»   » కమల్ 'దృశ్యం' రీమేక్ రిలీజ్ డేట్

కమల్ 'దృశ్యం' రీమేక్ రిలీజ్ డేట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : 'విశ్వనటుడు' కమల్‌హాసన్‌ నటిస్తున్న కొత్త చిత్రం 'పాపనాశం'. మలయాళంలో పెద్ద హిట్‌ సొంతం చేసుకున్న 'దృశ్యం' చిత్రానికి రీమేక్‌ ఇది. తెలుగులో వెంకటేశ్‌, మీనా నటనలో అదే పేరుతో విడుదలై విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని జూలై 17న విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

తమిళంలో కమల్‌కు భార్యగా గౌతమి నటిస్తున్నారు. తిరునెల్వేలి సమీప ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపారు. ప్రస్తుతం నిర్మాణాంతర పనులు జరుగుతున్నాయి. అవి కూడా ఆఖరుకు చేరుకున్నట్లు చిత్రవర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా ఇందులో కమల్‌ కేబుల్‌ ఆపరేటర్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.

కేబుల్‌ కలెక్షన్‌ బాయ్‌గా 'పసంగ' శ్రీరామ్‌ నటిస్తున్నారు. 'పసంగ'తో గుర్తింపు తెచ్చుకున్న ఈ బాలనటుడు ఇప్పుడు కుర్రాడిగా పలు సినిమాల్లో కనిపిస్తున్నారు. త్వరలోనే హీరోగా కూడా పరిచయం కానున్నట్లు తెలుస్తోంది.

Kamal Haasan’s ‘Papanasam’ gets a release date

ఇక కమలహాసన్‌ నటించిన తాజా చిత్రం 'ఉత్తమ విలన్‌' ప్రస్తుతం ప్రదర్శితమవుతోంది. కమలహాసన్‌ నటిస్తున్న 'పాపనాశం' చిత్రీకరణ పనులు దాదాపు ముగియగా త్వరలో ఆ చిత్రం విడుదల కానుంది. అదే క్రమంలో 'విశ్వరూపం- 2' కూడా విడుదలకానుంది. అంతకుముందే కమల్‌ నటించే తర్వాతి చిత్రం 'తూంగావనం'గా ప్రకటించేశారు.

ఈ చిత్రం ఫొటో షూట్‌ ఇటీవల నగరంలోని ఏవీఎం స్టుడియోలో జరగ్గా 24న చిత్రీకరణ పనులు ప్రారంభమయ్యాయి. వివాదాల సుడిలో ఉన్న 'విశ్వరూపం- 2' కమల్‌ అభిమానుల్లో ఆసక్తి రేపుతున్న సందర్భంగా 'తూంగావనం' చిత్రీకరణ పనులు ప్రారంభం కావడంతో దాని కథ నేపథ్యంపై విశ్వనటుడి అభిమానుల్లో కొత్త అంచనాలు నెలకొన్నాయి.

రాజ్‌కమల్‌ ఫిల్మ్‌ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. మే 24న హైదరాబాద్‌లో ఈ చిత్ర షూటింగ్‌ను ప్రారంభిస్తామని కమల్‌ వెల్లడించారు. గతంలో కమల్‌ దగ్గర సహాయకుడిగా పనిచేసిన ఎం.రాజేష్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తానని కమల్‌ హసన్‌ పేర్కొన్నారు.

వాస్తవానికి ...వెంకటేష్‌తో కలసి నటించిన 'ఈనాడు' తర్వాత కమల్‌ హాసన్‌ తెలుగులో నేరుగా సినిమా చేయలేదు. ఆయన తమిళంలో నటించిన చిత్రాలే తెలుగులో అనువాదమవుతూ వస్తున్నాయి. త్వరలోనే మరో తెలుగు సినిమా చేస్తా అని చెబుతూ వస్తున్నారు కమల్‌.

తన దగ్గర శిష్యరికం చేసిన రాజేష్‌.ఎమ్‌.సెల్వ దర్శకత్వం వహిస్తున్నట్లు తెలిపారు కమల్‌. తెలుగు, తమిళ భాషల్లో కమల్‌ సొంత నిర్మాణ సంస్థ రాజ్‌కమల్‌ ఫిలిమ్స్‌లో ఒకేసారి చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. తమిళంలో 'తూంగావనం' అనే పేరును ఖరారు చేశారు.

థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందనున్న ఈ సినిమాని 40 రోజులు హైదరాబాద్‌లో, 40 రోజులు చెన్నైలో చిత్రీకరిస్తామని కమల్‌ స్పష్టం చేశారు. ఇతర నటీనటులెవరనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సాను వర్గీస్‌, సంగీతం: జిబ్రాన్‌

జెట్ స్పీడుతో యాభై పై బడిన వయస్సులోనూ కమల్ పరుగులు తీస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. కమల్‌హాసన్‌ నటించిన మూడు సినిమాలు 2015లో విడుదల అవుతున్నాయి. ‘ఉత్తమ విలన్‌'(ఇప్పటికే రిలీజైంది), ‘విశ్వరూపం-2', ‘పాపనాశం'... (దృశ్యం రీమేక్) ఈ మూడు సినిమాలూ ఈ ఏడాది ప్రథమార్ధంలోనే ప్రేక్షకులకు కనువిందు చేయనున్నాయి. దాదాపు 30 ఏళ్ల తర్వాత ఇలా కమల్‌ నటించిన మూడు సినిమాలు ఒకే ఏడాది విడుదల కానుండటం గమనార్హం.

మరో విశేషమేమిటంటే... ఈ మూడు చిత్రాలకు గిబ్రన్‌ (రన్ రాజా రన్ చిత్రం సంగీత దర్శకుడు) సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ‘విశ్వరూపం-2' సినిమా, మలయాళ హిట్‌ సినిమా ‘దృశ్యం' రీమేక్‌ ‘పాపనాశం' ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకున్నాయి. నిర్మాణానంతర పనులు జరుపుకుంటున్నాయి.

‘పాపనాశం' కేవలం 39 రోజుల్లో చిత్రీకరణను పూర్తి చేశారు. మలయాళ మాతృకను తెరకెక్కించిన జీతు జోసెఫ్‌ తమిళంలోనూ దర్శకత్వం వహిస్తున్నారు. కేరళలోని తొడపుళలో ఇటీవల పతాక సన్నివేశాలను చిత్రీకరించారు. గౌతమి కమల్‌హాసన్‌ భార్యగా నటిస్తున్న చిత్రమిది.

దాదాపు 15 ఏళ్ల విరామం తర్వాత గౌతమినటిస్తున్న చిత్రమిదే కావడం గమనార్హం. మలయాళ మాతృక దర్శకుడు జీతూ జోసఫ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

English summary
Kamal Haasan is ready to entertain the Tamil audience with the remake of ‘Drishyam’. Titled as Papanasam, veteran actress Gauthami will reprise Meena’s role. Directed by Jeethu Joseph, this movie will hit the screens on July 17th.
Please Wait while comments are loading...