»   » బిగ్ బాస్ ఆపేయ్యండి: కేసు ఫైల్, నిర్వాహకుల అరెస్టుకు డిమాండ్

బిగ్ బాస్ ఆపేయ్యండి: కేసు ఫైల్, నిర్వాహకుల అరెస్టుకు డిమాండ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హిందీలో సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరించిన బిగ్ బాస్ షోని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుని తమిళంలో కమల్ హాసన్ చేస్తున్న తమిళ బిగ్ బాస్ షో అక్కడ సక్సెస్ కాకపోగా పైపెచ్చు కమల్ కి మరిన్ని సమస్యలనే తెచ్చిపెడుతోంది. మొన్నటికి మొన్న తమిళ నటి లక్షి రామకృష్ణన్ ఈ కార్యక్రమానికి సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేసారు.

అది ఒక బూతు షో అని దాని వల్ల ఎన్నో కుటుంబాలు నాశనం అవుతాయని ఆమె మండి పడ్డారు. ఇప్పుడు ఇది ఇండస్ట్రీలో ఒక హాట్ టాపిక్ గా మారింది. అంతే కాదు ఈ ప్రోగ్రాం కి టీఆర్పీ కూడా పెద్దగా లేదు. సరే అవన్నీ దాటుకొని అయినా ఆ షోని రన్ చేద్దామంటే ఇప్పుడు ఇంకో చిక్కొచ్చి పడింది. కమల్ హాసన్ పై తమిళ సంఘాలు కేసు వేశాయి.

Kamal Haasan threatened for hosting 'Bigg Boss' Show

కమల్ హాసన్ బిగ్ బాస్ వ్యాఖ్యాతగా వ్యవహరించడంపై తమిళ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.హిందూ మక్కల్ కాచ్చి అనే సంస్థ మరింత బకంగా ఈ షో ని వ్యతిరేకిస్తోంది . కమల్ హాసన్ తమిళులు, తమిళనాడుకు వ్యతిరేకంగా పని చేస్తున్నారని ఆరోపిస్తూ. బిగ్ బాస్ షో లాంటి షోకు ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరించడం సరికాదని పేర్కొంటున్నాయి. తక్షణం ఆయన ఆ షో నుంచి వైదొలగాలని డిమాండ్ చేస్తున్నాయి.

ఆ షో తమిళుతో పాటు, తమిళనాడు సంస్కృతి, సంప్రదాయాలను మంటగలుపుతోందని వారు మండిపడుతున్నారు. కాగా, బిగ్ బాస్ షోలో సెలెబ్రటీలు కెమెరాల ముందు జీవించాల్సి ఉంటుంది. ఒకే ఇంట్లో ఒకే చోట వారి జీవనం ఉంటుంది. కంచం, మంచం, బాత్రూం వంటివన్నీ ఒకే చోట ఉంటాయి. అయితే ఈ విధానంపై పలువురు తమిళులు మండిపడుతున్నారు.

English summary
Reportedly, The group Hindu Makkal Katchi (HMK) has filed a case against Bigg Boss Tamil and has demanded arrest of Kamal Haasan and the show's participants citing threat to Tamil culture.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X