»   » కరుణానిధి సత్కారం-కమల్ హాసన్ నాటకం!

కరుణానిధి సత్కారం-కమల్ హాసన్ నాటకం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

వైవిధ్యభరితమైన పాత్రలను సమర్థవంతంగా పోషించి ఎటువంటి సాత్రనైనా నాకు వెన్నతో పెట్టిన విద్య అంటూ లోక నాయకుడుగా పేరు తెచ్చుకున్న 'భారతీయుడు" పద్మశ్రీ గ్రహీత కమల్ హాసన్. వెండితెరపై తిరుగులేని నటుడిగా స్థానం సంపాదించుకున్న ఈ నటుడు త్వరలో స్టేజ్ పై ఓ నాటకంలో నటిస్తున్నాడు.

బాల నటుడిగా, హీరోగా ఇప్పటికే ఎన్నో పాత్రల్లో నటించిన కమల్, ఇప్పటి వరకు ఒక్క నాటకంలో కూడా నటించలేదు. అందుకే కమల్ నటిస్తున్న నాటకానికి అశేష ప్రేక్షకాదరణ వస్తుందని చెన్నై వాసులు అనుకుంటున్నారు. అందులోనూ ఈ నాటకానికి తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి మాటలు రాయడం మరింత ఆసక్తిని కలిగిస్తుంది.

తమిళ చిత్ర పరిశ్రమకు కరుణానిధి ప్రభుత్వం ఎన్నో సౌకర్యాలను కల్పించినందుకు కృతజ్ఝతగా ఫిబ్రవరి 6న నెహ్రూ స్టేడియంలో ముఖ్యమంత్రి కరుణానిధిని ఘనంగా సత్కరించాలని తమిళ చిత్ర పరిశ్రమ నిర్ణయించుకుంది. ఈ నెల 6న చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో జరగనున్న ఈ వేడుకలో మొత్తం తమిళ పరిశ్రమ పాల్గొంటున్నది. ఈ వేదికపైనే కమల్ నాటక ప్రదర్శన జరగనుంది. ఆయన చేస్తున్న నాటకం గతంలో స్టేరింగ్ శివాజిగణేషన్, పద్మిని నటించిన సూపర్ హిట్ అందించిన 'రాజా రాణి" చిత్రం ఆధారంగా ఉంటుందని సమాచారం.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu