా చేయాలి

ఇంకా ఆయన చాలా చేయాలి

నేను ఇండస్ట్రీ రాక ముందు నుంచే కమల్ అంటే ఇష్టం. ఆయన ప్రతిభ మీద నాకు అపారమైన గౌరవం. ఆయన ఎదుర్కొన్న ప్రతి సవాళ్లకు నేను వెన్నంటే ఉన్నాను. అవి నాకు అమూల్యమైన క్షణాలు. నేను ఆయన సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా చేసినప్పుడు చాలా విషయాలు నేర్చుకున్నాను. నా క్రియేషన్ ద్వారా ఆయన సినిమాలకు న్యాయం చేసినందుకు గర్వంగా ఉంది. ఆయన ఎన్నో చేశారు. కానీ, ఆడియన్స్ కోసం ఇంకా ఆయన నుంచి చాలా రావాల్సి ఉంది. ఆయన రానున్న విజయాలను చూసి, ఆనందించాలనుకుంటున్నా.

నాకు అభ్యంతరం లేదు

నాకు అభ్యంతరం లేదు

కమల్‌హాసన్ నటిస్తున్న అన్ని చిత్రాలకూ గౌతమి కాస్ట్యూమ్ డిజైనర్‌గా చేస్తున్నారు. ప్రస్తుతం రూపొందుతున్న 'శభాష్ నాయుడు'కి కూడా ఆమే డిజైనర్. విడిపోతున్నప్పటికీ, ఇకపై కూడా కమల్ చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా చేయడం తనకు అభ్యంతరం లేదనీ, అది తన వృత్తి అనీ ఓ టీవీ చానల్‌తో మాట్లాడుతూ గౌతమి స్పష్టం చేశారు

నా ఫీలింగ్స్ కు ప్రాధాన్యత లేదు

నా ఫీలింగ్స్ కు ప్రాధాన్యత లేదు

కమల్, తానూ విడిపోతున్న విషయాన్ని గౌతమి ప్రకటించిన నేపథ్యంలో కమల్‌ని సంప్రదించగా, కొన్ని క్షణాలు మౌనంగా ఉండి ఆ తర్వాత కమల్ పెదవి విప్పినట్లు కొన్ని పత్రికల్లో, సైట్స్‌లో వచ్చింది. ''ఇప్పుడు నా ఫీలింగ్స్‌కి ప్రాధాన్యం లేదు. గౌతమి, సుబ్బు సౌకర్యవంతంగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నా. వాళ్లకు మంచి జరగాలని ఆశిస్తున్నా. ఎప్పుడు కావాలన్నా వాళ్ల కోసం నేనున్నానన్నది వాళ్లు తెలుసుకోవాలి. శ్రుతి, అక్షర, సుబ్బలక్ష్మి (గౌతమి కూతురు)- ముగ్గురు కూతుళ్ల తండ్రిగా ఈ ప్రపంచంలో నేను లక్కీయస్ట్ ఫాదర్ అనుకుంటున్నా'' అని కమల్ వ్యాఖ్యానించినట్లు ఆ వార్తలు పేర్కొన్నాయి.

కమల్ హాసన్ ట్వీట్ లో

కమల్ హాసన్ ట్వీట్ లో

''ఇలాంటి సమయంలో నా పేరు మీద ఎవరో ఏదో ప్రకటిస్తున్నారు. అలా ఆడుకోవడం వివేక వంతం కాదు. దాన్ని అనాగరికం అంటారు. ఇప్పుడు నేనేదీ ప్రకటించాలనుకోవడం లేదు'' అని ఆ ప్రకటనలో పేర్కొ న్నారు. అలా పత్రికల్లో తన పేర వస్తున్న వార్తలు తప్పని ఆయన చెప్పకనే చెప్పారు. ఆ తరువాత కాసేపటికి ఆయన పక్షాన మీడియా పర్సన్ మరింత వివరంగా ప్రకటన చేశారు.

కంటిన్యూ షెడ్యూల్

కంటిన్యూ షెడ్యూల్

గాయం నుంచి కోలుకుంటున్న కమల్‌ వచ్చే జనవరి నుంచి శభాష్ నాయుడు సినిమా షూటింగ్ లో పాల్గొంటారు. ఈ సినిమాలో రమ్యకృష్ణ, ప్రత్యేక పాత్రలో శృతి హాసన్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో కమల్‌కు జోడీగా సీనియర్‌ నటి రమ్యకృష్ణ నటిస్తుండగా, ‘దశావతారం'లోని బలరామ్‌ నాయుడు పాత్రకు కొనసాగింపుగా కామెడీ థ్రిల్లర్‌ సబ్జెక్టుతో ‘శభాష్‌ నాయుడు' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తెలుగు అగ్ర హాస్యనటుడు బ్రహ్మానందం కీలకపాత్రలో నటిస్తున్నారు. అమెరికాలో తొలి షెడ్యూల్‌ షూటింగ్‌ జరిగింది.

English summary
Ever Since Gautami announced her split with Kamal Haasan, many speculations have been doing rounds with regards to the reason for their split. Now the latest buzz is that there is some misunderstanding between Gautami and Kamal Haasan’s Sabash Naidu pair Ramya Krishnan. However, no one knows how much truth is there in this buzz.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu