For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  'విశ్వరూపం- 2' రిలీజ్ : లేటెస్ట్ ఇన్ఫో

  By Srikanya
  |

  చెన్నై : యూనివర్సిల్ హీరో కమల్‌హాసన్‌ నటించిన 'విశ్వరూపం' చిత్రం అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు రెండో భాగంగా 'విశ్వరూపం- 2' దాదాపుగా పూర్తయి మూడేళ్లు కావస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా ఆస్కార్‌ ఫిలిమ్స్‌ అధినేత ఆస్కార్‌ రవిచంద్రన్‌ వద్ద ఉంది. అయితే కొన్ని కారణాలతో సినిమా విడుదల కాలేదు.

  ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

  ఆస్కార్‌ బ్యానరుపై ఇటీవల విడుదలైన 'ఐ' చిత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో ఈ సినిమా విడుదలలో జాప్యం జరుగుతున్నట్లు కోలీవుడ్‌ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా ప్రస్తుతం కమల్‌హాసన్‌, ఆస్కార్‌ రవిచంద్రన్‌ మధ్య ఈ విషయానికి సంబంధించి చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ సమస్య దాదాపు కొలిక్కి వచ్చిందని, సినిమా హక్కులను రాజ్‌కమల్‌ ఫిలిమ్స్‌ సొంతం చేసుకునే అవకాశమున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి.

  మొత్తానికి అనుకున్నట్టు జరిగితే సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇందులో పూజాకుమార్‌, ఆండ్రియా, రాహుల్‌ బోస్‌, శేఖర్‌కపూర్‌, ఆనంద్‌ మహదేవన్‌ తదితరులు నటించారు. జిబ్రాన్‌ సంగీతం సమకూర్చారు. కమల్‌హాసన్‌ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై ఆయన అభిమానులు కోటి ఆశలు పెట్టుకున్నారు.

  కమల్ హాసన్ మాట్లాడుతూ.... " నాకు ఈ చిత్రం ఎందుకు విడుదల లేటవుతోందో తెలియదు. నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ ఈ చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందో నిర్ణయించుకోవాలి. అసలు ఈ చిత్రం విడుదల కాకుండా ఎందుకు ఆగుతుందో కారణం తెలుసుకోవాలి." "ఆ సినిమా రిలీజ్ అయ్యేదాకా నేను ఐడిల్ గా కూర్చోలేను. అందుకే నేను ఉత్తమ విలన్, పాప నాశమ్ చిత్రాలు చేసాను ." అన్నారు.

  Kamal Haasan takes Decision on 'Vishwaroopam 2'

  రెండో భాగంలోనూ అంతర్జాతీయ ఉగ్రవాదం ప్రస్తావన ఉంటుంది. దాంతోపాటు తల్లీబిడ్డల అనుబంధాన్ని ఆవిష్కరించబోతున్నారు. ఇందులో యుద్ధ ఘట్టాలు ఉత్కంఠను రేకెత్తిస్తాయని సమాచారం. ఇక 'విశ్వరూపం'లో చూపించలేకపోయిన కొన్ని సన్నివేశాలను సీక్వెల్ లో చూడొచ్చని కమల్‌హాసన్‌ తెలిపారు. ఇందులో యుద్ధ సన్నివేశాలు మరింత బ్రహ్మాండంగా ఉంటాయి. తొలి భాగంలో చూపించలేకపోయిన ప్రేమ, రొమాన్స్‌ సన్నివేశాలే కాక తల్లీకొడుకు మధ్య ఉండే అప్యాయత, అనురాగాలను కూడా కొనసాగింపులో చూపనున్నట్లు ఆయన వివరించారు.

  కమల్ మాట్లాడుతూ ''వివాదాల అవరోధాలను దాటుకుని విడుదలైంది. తొలి భాగంలో కొన్ని అంశాలు చూపించలేకపోయాను. ప్రేమ ఘట్టాలు లేవు. అలాగే తల్లీకొడుకుల మధ్య ఉండే ఆప్యాయతానురాగాలు లేవు. వాటన్నింటికి 'విశ్వరూపం 2'లో స్థానం ఉంది. ఇందులో యుద్ధానికి సంబంధించిన సన్నివేశాలు మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ప్రస్తుతం సీక్వెల్‌ను తెరకెక్కించే పనిలో తీరిక లేకుండా ఉన్నాను'' అన్నారు.

  విశ్వరూపం చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిస్తున్న స్పై థ్రిల్లర్ చిత్రంలో మేజర్ వసీం ఆహ్మద కశ్మీరి పాత్రను కమల్ పోషిస్తున్నారు. ఈ చిత్రంలో కమల్ తల్లి పాత్రను బాలీవుడ్ నటి వహిదా రహ్మన్ పోషిస్తుండగా, రాహుల్ బోస్, పూజా కుమార్, శేఖర్ కపూర్, ఆండ్రియా జెర్మియాలు నటిస్తున్నారు.

  ఇక ''విశ్వరూపం' విడుదల విషయంలో కమల్‌ హాసన్‌ ఎన్నో ఇబ్బందులెదుర్కొన్నారు. ఆ సమయంలో ఆయనకు మద్దతుగా నిలవలేకపోయినందుకు బహిరంగంగా క్షమాపణలు చెబుతున్నా'' అని ఆమీర్‌ ఖాన్‌ అన్నారు.

  ''విశ్వరూపం' విషయంలో పరిశ్రమ మొత్తం ఒక్కటై కమల్‌కు బాసటగా నిలవాల్సింది. అయితే పని ఒత్తిడి వల్ల నేను వ్యక్తిగతంగా మద్దతు తెలపలేకపోయా. ఈ విషయమై ఇప్పటికీ చింతిస్తుంటాను'' అని చెప్పారు ఆమీర్‌. నిషేధిత పదాలంటూ సెన్సార్‌ బోర్డు ఇటీవల ఓ జాబితాను విడుదల చేయడం వివాదాస్పదమైన విషయంపైనా ఆమీర్‌ స్పందించారు.

  అమీర్ ఖాన్ మాట్లాడుతూ... ''ఏ అంశాన్నైనా సెన్సార్‌ బోర్డు నిషేధించడాన్ని నేను ఆమోదించను'' అన్నారు. 'సెన్సార్‌ బోర్డు కేవలం సర్టిఫికేషన్‌ చేసే సంస్థేనని దానికి నిషేధించే అధికారం లేద'ని స్వయంగా సమాచార ప్రసార శాఖ మంత్రి చెప్పినట్లు ఆమీర్‌ తెలిపారు. సెన్సార్‌ బోర్డు అనుమతి పొందిన సినిమాల విడుదలకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే అని ఆమీర్‌ అన్నారు.

  ''ఒక చిత్రానికి సెన్సార్ బోర్డ్ సర్టిఫికెట్ జారీ అయ్యాక, ఆ చిత్రం విడుదలను అడ్డుకునే హక్కు ఎవరికీ ఉండదు. ఒకవేళ ఎవరైనా అడ్డుకోవాలని ప్రయత్నిస్తే, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నట్లే'' అని ఆమిర్ ఖాన్ అన్నారు. వాటిలో సెన్సార్ సర్టిఫికెట్ పొందిన చిత్రాలను నిషేధించడానికి కొందరు చేస్తున్న ప్రయత్నం గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ సందర్భంగా కమల్‌హాసన్ నటించి, దర్శకత్వం వహించిన 'విశ్వరూపం' చిత్రాన్ని గుర్తు చేసుకున్నారు.

  ''కమల్‌హాసన్ 'విశ్వరూపం' చిత్రాన్ని నిషేధించిన సమయంలో నా పనులతో నేను బిజీగా ఉండటం వల్ల ఈ విషయం గురించి పట్టించుకోలేకపోయాను. వాస్తవానికి ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనే పరిశ్రమ మొత్తం ఏకతాటిపై నడవాలి. కానీ, ఆ పని చేయడానికి నా వంతుగా నేను ముందుకు రానందుకు సిగ్గుపడుతున్నా.

  కమల్‌హాసన్‌కి సహాయం చేయలేకపోయినందుకు ఆయనకు బహిరంగంగా క్షమాపణ చెబుతున్నా. 'కమల్‌గారూ! మీరు ఇబ్బందిలో ఉన్న సమయంలో మీ వెంట మేం లేకపోయినందుకు చాలా బాధపడుతున్నా'. సెన్సార్ ఆమోదం పొందిన ఏ చిత్రాన్నీ ఎవరూ నిషేధించకూడదు. అలాంటి నిషేధాలను నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నా'' అన్నారు.

  కమల్ ఇలా అన్నారు. ...'సినిమాల విషయంలో సెన్సార్‌ బోర్డు తన పరిధికి మించి జోక్యం చేసుకుంటోంద'ని ప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌ విమర్శించారు. 'ఉత్తమ విలన్‌'కు సంబంధించి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ''సినిమా వాళ్లు ఏం చేయాలో ఏం చేయకూడదో చెప్పేందుకు సెన్సారు బోర్డు ప్రయత్నిస్తోంది. దీన్ని నేను సమ్మతించను'' అని కమల్‌ అన్నారు.

  English summary
  Right now Aascar Movies is facing a huge financial crunch and the fate of the films produced by them remains uncertain. Kamal has reportedly taken the decision to buy back the rights of the Vishwaroopam 2 film and release it himself. We will get official confirmation on this after Ulaganayagan returns from shooting the first schedule of ‘Thoongavanam’.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X