Don't Miss!
- Sports
సుందర్ రనౌట్ విషయంలో నాదే తప్పు: సూర్యకుమార్ యాదవ్
- News
మాస్ కా బాప్: బాలయ్య-పవన్ కల్యాణ్ పార్ట్ 1 టెలికాస్ట్కు ముహూర్తం ఫిక్స్..!!
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Finance
BharatPe: భారత్ పే వ్యవస్థాపకుడి జీతం ఎంతో తెలుసా..? మిగిలిన వారి జీతాలు ఇలా..
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
ఆస్తులమ్మి సినిమా తీసా : కన్నీళ్లు పెట్టుకున్న కమల్ హాసన్
చెన్నై : విశ్వరూపం చిత్రానికి ఎదురవుతున్న అడ్డంకులపై నటుడు కమల్ హాసన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసారు. మద్రాసు హైకోర్టు సినిమా విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ....తమిళనాడు ప్రభుత్వం మళ్లీ పైకోర్టులో సవాల్ చేసిన నేపథ్యంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి తన బాధను వెల్లగక్కారు.
ఆస్తినంతా అమ్మి సినిమా తీసానని, దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టాలని తమకు లేదని, దేశ సెక్యూలరిజంపై అపార నమ్మకం ఉందని చెప్పుకొచ్చారు. విశ్వరూపం చిత్రంలో ఎవరి మనోభావాలు దెబ్బతీయలేదని, ఈ సినిమాను ఎందుకు నిలిపి వేసారో ఇప్పటికీ అర్థం కావడం లేదన్నారు. రాజకీయ క్రీడలో తాను పావునయ్యాను అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఎందుకు ఇన్ని అడ్డంకులు వచ్చాయో తెలియడం లేదన్న కమల్ హాసన్ తనకు న్యాయం జరిగే వరకూ పోరాడుతానని చెప్పుకొచ్చారు. సినిమాపై నిషేదం వల్ల ఇప్పటికే చాలా వరకు నష్ట పోయానని ఆయన చెప్పుకొచ్చారు. విశ్వరూపం చిత్రం ఈ నెల 25న విడుదల కావాల్సి ఉండగా.....ముస్లిం సంఘాల ఫిర్యాదుతో తమిళనాడు ప్రభుత్వం ఆచిత్రంపై నిషేదం విధించిన సంగతి తెలిసిందే.
'విశ్వరూపం' చిత్రంపై మద్రాస్ హైకోర్టు నిషేదం ఎత్తి వేసిన ఆనందంలో ఉన్న కమల్‌కు జయలలిత ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. మద్రాస్ హైకోర్టు ఆ సినిమాపై నిషేదం ఎత్తి వేయడాన్ని సవాల్ చేస్తూ రివ్యూ పిటీషన్ దాఖలు చేసింది. ఈ రోజు ఆ కేసు విచారణకు రానుంది. ఈ నేపథ్యంలో కోర్టు ఎలా స్పందిస్తుందో అనే ఆందోళన వ్యక్తం అవుతోంది. ఒక వేళ జయలలిత ప్రభుత్వానికి మరోసారి ఇక్కడ చుక్కెదురైనా....సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు సైతం తమిళనాడు ప్రభుత్వం వెనకాడటం లేదని చెన్నై టాక్. పరిస్థితి చూస్తుంటే 'విశ్వరూపం' చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తమిళనాడులో విడుదల కాకుండా జయ ప్రభుత్వం గట్టి పట్టుదలతో ఉన్నట్లు స్పష్టం అవుతోంది.