twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రెండు దశాబ్దాల తర్వాత బయట పడనున్న సినిమా: కమల్ వందల కోట్ల ప్రాజెక్ట్

    కమల్ హసన్ దాదాపు రెండు దశాబ్దాలుగా మరుగున పడి ఉన్న తన కలల సినిమా 'మరుదనాయగం'ను కూడా బయటికి తెచ్చే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది.

    |

    భారీ బడ్జెట్ సినిమా అన్న కాన్సెప్ట్ ని పేద్ద హైప్ చేద్దాం అనుకున్న వాళ్ళలో కమల్ ఒకరు ఇరవయ్యేళ్ళ కిందటే దాదాపు 100 కోట్లకి దగ్గర బడ్జెట్ తో మొదలు పెట్టిన మరుద నాగం ఇప్పటికీ పెండింగ్ లోనే ఉంది. దాన్ని పూర్తి చేయటానికి నానా తంటాలు పడుతూనే ఉన్నాడు కమల్. ఇన్ని సంవత్సరాలైనా కూడా ఇంకా ఆ సినిమాని ఎలాగైనా పూర్తి చేయాలన్న పట్టుదలలోతోనే ఉండటం విశేషమే....

    ఇంగ్లాండ్‌రాణి ఎలిజిబెత్ చేతుల మీదుగా

    ఇంగ్లాండ్‌రాణి ఎలిజిబెత్ చేతుల మీదుగా

    1997 అక్టోబర్ 16వ తారీఖున ఇంగ్లాండ్‌రాణి ఎలిజిబెత్ చేతుల మీదుగా ప్రారంభమైన చిత్రం మరుదనాయగం.వందలాది కళాకారులతో యుద్ధ సన్నివేశాలను తొలిరోజునే భారీ ఎత్తున కమల్ చిత్రీకరించారు. అలా 30 నిమిషాల సన్నివేశాలను చిత్రీకరించిన తరువాత ఆర్థిక సమస్యల కారణంగా మరుదనాయగం చిత్ర నిర్మాణం ఆగిపోయింది.

    కావల్సినంత బడ్జెట్‌ దొరకలేదు

    కావల్సినంత బడ్జెట్‌ దొరకలేదు

    "ఈ కథకు కావల్సినంత బడ్జెట్‌ దొరకలేదు... అందుకే సినిమా ఆపేశా.." అని చాలాసార్లు కమల్‌ స్వయంగా చెప్పాడు కూడా గతంలో ఆర్థికపరమైన సమస్యల కారణంగా ఆగిపోయిన 'మరుదనాయగం' సినిమాను తిరిగి పూర్తి చేయనున్నాడు. అన్న వార్తలు కొంత కాలంగా వస్తూన్వే ఉన్నాయి.

    నేను గొర్రెను కాను

    నేను గొర్రెను కాను

    బాహుబలి తర్వాత తమిళ్ లో భారీ బడ్జెట్ తో సినిమాలు తీస్తున్నా... తన సినిమాకి ఫండ్ కోసం ఎప్పటినుంచో అడుగుతున్నా ఎవ్వరూ పట్టించుకోక పోవటం తో... బాహుబలి లాంటి సినిమా తీయటానికి నేను గొర్రెను కాను అంటూ తమిళ నిర్మాతల మీద తన అసహనాన్ని కూడా చూపించాడు కమల్...

    విశ్వరూపం-2

    విశ్వరూపం-2

    నాలుగేళ్లుగా పక్కన పడి ఉన్న 'విశ్వరూపం-2' సినిమాను తన బేనర్ ద్వారా టేకప్ చేసి.. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చేయిస్తున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రాన్ని ఎలాగైనా ఈ ఏడాదే రిలీజ్ చేయాలన్న పట్టుదలతో ఉన్నాడు కమల్.ఐతే దీంతో పాటు కమల్.. దాదాపు రెండు దశాబ్దాలుగా మరుగున పడి ఉన్న తన కలల సినిమా 'మరుదనాయగం'ను కూడా బయటికి తెచ్చే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది.

