»   » మెట్లపై కాలు జారి పడ్డ కమల్ !... అపోలోకి తరలింపు!

మెట్లపై కాలు జారి పడ్డ కమల్ !... అపోలోకి తరలింపు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: ప్రముఖ నటుడు కమల్ హాసన్ కొద్ది సేపటి క్రితం అపోలో హాస్పటిల్ లో చేరారు. ఈ రోజు ఉదయం చెన్నైలోని తన ఆఫీసులో మెట్లపై నడుస్తున్నప్పుడు కాలుజారి పడ్డారు. దీనితో ఆయన కాలికి గాయమైంది. వెంటనే స్పందించిన ఆయన ఆఫీస్ సిబ్బంది కమల్ ను హుటాహుటిన నగరంలోని చెన్నై ఆసుపత్రికి తరలించారు. కమల్ కు వైద్య పరీక్షలు చేసిన అపొలో డాక్టర్స్ ఆయన కాలుకి అయిన గాయం పరిశీలిస్తున్నారు.

కమల్ పై దళిత్ సంఘం కంప్లైంట్, ధర్నాలు చేస్తామంటూ హెచ్చరిక


ఇక కమల్ హాసన్ సినిమాలు విషయానికి వస్తే ..ఆయన హీరోగా తెలుగు, తమిళం, హిందీలలో రూపొందుతున్న మూవీ 'శభాష్‌ నాయుడు'. ఈ చిత్రం షూటింగ్ అమెరికాలోని రీసెంట్ గా లాస్ ఏంజిల్స్ లో గత కొద్ది రోజులుగా షూటింగ్ చేసి వచ్చారు. ఈ షెడ్యూల్ లో కమల్ తో పాటు బ్రహ్మానందం, రమ్యకృష్ణ కూడా పాల్గొంటున్నారు. సినిమాలో వీళ్లిద్దరూ చాలా కీలకమైన రోల్స్ వేస్తున్నారు ఈ సీన్స్ లో బ్రహ్మానందం హైలెట్ అవుతారని తెలుస్తోంది.

Kamal hassan slipped and fell in the stairs at his office

ఇక శభాష్‌ నాయుడు సినిమాలో కమల్ హాసన్ భార్యగా రమ్యకృష్ణ నటిస్తున్నది. ప్రస్తుతం బాహుబలి 2 సినిమాలో చేస్తున్న శివగామి కమల్ సినిమా శభాష్ నాయుడు కోసం అమెరికా వెళ్లింది. కమల్ సినిమాలో అతని కూతురు శృతిహాసన్ కుమార్తెగానే చేస్తోంది. కమల్ హాసన్ అదివరకు దశావతారం సినిమాలో సీబీఐ ఆఫీసర్ బలరాం నాయుడిగా ఒక పాత్ర వేశాడు. అదే కేరక్టర్ ను మెయిన్ గా తీసుకుని ఆ పాత్రకు సీక్వెల్‑లా శభాష్ నాయుడు సినిమా తీస్తున్నారు.

డైరక్టర్ కి ఆరోగ్యం బాగోలేదు, కమల్ ది సరైన నిర్ణయమే


గతంలో దర్శకుడిగా అనుభవం ఉన్న కమల్ హాసన్ ఈ సినిమాకు డైరెక్షన్ చేస్తున్నాడు. నిజానికి ఈ సినిమాను టికే రాజీవ్ కుమార్ డైరెక్ట్ చేయాల్సింది. కానీ లాస్ ఏంజిల్స్ లో షూటింగ్ జరుగుతుండగా రాజీవ్ కుమార్ హఠాత్తుగా అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరాడు.

ఇలా జరగడంతో యూనిట్ ఎంతో షాక్ కు గురైంది. దాంతో అనుకోని పరిస్థితిలో కమల్ హాసన్ శభాష్ నాయుడు డైరెక్షన్ బాధ్యతను చేపట్టాల్సి వచ్చింది. కమల్ తన సొంత బ్యానర్ పై తీస్తున్న ఈ సినిమా డిసెంబర్ 1న రిలీజ్ అవుతుంది.

English summary
kamal haasan slipped & fell in the stairs at his office. Has fractured his leg admitted in Appolo Hospital. Wishin him a speedy recovery.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu