»   » ఉత్తమ విలన్: కమల్ హాసన్ డబల్ యాక్షన్

ఉత్తమ విలన్: కమల్ హాసన్ డబల్ యాక్షన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: యూనివర్సల్ హీరో కమల్ హాసన్ త్వరలో 'ఉత్తమ విలన్' చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఆయన ద్విపాత్రాభినయంలో కనబడబోతున్నారు. ఉత్తమన్, మనోరంజన్ అనే రెండు పాత్రలు ఆయన పోషిస్తున్నారు.

ఉత్తమన్ అనే పాత్ర 8వ శతాబ్దానికి చెందిన డ్రామా యాక్టర్. మనోరంజన్ అనే పాత్ర 21 శతాబ్దానికి చెందిన సినిమా సూపర్ స్టార్ పాత్ర. ఈ రెండు పాత్రలను తనదైన రీతిలో కమల్ హాసన్ రక్తి కట్టించాడని యూనిట్ సభ్యులు అంటున్నారు. కమల్ హాసన్ గురువు, మెంటర్ అయిన బాలచందర్ కూడా ఈ సినిమాలో నిజజీవిత పాత్రలో కనిపించబోతున్నారట.

Kamal Hassan Plays Two Roles In Uthama Villain

ఈ చిత్రంలో కమల్ హాసన్ పోషిస్తున్న మనోరంజన్ పాత్రకు భార్యగా ఊర్వశి నటిస్తోంది. ప్రముఖ నటుడు, దర్శకుడు కె.విశ్వనాథ్ మనోరంజన్ మామ పాత్రను పోషిస్తున్నారు. హీరోయిన్ ఆండ్రియా మనోరంజన్ ప్రియురాలి పాత్రలో కనిపించబోతోంది. సినిమాలో మనోరంజన్ పాత్ర ఎంతో ఆసక్తికరంగా ఉంటుందని అంటున్నారు.

ఇక 8వ శతాబ్దానికి చెందిన ఉత్తమన్ పాత్ర విషయానికొస్తే....ఈ పాత్రకు జోడీగా పూజా కుమార్ నటిస్తోంది. 8వ శతాబ్దం బ్యాక్ డ్రాపులో నడిచే పార్టులో నాజర్, ముత్తరాజన్, జయరాం, పార్వతి మెల్టన్, ఎంఎస్ భాస్కర్ కనిపించనున్నారు. మొత్తానికి ఈచిత్రం కమల్ హాసన్ నుండి వస్తున్న మరొక వైవిద్యమైన చిత్రం.

ఉత్తమ విలన్ చిత్రానికి కన్నడ యాక్టర్, డైరెక్టర్ రమేష్ అరవింద్ దర్శకత్వం వహిస్తున్నారు. రాజ్ కమల్ ఇంటర్నేషనల్, ఎన్ లింగుస్వామికి చెందిన తిరుపతి బ్రదర్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఎం ఘిబ్రన్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. శ్యాం దత్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

English summary
Kamal Hassan will be seen in dual roles in forthcoming Tamil film Uthama Villain. The names of his characters are Uthaman and Manoranjan.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu