»   » హాట్ టాపిక్ :మలయాళ రీమేక్‌లో కమల్, వెంకీ, అక్షయ్ కుమార్

హాట్ టాపిక్ :మలయాళ రీమేక్‌లో కమల్, వెంకీ, అక్షయ్ కుమార్

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: తెలుగులో రీమేక్ ల రాజా వెంకటేష్, అలాగే సూపర్ హిట్ చిత్రాలపై కన్నేసి రీమేక్ లు చేసే విశ్వనటుడు కమలహాసన్, అక్షయ్ కుమార్ ఇప్పుడు వీళ్లు ముగ్గరూ మరో మలయాళ చిత్ర రీమేక్‌లో నటించడానికి రెడీ అవుతున్నారన్నది తాజా సమాచారం.

ఆ చిత్రం మరేదో కాదు.. మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ నటించిన తాజా చిత్రం ఒప్పం. సముద్రకని, అనుశ్రీ, విమలారామన్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ప్రియదర్శన్ దర్శకుడు. ఇందులో మోహన్‌లాల్ అందుడి పాత్రలో నటించారు.ఇటీవల ఓనం పండగ సందర్భగా విడుదలైన ఈ చిత్ర విశేష ప్రేక్షకాదరణతో ప్రదర్శింపబడుతోంది.

ముఖ్యంగా అంధుడిగా మోహన్‌లాల్ నటనను విమర్శకులు సైతం ప్రశంసిస్తున్నారు. ఈ చిత్రం హిందీతో సహా ఇతర దక్షిణాది భాషల్లో పునర్నిర్మాణానికి రంగం సిద్ధమవుతోందని సమాచారం. ఈ చిత్రాన్ని ఇటీవల సూపర్‌స్టార్ ప్రత్యేక ప్రదర్శనలో తిలకించారు. ఆ తరువాత విశ్వనటుడు కమలహాసన్ చూశారు. ఇప్పుడీయన తమిళ వెర్షన్‌లో నటించడానికి సిద్ధమవుతున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. వెంకటేష్ సైతం ఈ రీమేక్ పై చాలా ఆసక్తి చూపుతున్నట్లు చెప్తున్నారు.

Kamal Haasan

ఇంతకు ముందు మోహన్‌లాల్ మలయాళంలో నటించిన దృశ్యం చిత్రం ఇతర అన్ని భాషల్లోనూ రీమేక్ అయి మంచి విజయాన్ని సాధించింద న్నది.దృశ్యం తమిళ రీమేక్‌లోనూ కమల్ , తెలుగులో వెంకటేష్ నటించి సూపర్‌హిట్ సాధించారు. ప్రస్తుతం కమల్ శభాష్‌నాయుడు, వెంకటేష్ గురు చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. వీరి తాజా చిత్రాలు పూర్తి కాగానే ఈ రీమేక్ ని పట్టాలు ఎక్కిస్తారు.

కమల్ ఆ మధ్య ప్రమాదానికి గురై, ప్రస్తుతం బెడ్ రెస్ట్‌లో ఉన్నారు కమల్. ఈ కారణంగా ఆయన నటించి, దర్శకత్వం వహిస్తున్న 'శభాష్ నాయుడు' చిత్రం షూటింగ్‌కి చిన్న బ్రేక్ పడింది.నవంబర్‌లో పునః ప్రారంభించనున్నారు. ఈలోపు ఇంట్లో స్క్రిప్ట్‌లు గురించి ఆలోచించడంతో పాటు సినిమాలు కూడా చూస్తున్నారాయన. 'ఒప్పమ్' కథ, అందులో మోహన్‌లాల్ చేసిన అంధుడి పాత్ర బాగా నచ్చి, ఈ చిత్రం తమిళ రీమేక్‌లో నటించాలనుకుంటున్నారట. ఈ విషయాన్ని దర్శకుడు-నటుడు సముద్రఖని నర్మగర్భంగా బయటపెట్టారు.

మలయాళ 'ఒప్పమ్'లో ఆయన విలన్‌గా నటించారు. ''ఈ చిత్రం ఇంతటి ఘనవిజయం సాధించినందుకు ఆనందంగా ఉంది. తమిళ రీమేక్‌లో కమల్‌హాసన్‌గారు నటిస్తారని విన్నాను. చాలా సంతోషం'' అని సముద్రఖని పేర్కొన్నారు.

అంతేనా అక్షయ్ దృష్టి కూడా... ఈ చిత్రంపై పడిందని సమాచారం. రజనీకాంత్ హీరోగా రూపొందుతున్న '2.0'లో విలన్ గా నటిస్తున్న హిందీ హీరో అక్షయ్‌కుమార్ దృష్టి కూడా 'ఒప్పమ్'పై పడిందట. ఈ చిత్రం హిందీ రీమేక్ హక్కులను ఆయన దక్కించుకోవాలనుకుంటున్నారని సమాచారం.

English summary
Kamal Haasan will play the lead in the Tamil remake of 'Oppam'. Director turned actor Samuthirakani, who played the baddie in 'Oppam', hinted at it with a tweet that read, "Very happy & proud to be part of Oppam, super happy with the success!! Heard Ulaganayagan going to remake in."
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X