»   »  కమల్ ,రజనీ కాంబినేషన్ ఎప్పుడంటే...

కమల్ ,రజనీ కాంబినేషన్ ఎప్పుడంటే...

Posted By:
Subscribe to Filmibeat Telugu
Kamal Hassan
ఆ అద్బుత క్షణం కోసం చాలా కాలంగా సినీ అభిమానులును ఎదురుచూస్తున్నారు. కాని ఎవరు కమల్,రజనీ లని కలపి సినిమా చేసే ధైర్యం చేస్తారు. అయితే చేస్తే ఆ సాహసం చెయ్యాల్సింది కమల్,రజనీలకు గురువైన కె.బాలచందర్ మాత్రమే అని అందరకూ తెల్సిందే. దాన్నే కన్ ఫర్మ్ చేస్తూ కమల్ ఆ మధ్య స్టేట్ మెంట్ కూడా ఇచ్చాడు. దాంతో ఇదే ప్రశ్నను వారి ఆయన (కె.బాలచందర్) ముందు ఉంచితే ఆయన నవ్వుతూ "వాళ్ళద్దరనీ ఇలా చెయ్యి...అలా చెయ్యి అని వాళ్ళిద్దరుతోనూ చెప్పే పరిస్ధితులో నేను లేను..చెప్పించుకునే స్థాయీ కాదు వాళ్ళది...ఎంతో ఎదిగిపోయారు...నా కోసం వాళ్ళిద్దరూ సినిమా చేయాలంటే ముందు వాళ్ళు నిర్ణయించుకోవాలి. చేస్తాం...అని వాళ్ళంతట వాళ్ళు వస్తే నేను కాదు కదా...ప్రపంచంలోనే అత్యుత్తమమైన దర్శకుడు అని వాళ్ళు ఎవరిని అనుకుంటున్నారో అతన్నే తీసుకువస్తాను...ఎంత ఖర్చైనా భరిస్తాను "అని ఆయన వివరిస్తున్నారు. ఇక నిర్ణయం తీసుకోవాల్సింది..వాళ్ళిద్దరే. కమల్ ఓ ప్రక్క దశావతారం పూర్తి చేసి రిలాక్స్ గా రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే ..రజనీ కుచేలన్ తో బిజీగా ఉన్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X