»   » నే నిజాలు చెప్తే చాలా మందికి ఇబ్బందనే: కమల్ హాసన్

నే నిజాలు చెప్తే చాలా మందికి ఇబ్బందనే: కమల్ హాసన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : ''స్వీయ చరిత్రలు రాయటంపై నాకు ఆసక్తి లేదు. అదే జరిగితే అబద్దాలే రాయాల్సి వస్తుంది. నిజాలు రాస్తే చాలా మంది మనసులు గాయపడతాయి'' అని ప్రముఖ నటులు కమల్‌హాసన్‌ పేర్కొన్నారు. ఆయనకు ప్రభుత్వం 'పద్మభూషణ్‌' పురస్కారాన్ని ప్రకటించిన సందర్భంగా ఆదివారం ఆళ్వార్‌పేటలోని ఆయన ఇంటి వద్ద మీడియాతో మాట్లాడారు. ''ప్రజలు నన్ను 'భారతరత్న' పురస్కారానికి కూడా అర్హుడిని చేస్తారు''అని అన్నారు కమల్‌.

కమల్ హాసన్ మాట్లాడుతూ.... ''పద్మభూషణ్‌ పురస్కారానికి అర్హులైనవారు చాలామందే ఉన్నారు. నాకు శిక్షణ ఇచ్చినవారు సైతం ఈ పురస్కారాన్ని తీసుకోకుండానే కన్నుమూశారు. ఇప్పటి వరకు సాధించిన వాటికే కాకుండా, ఇకపైనా సాధించాల్సిన వాటికోసమే పద్మభూషణ్‌ దక్కింది. ఈ పురస్కారం ఆలస్యంగా వచ్చినట్లు నేను భావించటం లేదు. నాపై ప్రజలు చూపించే అభిమానమే ప్రథమ పురస్కారం. మిగతావన్నీ దీని తర్వాతే. నాకు సినిమా గురించి నేర్పినవారికి, నా కుటుంబ సభ్యులకు ఈ పురస్కారాన్ని అంకితమిస్తున్నా. ఎంతో మంది నా నుంచి ఫీజు తీసుకుని సినిమా గురించి నేర్పించారు. అయితే కె.బాలచందర్‌, షణ్ముగంలాంటి వాళ్లు నాకే పారితోషికం ఇచ్చి నేర్పించారు. వారికి రుణపడి ఉంటాను''అన్నారు.

అవార్డు విషయమై రజనీకాంత్‌ శుభాకాంక్షలు తెలిపారా అని ప్రశ్నించగా.. ''ఇప్పటివరకు చెప్పలేదు. ఏ విషయంలోనైనా ఆయన నిదానంగా స్పందించడం తెలిసిన విషయమే కదా'' అన్నారు. భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తారా? అంటే.. ''ఇక్కడ అందరూ రాజకీయవేత్తలే.. ఐదేళ్లకోసారి ఓటువేసి వేలిపై మచ్చ వేయించుకుంటున్నార. నాకు ఆ మచ్చ చాలు'' అన్నారు.''దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లయినా జాతి విబేధాలు సమసిపోవటం లేదు. 'జాతులు లేవే..'అని పాట పాడిన భారతియార్‌ పాపలకు ముని మనమరాళ్లు వచ్చినా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు''అన్నారు కమల్‌.

ఇక విశ్వరూపం విషయంలో చోటుచేసుకున్న గాయాలకు ఈ పురస్కారాన్ని ఓ మందుగా భావిస్తున్నారా? అన్న విలేకరుల ప్రశ్నకు... ''నా జీవితంలోని కష్టాలు నాకు మాత్రమే పరిమితమని భావిస్తాను. సుఖాల్ని మాత్రం అందరితో పంచుకుంటాను''అన్నారు. ''అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విశ్వరూపం-2 చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణానంతర పనులు పూర్తయ్యాక ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాను''అన్నారు కమల్‌ హాసన్‌.

English summary
Kamal Haasan has been short listed to be honoured with the third highest civilian award- Padma Bhushan."Glad my name came up. Thank audience,mentor,all who made my workplace enjoyable," Hassan said on being the recepient of Padma Bhushan.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu