twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాగార్జున స్కూల్లోకి కమల్, మణిరత్నం

    By Srikanya
    |

    నాగార్జున రీసెంట్ గా ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ అండ్‌ మీడియాని ప్రారంభించిన సంగతి తెలిసిందే.ఈ స్కూల్ కోసం నాగార్జున ప్రముఖ దర్శకుడు మణిరత్నం ను ,యూనివర్శల్ హీరో కమల్ హాసన్ ని కూడా ఎడ్వయిజరీ బోర్డులోకి తీసుకున్నారు.మణిరత్నం ఈ స్కూల్ లోని డైరక్షన్ డిపార్టమెంట్ కు చెందిన అకడమిక్ అడ్వైజర్ గా ఉంటారు. అలాగే కమల్ హాసన్ ..నటనకు చెందిన విభాగానికి అకడమిక్ అడ్వైజర్ గా ఉండటానికి ఒప్పుకున్నారు.వీరిద్దరూ అప్పడప్పుడూ ఈ స్కూల్లో లెక్చర్లు ఇస్తూంటారు.

    అంతేగాక వీరద్దరూ ఈ స్కూల్లో చెప్పటానికి ఫాకల్టీని రికమెండ్ చేయటం విధ్యార్ధులకు ప్రాక్టికల్ శిక్షణకు అవసరమైన సలహాలు,సూచనలు అందించటం చేస్తారు.అలాగే ఇఫ్పటికే ఇందులోని నటన విభాగానికి ప్రముఖ నటుడు ప్రకాష్‌రాజ్‌ హెడ్ గా తీసుకున్నారు. ఈ విషయాన్ని నాగార్జున చెపుతూ.. ప్రకాష్‌రాజ్‌ ఎలాంటి నటుడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ స్కూల్‌ గురించి ప్రస్తావించగానే ఆయన చెప్పిన విషయాలు నన్ను ఆకట్టుకున్నాయి. నటుల్ని తీర్చిదిద్దడంలో ఆయన చెప్పిన కొత్త పద్ధతులు నేటి తరానికి అవసరం. నటన విభాగానికి ఆయన్ని హెడ్‌గా తీసుకున్నందుకు గర్వంగా ఉంది అన్నారు.

    English summary
    Nagarjuna’s International School of Film and Media is growing bigger and bigger. With Prakash Raj heading the school, Nagarjuna had roped in Creative director Mani Ratnam and Universal hero Kamal Hassan to join the advisory board.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X