»   » త్రిష అందం గురించి నేను కొత్తగా సర్టిఫై చేయక్కర్లేదు

త్రిష అందం గురించి నేను కొత్తగా సర్టిఫై చేయక్కర్లేదు

Posted By:
Subscribe to Filmibeat Telugu

తనతో తొలిసారిగా 'మన్మధన్‌ అంబు" చిత్రంలో నటిస్తున్న త్రిష గురించి..కమల్ హాసన్ మాట్లాడుతూ...త్రిష అందం గురించి, ఆమె అభినయం గురించి నేను కొత్తగా సర్టిఫై చేయాల్సిన అవసరం లేదు. వృత్తి పట్ల ఆమెకున్న అంకితభావం నన్ను చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. నేటితరం హీరోయిన్లలో ఇంత కమిట్‌మెంట్‌ ఉన్న వారు చాలా అరుదు. ఈ చిత్రంలో త్రిష నటన సరికొత్తగా కనిపిస్తుంది అన్నారు.ఆయన నటిస్తున్న తాజా చిత్రం 'మన్మధన్‌ అంబు" త్వరలోనే విడుదల కానుంది ఈ సందర్బంగా ఆయన మీడియాతో ముచ్చటించారు. ఇక అలాగే 'మన్మధన్‌ అంబు" చిత్రం ఏ తరహా చిత్రానకి చెప్పలేనన్నారు. దానికి కారణం వివరిస్తూ...ఈ చిత్రంలో అన్ని రకాల రసాలు సమానంగా ఉంటాయి. రొమాన్స్‌కు ఎంత ప్రాధాన్యత ఉంటుందో..కామెడీకి కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. అలాగే..యాక్షన్ ‌కు, సెంటిమెంట్‌కు కూడా ఈ సినిమాలో పెద్ద పీట వేయబడింది. కాబట్టి..ఇది ఫలానా తరహాలో ఉంటుందని చెప్పలేను. అయితే మీరు మరీ పట్టుబట్టి ఈ చిత్రాన్ని ఏదో ఒక జోనర్‌లో చేర్చాలంటే వూత్రం.. ఈ చిత్రాన్ని 'రొమాంటిక్‌ కామెడి"గా చెప్పడానికి నేను ఇష్టపడతాను అన్నారు. అలాగే నేను కథనందించిన సినిమా కాబట్టి దాని గురించి నేను ఎక్కువగా చెప్పలేను అని నవ్వేసారు. లక్ష్మీగణపతి ఫిలింస్‌ పతాకంపై సుబ్రహ్మణ్యం. ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. అలాగే ఈ చిత్రాన్ని కె.ఎస్.రవికుమార్ డైరక్ట్ చేస్తున్నారు.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu