»   » నటుడినవుతానని అనుకోలేదు: కమల్‌హాసన్‌

నటుడినవుతానని అనుకోలేదు: కమల్‌హాసన్‌

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : కె.బాలచందర్‌(కేబీ) చిత్రాల్లో నటించాలంటే ఎనలేని ఇష్టం. ఆయన తెరకెక్కించిన వాటన్నింట్లోనూ ఒక సన్నివేశంలోనైనా కనిపించాలనుకునేవాణ్ని. అలా కొన్ని సినిమాల్లో నటించాను కూడా. నా చిత్రాలతో కేబీ ఎదిగినట్టు చెప్పడంలో ఇసుమంత నిజం కూడా లేదు. ఆయన కారణంగానే ఈ రోజు ఇంతటిస్థాయి కథానాయకుడిగా మీ ముందున్నా. అసలు నేను నటుడినవుతాననే నమ్మకం కూడా లేదు. ఆ నమ్మకాన్ని కల్పించింది.. కె.బాలచందరే అని కమల్ హాసన్ చెప్పారు.

'నినైత్తాలే ఇనిక్కుం' కోసం కేబీ నన్ను పిలిచారు. వారి కార్యాలయానికి సైకిల్‌లో వెళ్లా. నటించాలని చెప్పారు. ఆ సంతోషం ఇప్పటికీ మరిచిపోలేనిది. కొద్దిసేపటికి మరో వ్యక్తితో మాట్లాడుతున్నారు. ఎవరతను, ఎందుకొచ్చారని కేబీ మేనేజరును అడిగా. ఇందులో ఆయన కూడా నటిస్తున్నారని చెప్పారు. నాకు భయమేసింది. ఏదో చిన్న వేషం తగిలిస్తారేమోనని భయపడ్డా. కేబీగారి దగ్గరికెళ్లి 'ఏంటి సార్‌ ఆయన కూడా నటిస్తున్నారా?' అని అడిగా. 'అదేం లేదులేరా.. నువ్వే ఇందులో హీరో. ఓ ముఖ్యమైన పాత్రను అతను పోషిస్తున్నారని చెప్పారు. ఆ వ్యక్తి మరెవరో కాదు.. రజనీకాంత్‌! మా ఇద్దరి కలయికలో మరో విజయంగా నిలిచింది అన్నారు.

కె.బాలచందర్‌ దర్శకత్వంలో విశ్వనటుడు కమల్‌హాసన్‌, సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కలసి నటించి భారీ విజయం సాధించిన సినిమా 'నినైత్తాలే ఇనిక్కుం'. 1979లో విడుదలైన ఈ చిత్రం కోలీవుడ్‌లో సంచలనం సృష్టించింది. జయప్రద హీరోయిన్. ఎంఎస్‌ విశ్వనాథన్‌ అద్భుతమైన సంగీతం అందించారు. ఇందులో 'ఎంగేయుం ఎప్పోదుం..' అంటూ సాగే పాట ఇప్పటికీ యువతను ఆకట్టుకుంటోందంటే అతిశయోక్తి కాదు. యువతకు పెద్దపీట వేసిన ఈ సినిమా ప్రస్తుతం డిజిటల్‌ హంగులతో మళ్లీ తెరపైకి వస్తోంది.

ట్రైలర్‌ విడుదల వేడుక చెన్నైలో జరిగింది. కె.బాలచందర్‌, కమల్‌హాసన్‌, ఎంఎస్‌ విశ్వనాథన్‌, కేఎస్‌ రవికుమార్‌, అమీర్‌, దర్శకుల సంఘం అధ్యక్షుడు విక్రమన్‌, నిర్మాతల మండలి అధ్యక్షుడు కేఆర్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కె.బాలచందర్‌, కమల్‌హాసన్‌లు తమ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

అంచనాలను తలకిందులు చేశా.. కె.బాలచందర్‌

బాల చందర్ మాట్లాడుతూ.... తొలికాపీ పూర్తయిన తర్వాత నేను, కమల్‌హాసన్‌ కలసి సినిమా చూశాం. ఇద్దరం సినిమా గురించి మాట్లాడుకోలేదు. ఆ తర్వాత లిఫ్టు దిగి వస్తుండగా కమల్‌ను అతని స్నేహితుడు 'సినిమా ఎలా వచ్చింది?' అని అడిగాడు. అందుకు కమల్‌ ఫర్వాలేదన్నట్లు తలూపాడు. నాకు ఎందుకో కాస్త బాధేసింది. విడుదలై ఘనవిజయం సాధించింది. 34ఏళ్ల తర్వాత మళ్లీ ఆధునిక హంగులతో థియేటర్లలోకి వస్తోంది. అంటే.. నేను ఎంత గెలిచానో అర్థం చేసుకోండి. కమల్‌ అంచనాలను తారుమారు చేశా. ఇంతకు మించిన ఆనందం ఇంకేముంటుంది. ఇద్దరు హేమాహేమీలతో కలసి పనిచేయడం ఎంతో ఆనందాన్నిచ్చింది. నావల్ల కమల్‌ అభివృద్ధి చెందాడా? కమల్‌ కారణంగా నేను ఎదిగానా? అనే ప్రశ్నలు నాలో చాలాసార్లు వచ్చాయి అని చెప్పారు.

English summary
Kamal Hassan has claimed that their mentor K Balachander blunted their egos in their initial days. Rajinikanth and Kamal Hassan acted together in over 15 movies. Starting from Apoorva Raagangal, which was Kamal's debut film as hero, they worked together in a series of K Balachander's films.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu