కమల్ 'రాఘవన్' నటి హత్య..మిస్టరీ

By Srikanya

చెన్నై : కమల్ హాసన్, గౌతమ్ మీనన్ కాంబినేషన్ లో రూపొందిన రాఘవన్ చిత్రంలో ఓ కీ రోల్ ప్లే చేసిన ప్రముఖ మోడల్ బధుషిదేశ్ పర్దే సోమవారం హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఆమె ప్రకాష్ రాజ్ కూతురుగా కనిపిస్తుంది. సినిమాలోనూ ఆమె మర్డర్ కు గురి అవుతుంది. పర్దే హత్య మిస్టరీ ఇంకా కొనసాగుతునే ఉంది. 2006లో మిస్ చెన్నై కిరీటాన్ని గెలుచుకున్న అందాలరాశి బధుషి దేశ్ పర్దే. 23 ఏళ్ల ఈ అందగత్తె దక్షిణాది చిత్రాల్లో నటించారు. ప్రముఖ మోడల్‌గా వెలుగొందుతున్న ఈ భామ ఐటీ రంగంలో పనిచేసే ఖేతార్ పర్దేను వివాహం చేసుకుని ముంబయిలో మకాం పెట్టిన బధుషి దేశ్ పర్దే హత్యకు గురైంది.

సోమవారం ఉదయం డ్యూటీ నుంచి భర్త సాయంత్రం తిరిగొచ్చేసరికి బధుషి ఇంటిలో చనిపోయి వున్నారు. ఇంటిలో డబ్బు, నగలు చోరీకి గురి కాకపోవడంతో హంతకులు ఆమెను హత్య చేయడానికే వచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. అయితే ఆమె హత్యకు కారణాలేమిటీ? ఎవరు హత్య చేసి ఉంటారు అనేది పోలీసులకు అంతుపట్టడం లేదు. బధుషి దేశ్ పర్దే భర్తను పలు కోణాల్లో విచారించిన ముంబయి పోలీసులు ఆ రోజు ఆమెకు వచ్చిన ఫోన్ కాల్‌పై ఆరా తీస్తున్నారు. బధుషి దేశ్ పర్దే ఫోన్‌కు ఆ రోజు వంద ఫోన్ కాల్స్‌తోపాటు 200 ఎస్‌ఎంఎస్‌లు వచ్చాయి. ఈ ఫోన్‌కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల వ్యవహారంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. బధుషిదేశ్ పర్దే నివసిస్తున్న అపార్టుమెంట్‌లో రహస్య కెమెరాలు ఉన్నాయి.

ఈ కెమెరాను కూడా పోలీసులు క్షుణ్ణంగా పరీక్షిస్తున్నారు. ఈ ఆధారాలతో నటి బధుషి దేష్ పర్దే హత్య మిస్టరీని ఛేదిస్తామంటున్నారు పోలీసులు. నటి బధుషి దేశ్ పర్దే దర్శకుడు గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో కమల్ నటించిన వేట్టైయాడు విళైయాడు(రాఘవన్) చిత్రంలో నటించారు. ఈ చిత్రంలో బధుషి దేష్ పర్దే హత్యకు గురవుతుంది. సినిమాలో మాదిరిగానే నిజ జీవితంలోను ఆమె హత్యకు గురి కావడం దర్శకుడు గౌతమ్‌మీనన్‌ను దిగ్భ్రాంతిని కలిగించింది.

గౌతమ్ మీనన్ మాట్లాడుతూ... రాఘవన్ చిత్రంలో ఒక కీలక పాత్రకు బధుషి దేష్ పర్దే కరె క్ట్‌గా నప్పుతారనిపించి ఆమెను ఎంపిక చేసినట్లు తెలిపారు. చిత్రం పూర్తి అయిన తరువాత కూడా ఆమె తల్లి తనతో తరచూ ఫోన్‌లో మాట్లాడేదని చెప్పారు. ఒకసారి ఫోన్‌చేసి తన కూతురికి ఆరోగ్యం బాగుండడం లేదని చెప్పారన్నారు. అలాంటిది బధుషి దేష్ పర్దే అనూహ్యంగా హత్యకు గురి కావడం దిగ్భాం తిని కలిగించిందని పేర్కొ న్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X