»   » కమల్ హాసన్ నెగిటివ్ రోల్ లో

కమల్ హాసన్ నెగిటివ్ రోల్ లో

Posted By:
Subscribe to Filmibeat Telugu

పద్మశ్రీ కమల్ హాసన్ త్వరలో నెగిటివ్ రోల్ లో కనిపించి మురిపించనున్నాడు. విశ్వరూపం టైటిల్ తో రూపొందుతున్న చిత్రంలో ఆయన విలనిజం కనిపించే పాత్రను పోషిస్తున్నారని చెన్నై ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ఇక కమల్ డైరక్ట్ చేస్తున్న ఈ చిత్రం భారీ బడ్జెట్ తో దాదాపు వంద కోట్ల వరకూ వ్యయంతో చేయనున్నారని చెప్తున్నారు. గతంలో ఇలాంటి నెగిటివ్ పాత్రలు చేసినా కమల్ ఈ మధ్య కాలంలో అలాంటి పాత్రలు పోషించలేదు. ఇక ఈ చిత్రం లొకేషన్స్ కోసం కమల్ రీసెంట్ గా కెనడా, అమెరికా, కొన్ని యూరోపియన్ దేశాలు వెళ్ళి వచ్చారు.

అలాగే ఈ చిత్రంలో తన ప్రక్కన చేసేందుకు కానూ బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ ని సంప్రదిస్తున్నాడు.అయితే ఎవరినీ ఫైనలైజ్ చేయలేదు. అయితే లీడర్ భామ ప్రియా ఆనంద్ మాత్రం ఆయన ప్రక్కన సెకెండ్ హీరోయిన్ గా ఎంపికైనట్లు తెలుస్తోంది. ఆగస్టు రెండవ వారంలో షూటింగ్ మొదలయ్యే ఈ చిత్రం ఓ ల్యాండ్ మార్క్ గా మిగలాలని కమల్ భావిస్తున్నారు. సపోర్టింగ్ పాత్రలు కోసం ఎక్కవగా హిందీ ఆర్టిస్టులనే తీసుకుంటున్నారు. ఇక కమల్ చివరి చిత్రం మన్మధబాణం. రొమాంటిక్ కామిడీగా చేసిన ఈ చిత్రం భాక్సాఫీస్ వద్ద అస్సలు వర్కవుట్ కాలేదు. త్రిష హీరోయిన్ గా చేసిన ఈ చిత్రాన్ని కె ఎస్ రవికుమార్ తెరకెక్కించారు.

English summary
Kamal will be donning a negative role in Vishwaroopam. Don’t get surprised it was Kamal who was waiting to play negative role from long time and the opportunity knocked in the form of Vishwaroopam.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu