»   » 'పద్మశ్రీ'ని వెనక్కివ్వటంలేదంటూ... కమల్‌ హాసన్‌

'పద్మశ్రీ'ని వెనక్కివ్వటంలేదంటూ... కమల్‌ హాసన్‌

Posted By:
Subscribe to Filmibeat Telugu

భారత ప్రభుత్వం అందించిన ఉన్నత పౌరపురస్కారం 'పద్మశ్రీ'ని తిరిగి ఇవ్వటం లేదని నటుడు కమల్‌హాసన్‌ స్పష్టం చేశారు. కొలంబోలో జూన్ ‌3 నుంచి 5 వరకూ నిర్వహించే అంతర్జాతీయ భారత చలనచిత్ర సంస్థ(IIFA అవార్డుల సదస్సుకి రావడం లేదని ప్రకటించారు. భారత పరిశ్రమల సమాఖ్య(ఫిక్కీ)కు చెందిన మీడియా ఎంటర్‌టైన్‌మెంట్‌ బిజినెస్‌ కాన్‌క్లేవ్‌ ఛైర్మన్‌ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పదవికి రాజీనామా చేయాలని, పద్మశ్రీని వెనక్కి ఇచ్చేయాలని శ్రీలంకకు చెందిన 'మేసెవెంటీన్‌' ఉద్యమ కార్యకర్తలు ఈనెల 17న ఆయన ఇంటి ముందు ధర్నా నిర్వహించారు. శ్రీలంకలో తమిళియన్స్ ను సరిగ్గా ట్రీట్ చేయటం లేదంటూ చెలరేగిన వివాదం ఈ విధంగా పరిణమిస్తోంది. ప్రస్తుతం కమల్ హాసన్ ...కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో 'యావరుమ్ కేళీర్' (అందరూ వినండి) అనే టైటిల్ తో ఓ ఫుల్ లెంగ్త్ కామిడీ చేయటానికి కమిట్ అయ్యారు. గతంలో తెనాలి, పంచతంత్రం, దశావతారం వంటి చిత్రాలు కమల్, రవికుమార్ కాంబినేషన్లో వచ్చాయి.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu