»   » కమల్ 'దృశ్యం' రీమేక్ ట్రైలర్ (వీడియో)

కమల్ 'దృశ్యం' రీమేక్ ట్రైలర్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : మళయాళ,తెలుగు,కన్నడ భాషల్లో విజయవంతమైన దృశ్యం చిత్రాన్ని కమల్ హాసన్ తమిళంలో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి అక్కడ 'దృశ్యం' టైటిల్ తో కాకుండా 'పాపనాశం' అనే టైటిల్ ఖరారు చేశారు. మలయాళ చిత్రానికి దర్శకత్వం వహించిన జీతు జోసఫ్ తమిళ చిత్రానికి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మేరకు ఫస్ట్ లుక్ ట్రైలర్ ని విడుదల చేసారు కమల్. ఇప్పుడీ ట్రైలర్ ...అభిమానులను అలరిస్తోంది. ఇక్కడ మీరూ చూడవచ్చు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ముచ్చటగా ఉండే ఇద్దరు కూతుళ్లు, మనసెరిగి నడుచుకునే భార్యతో అతగాడి జీవితం సాఫీగా సాగుతుంటుంది. కానీ, పెద్ద కూతురి జీవితంలో రేగిన కలకలంతో ఆ కుటుంబం ఎలా తల్లడిల్లిందనే కథాంశంతో రూపొందిన మలయాళ చిత్రం 'దృశ్యం'. ఏ భాషకైనా నప్పే కథతో రూపొందిన ఈ చిత్రం తెలుగులో వెంకటేశ్, మీనా జంటగా పునర్నిర్మితమై ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే.

దృశ్యం చిత్రంలో కరప్టెడ్ పోలీస్ కానిస్టేబుల్ పాత్ర కీలకమైంది. ఆ పాత్రను ఎవరూ మర్చిపోలేరు. ఆ పాత్రను ఇప్పుడు తమిళంలో కళాభవన్ మణి పోషించనున్నారు. కమల్ హాసన్ హీరోగా చేస్తున్న దృశ్యం రీమేక్ లో ఈ పాత్రకు గానూ మణిని అడిగినట్లు ఆయన సంతోషంగా డేట్స్ కేటాయించినట్లు తెలుస్తోంది. కళాభవన్ మణి లాంగ్ గ్యాప్ తర్వాత తమిళంలో చేస్తూండటంతో తనకు ఇది రీఎంట్రీ చిత్రంగా భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Kamal's Papanasam Official Theatrical Trailer

కేవలం 39 రోజుల్లో చిత్రీకరణను పూర్తి చేశారు. మలయాళ మాతృకను తెరకెక్కించిన జీతు జోసెఫ్‌ తమిళంలోనూ దర్శకత్వం వహిస్తున్నారు. కేరళలోని తొడపుళలో ఇటీవల పతాక సన్నివేశాలను చిత్రీకరించారు. గౌతమి కమల్‌హాసన్‌ భార్యగా నటిస్తున్న చిత్రమిది.

దాదాపు 15 ఏళ్ల విరామం తర్వాత గౌతమినటిస్తున్న చిత్రమిదే కావడం గమనార్హం. మలయాళ మాతృక దర్శకుడు జీతూ జోసఫ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జనవరిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

మరో ప్రక్క ఇప్పటికే 'దృశ్యం' నిర్మాతలకు బాలీవుడ్ నిర్మాత ఏక్తాకపూర్ లీగల్ నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. జపనీస్ రచయిత కీగో హిగాషినో రాసిన పుస్తకంలోని విషయాలను కాపీ కొట్టి 'దృశ్యం' చిత్రాన్ని తెరకెక్కించారని ఏక్తా కపూర్ తన నోటీసుల్లో పేర్కొన్నారు.

జపనీస్ రచయిత రాసిన 'ది డివోషన్ ఆఫ్ సస్పెక్ట్ ఎక్స్' పుస్తకం ఆధారంగా సినిమా తెరకెక్కించేందుకు ఏక్తా కపూర్ ఆ పుస్తకం రైట్స్ కొనుగోలు చేసారు. అయితే 'దృశ్యం' చిత్రం చూసిన ఏక్తా కపూర్ అండ్ టీం తాము రైట్స్ దక్కించుకున్న పుస్తకంలోని విషయాలతో 'దృశ్యం' సినిమా ఉండటంతో షాక్‌కు గురైందట.

English summary
Papanasam is one of the most awaited films of the year, starring Ulaganayagan Kamal Haasan and Gautami in the lead, directed by award winning director Jeethu Joseph and produced by Wide Angle Creations and Rajkumar Theatres Private Limited. Music for the film has been composed by Ghibran.
Please Wait while comments are loading...