    మహ్మద్ యూసప్ ఖాన్ కథే

    మహ్మద్ యూసప్ ఖాన్ కథే

    భారతదేశం తొలి స్వాతంత్య్ర పోరాట యోధుడు మహ్మద్ యూసప్ ఖాన్ కథే మరుదనాయగంగా తెరకెక్కనుంది. ఆయన అసలు పేరు మరుదనాయగం పిళ్ళై. అప్పట్లో బ్రిటీష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా తమిళనాడు నుంచి పోరాటం మొదలు పెట్టిన యోధుడి కథ ఇది.బడ్జెట్‌ సమస్యలతో 40 శాతం షూటింగ్‌ పూర్తయిన తరువాత అర్ధాంతరంగా నిలిచిపోయింది.

    20 సంవత్సరాలుగా ఆగిపోయి

    20 సంవత్సరాలుగా ఆగిపోయి

    ఆ తరువాత కమల్‌హాసన్ ఎన్నో సినిమాల్లో నటించారు. కానీ, ‘మరుదనాయగం'కు మాత్రం కమల్‌ ఊపిరి పోయలేకపోయారు. దాదాపు 20 సంవత్సరాలుగా ఆగిపోయిన ఈ చిత్రాన్ని మళ్లీ పునఃప్రారంభించేందుకు కమల్‌ శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

    కేన్స్ ఫిలిం ఫెస్టివల్ వేదికగా

    కేన్స్ ఫిలిం ఫెస్టివల్ వేదికగా

    ఓ అంతర్జాతీయ సంస్థతో కలిసి దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నాడట. ఈలోపు కేన్స్ ఫిలిం ఫెస్టివల్ వేదికగా.. ఈ సినిమాకు సంబంధించి కొన్ని కొత్త పోస్టర్లు రిలీజ్ చేయడంతో మళ్ళీ ఈ సినిమా పట్టాలెక్కనుందనే ఆశ కమల్ అభిమానుల్లో మొదలయ్యింది..

    కేన్స్‌లో స్టాండీలు ఏర్పాటు చేయించాడు

    కేన్స్‌లో స్టాండీలు ఏర్పాటు చేయించాడు

    ఇప్పటికే తెరకెక్కించిన సన్నివేశాల్లోంచి కొన్ని స్టిల్స్ తీసి.. కేన్స్‌లో స్టాండీలు ఏర్పాటు చేయించాడు కమల్. వీటి ని చూసిన వాళ్ళు ఈ ప్రాజెక్ట్ మీద ఆసక్తి తో తనని సంప్రదిస్తారనుకున్న కమల్ ఆలోచన సరిగానే పని చేసినట్టుంది. కమల్ గడ్డంతో ఉన్న ఆ ఫొటోలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

    40 నిమిషాల నిడివితో ఔట్ పుట్

    40 నిమిషాల నిడివితో ఔట్ పుట్

    దాదాపు 40 నిమిషాల నిడివితో ఔట్ పుట్ కమల్ దగ్గర ఉంది. దాన్ని అలాగే వాడుకుని.. మిగతా సినిమాను పూర్తి చేయాలని భావిస్తున్నాడు కమల్. ఐతే ఇరవయ్యేళ్ళ కిందటే 100 కోట్ల పైబడ్డ బడ్జెట్ అంటే ఇక ఇప్పుడు ఈ సినిమాను పూర్తి చేయడానికి కొన్ని వందల కోట్లు అవసరమవుతాయి.

    ఒక పాట ని ఆ మధ్య రిలీజ్ చేసాడు

    ఒక పాట ని ఆ మధ్య రిలీజ్ చేసాడు

    అవి సమకూరితే 'మరుదనాయగం'ను పూర్తి చేయడానికి ఎంతైనా శ్రమించడానికి కమల్ సిద్ధంగా ఉన్నాడు. కానీ ఇన్ని సినిమాల కోసం కోట్లకు కోట్లు పెట్టే నిర్మాతలు మాత్రం కమల్ దగ్గరికి పోవటం లేదు. చూద్దాం ఎరెసారైనా మరుదనాయగం వస్తాడేమో... ఈ సినిమా లోని ఒక పాట ని ఆ మధ్య రిలీజ్ చేసాడు అది చూస్తేనే అర్థమైపోతుంది. మరుదనాయగం ఎంత సంచలన సబ్జెక్ట్ అవుతుందో.

    English summary
    As per the latest grapevine, Kamal coming to this project Marudhanayagam, it is an Indian Historical Fiction project which was written by Kamal himself.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X