twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అభిమానులను ఉద్దేశించి కమల్‌ హాసన్‌

    By Srikanya
    |

    చెన్నై: విశ్వరూపం విడుదల విషయంలో తనకు అండగా నిలిచిన అందరికీ కమల్‌ హాసన్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఆయన నటించిన 'విశ్వరూపం' గురువారం రాష్ట్రవ్యాప్తంగా విడుదలైంది. ఈ సందర్భంగా చెన్నైలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నో సమస్యలను అధిగమించి ఎట్టకేలకు 'విశ్వరూపం' థియేటర్లలోకి వచ్చింది. విడుదల విషయంలో ఎదురైన అవాంతరాలతో క్లిష్ట పరిస్థితిలో కూరుకుపోయా. అప్పుడు మనోధైర్యాన్ని ఇచ్చిన అభిమానులకు, తమిళ ప్రజలకు, సహ నటీనటులకు కృతజ్ఞతలని పేర్కొన్నారు.

    అలాగే తనను ఇబ్బందులకు గురి చేస్తే దేశాన్ని విడిచి వెళతానన్న నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండబోదని మరోసారి స్పష్టం చేశారు. 'విశ్వరూపం' చిత్రానికి ఎదురైన సమస్యలను దృష్టిలోకి తీసుకుని సెన్సార్‌బోర్డుకు ఉన్న అధికారాలపై కేంద్రం పునఃపరిశీలన జరపాలని డిమాండ్‌ చేశారు. సినిమా విడుదలకు సహకరించిన ముఖ్యమంత్రి జయలలితను మర్యాద పూర్వకంగా కలుసుకోవాలని అనుకుంటున్నాను. అందుకు అనుమతి కోరుతూ లేఖ కూడా రాసినట్లు వెల్లడించారు.

    కమల్‌ హాసన్‌ సర్వం తానై నిర్మించిన 'విశ్వరూపం' తమిళ చిత్రం ఎట్టకేలకు తమిళనాడులో గురువారం విడుదలైంది. రాష్ట్రంలో 'విశ్వరూపం' చిత్రం విడుదలైన థియేటర్ల వద్ద కమల్‌ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ధియోటర్స్ మొత్తం హౌస్ ఫుల్ అయ్యీయి. ధియోటర్స్ వద్ద కమల్ ప్యాన్స్ మిఠాయిలు పంచిపెట్టారు. చాలా చోట్ల కమల్ కటౌట్స్ కు పాలాభిషేకం చేసారు. ఇక ఈ చిత్రం హాలీవుడ్ సినిమాలా ఉందని చూసిన వారు వ్యాఖ్యానించటంతో థియోటర్స్ వారు ఊపిరి పీల్చుకున్నారు.

    ఇదిలా ఉండగా ప్రముఖ హీరో రజనీకాంత్‌ కుటుంబ సమేతంగా బుధవారం 'విశ్వరూపం' ప్రత్యేక ప్రదర్శన వీక్షించారు. ఇక చిత్రానికి మార్నింగ్ షోకి మంచి టాక్ వచ్చింది. కమల్ అభిమానలు ఈ చిత్రాన్ని ఓ అద్బుతంగా వర్ణిస్తున్నారు. సోమవారం వరకు అన్ని షోలూ బుక్కై పోయాయని ధియోటర్ ఓనర్స్ అంటున్నారు. మరి సాధారణ ప్రేక్షకుల టాక్ ఎలా ఉంటుందనేది చూడాలి.

    ఇక ఒక వర్గాన్ని కించపరిచే దృశ్యాలు ఉన్నాయనే ఆరోపణల మధ్య చిత్రం విడుదల నిలిచిపోయింది. చిత్ర ప్రదర్శనతో శాంతి, భద్రతలకు భంగం వాటిల్లుతుందని ముఖ్యమంత్రి జె.జయలలిత నేతృత్వంలో తమిళనాడు ప్రభుత్వం 'విశ్వరూపం'పై నిషేధం విధించింది. చివరకు రాష్ట్ర ప్రభుత్వం మధ్యవర్తిత్వం నెరపగా, కమల్‌ హాసన్‌, చిత్ర ప్రదర్శనకు అభ్యంతరం తెలిపిన వర్గాల మధ్య జరిగిన చర్చలు ఫలించాయి. చిత్రంలో ఏడు దృశ్యాలు, కొన్ని సంభాషణల తొలగింపునకు కమల్‌ అంగీకరించటంతో చిత్ర ప్రదర్శనకు మార్గం సుగమమైంది.

    English summary
    Actor-filmmaker Kamal Hassan has thanked his fans for the constant support that helped him steer clear of the controversies surrounding his multi-lingual film Vishwaroopam. “I am ever grateful to the Tamil Nadu and Indian people at large. Many peers in the trade in Tamil Nadu also reached out personally to enquire. Unbeknownst to me, the rest of my fraternity throughout the country raised their voice in my defense,” Kamal said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X