»   » మన్మథబాణంలో బూతు పాట రాసిన కమలహాసన్

మన్మథబాణంలో బూతు పాట రాసిన కమలహాసన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

కమల్ హాసన్, త్రిష హీరోహీరోయిన్లుగా నటిస్తున్న మన్మథ బాణం చిత్రంలో కమల్ బూతు పాటను ఒకదాన్ని రాశాడని తమిళనాడులోని మక్కల్ కచ్చి ఆరోపిస్తోంది. ఆ పాటను తక్షణం తొలగించాలని డిమాండ్ చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కమల్ రాసిన పాట హిందువుల మనోభావాలను గాయపరిచేదిగా ఉన్నదని మండిపడింది. ముఖ్యంగా తమిళంలోని వేదాలు, ప్రబంధాలను విమర్శిస్తూ సాగిన ఈ పాట మహిళలు అత్యంత భక్తశ్రద్ధలతో జరుపుకునే వరలక్ష్మి వ్రతాన్ని కూడా విమర్శించేదిగా ఉందని విమర్శించింది. పైగా ఈ పాట రతి కార్యక్రమాలే నేపథ్యంగా తీసుకుని సాగిందని తెలిపింది. కనుక వెంటనే కమల్ హాసన్, త్రిషలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మక్కల్ కచ్చి కోరింది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu