For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నిర్మాత నుంచి కమలహాసన్‌కి లీగల్ నోటీసు

  By Srikanya
  |

  చెన్నై : ప్రముఖ నటుడు కమలహాసన్‌కి 'నాయకుడు' నిర్మాత లీగల్ నోటీసు పంపించారు. మణిరత్నం, కమలహాసన్ కాంబినేషన్‌లో వచ్చిన 'నాయకన్'( తెలుగులో 'నాయకుడు') చిత్రం 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కమల్ రాసిన ఓ ఆర్టికల్ ఇప్పుడు వివాదానికి కారణమైంది. ఆ ఆర్టికల్‌లో కమల్ చేసిన వాఖ్యలు తనకు మనస్తాపం కలిగించాయని పేర్కొంటూ 'నాయకన్' చిత్ర నిర్మాత ముక్తా శ్రీనివాసన్ కమల్‌కు లీగల్ నోటీసు పంపించారు. ఆ ఆర్టికల్ చదివిన దగ్గర నుంచి తను నిద్రకు కరువయ్యానని ఆ నోటీసులో శ్రీనివాసన్ పేర్కొన్నారు.

  ఇక ప్రస్తుతం కమల్‌ హాసన్‌ దర్శకత్వం వహిస్తూ నటిస్తున్న చిత్రం 'విశ్వరూపం'. రాజ్‌కమల్‌ ఫిలిమ్స్‌ ఇంటర్నేషనల్‌, పి.వి.పి. సినిమా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటీవలే సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు 14 కట్స్‌తో యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చింది. నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని సెన్సార్ సర్టిఫికెట్‌కు అప్లై చేయగా సెన్సార్ బృందం చాలా సేపు సమాలోచనలు జరిపి కొన్ని సన్నివేశాలను కట్ చేయాలని చెప్పారు. వాటిలో కొన్ని సన్నివేశ సందర్భాలకు కమల్ విపులంగా వివరణ ఇవ్వడంతో తృప్తి చెందిన సెన్సార్ బృందం చివరికి 14 కట్స్‌తో యు/ఎ సర్టిఫికెట్‌ను ఇచ్చారు. దీంతో విశ్వరూపం చిత్రాన్ని డిసెంబర్‌లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

  ఇక ఈ చిత్రం మరోసారి రిలీజ్ వాయిదా పడింది. జనవరి 2013 లో ఈ చిత్రం విడుదల అయ్యే అవకాసం ఉందని తెలుస్తోంది. ఈ చిత్రం లేటు అవటానికి కారణం..ఈ చిత్రంలో విప్లవాత్మకమైన ఆరో 3D ని ఇంట్రడ్యూస్ చేస్తున్నట్లు సమాచారం. ఈ టెక్నాలిజీతో సినిమాని మిక్సింగ్ చేయటానికి మరింత సమయం పడుతుంది. అందుకే లేటు అని చెన్నై వర్గాల సమాచారం. ప్రస్తుతం చెన్నైలో ఈ కన్వర్షన్ వర్క్ జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకీ తీవ్రవాద కార్యకలాపాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న వైనాన్ని చర్చిస్తూనే... వారి పని తీరుని, ఆలోచనల్న. తన చిత్రంలో చూపించబోతున్నట్లు సమాచారం. తీవ్రవాదం గురించి కమల్‌ చిత్రంలో ఏం చర్చించారనే విషయాన్ని గోప్యంగా ఉంచారు. తెరపై ఆయన తీవ్రవాదిగా కనిపించబోతున్నారు.

  తమిళం, తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతోంది. ఆండ్రియా, పూజాకుమార్‌ హీరోయిన్స్. ప్రస్తుతం ఆరో 3డీ టెక్నాలిజీని ఈ చిత్రానికి అద్దడంలో నిమగ్నమై ఉన్నారు. తొలిసారిగా ఈ సాంకేతిక పరిజ్ఞానంతో ఇండియన్ సినిమా రూపొందిస్తుండటం విశేషం. సినిమాలోని పాటల్ని కమల్‌హాసన్‌ జన్మదినం సందర్భంగా నవంబరు 7న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 'విశ్వరూపం' ఆడియో ఆవిష్కరణ వేడుకను కొత్తగా ప్లాన్ చేశారు కమల్.

  English summary
  producer-director Muktha Srinivasan has sent a legal notice as he is deeply hurt by Kamal Hassan’s article on Nayakan. The movie completed its silver jubilee this year and Kamal has mentioned about Muktha’s disinterest in shooting the film in Mumbai. How ‘films were a business for him’ and he wasn’t interested in films as art.’ Thus, Srinivasan has summoned Kamal and says, "Kamal has given a long write-up about Nayakan, a film which I produced 25 years ago. He has claimed that I was 'tight-fisted' and from an 'old school' in it. He has abused me in his article, and this has deeply hurt me. I've been unable to do my job ever since I read the piece. I don't understand why he has to write about a film that was released long ago. I have been upset for the last couple of days and have lost my peace of mind. I've gone to court, and my lawyers have now sent him a legal notice."
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X