»   » దర్శకుడు సెల్వరాఘవన్ కి పెద్ద షాక్ ఇచ్చిన కమల్ హాసన్

దర్శకుడు సెల్వరాఘవన్ కి పెద్ద షాక్ ఇచ్చిన కమల్ హాసన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

కమల్‌ హాసన్ తాజాగా సెల్వరాఘవన్ దర్శకత్వంలో 'విశ్వరూబమ్"(విశ్వరూపం) చిత్రంలో నటించనున్నారన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం గురించి రోజుకో న్యూస్ వచ్చి కమల్ అభిమానులును ఆనందపరుస్తోంది. అయితే కమల్ ఊహించని విధంగా ఓ ట్విస్ట్ ఇచ్చి అందరికీ షాక్ ఇచ్చారు. సినిమా షూటింగ్ మరి కొద్ది రోజుల్లో లండన్ లో ప్రారంభం కానుందనగా కమల్ హాసన్ తన దర్శకుడు సెల్వ రాఘవన్ ని డైరక్టర్ గా వద్దన్నారు. తానే చిత్రాన్ని డైరక్ట్ చేసుకుంటానని ప్రకటించారు.ఈ చిత్రానికి కమల్ ఇఫ్పటికే కథ, స్క్రీన్ ప్లే, దర్సకత్వం, పాటలు అందించారు. దాంతో నిర్మాత కోరిక మేరకు ఈ చిత్రాన్ని తానే డైరక్ట్ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. భారీ బడ్జెట్ తో రూపొందే ఈ చిత్రం నవంబర్ ఏడవ తేదీన విడుదల చేయాలని నిర్మాత కోరిక. కానీ సెల్వరాఘవన్ ప్రస్తుతం డైరక్ట్ చేస్తున్న చిత్రం షూటింగ్ ఇంకా బ్యాలన్స్ ఉంది. దాంతో తప్పని సరి పరిస్ధితుల్లో కమల్ ఈ భాధ్యతని తానే భుజాన వేసుకున్నారు. తెలుగు, తమిళ, హిందీ, మళయాళ భాషల్లో ఒకేసారి ఈ చిత్రం రూపొందనుంది. ముందు అనుకున్న షెడ్యూల్ ప్రకారమే షూటింగ్ ప్రారంభమవుతుందని తెలుస్తోంది. అలాగే ఈ చిత్రం హన్నీబాల్ అనే హాలీవుడ్ చిత్రానికి ఇండియన్ వెర్షన్ అని చెప్తున్నారు.

English summary
Kamal Hassan's next venture 'Viswaroopam'. We learn from reliable sources that director Selvaraghavan has walked out of the project and Kamal himself will wield the megaphone now.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu