For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  కేకో కేక....కమల్ 'విశ్వరూపం' (కొత్త ఫోటోలు)

  By Srikanya
  |

  హైదరాబాద్ : విశ్వనటుడు కమల్‌హాసన్‌ స్వీయ దర్శకత్వంలో ఆయనే హీరోగా తెరకెక్కిన చిత్రం 'విశ్వరూపం'. ప్రతీ విషయంలోనూ విభిన్నతను ప్రదర్శించే కమల్ ఈ సారి ఈ చిత్రం మార్కెటింగ్ విషయంలోనూ కొత్త దారిలో వెళ్లటంతో రోజూ వార్తల్లో కనపడుతోంది. ఈ చిత్రాన్ని తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో మొదటి రోజే ప్రసారం చేసేందుకు డీటెహెచ్ ఛానెల్స్ కు హక్కులు ఇచ్చేసి ఆయన డిస్టిబ్యూటర్ల గుండెళ్లో రైళ్లు పరుగెత్తించారు.

  'థియేటర్లకు జనం రాకపోతే?'.. డీటీహెచ్‌ విడుదలపై ప్రస్తుతం థియేటర్‌ యజమానులతోపాటు ప్రతి ఒక్కరిలోనూ మెదలుతున్న అంశం ఇదే. 'మరి మాకు నష్టమొస్తే పరిస్థితి ఏంటి?' అని కూడా డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్‌ యజమానులు వాపోతున్నారు. గతంలో కమల్‌హాసన్‌ స్వీయ దర్శకనిర్మాణంలో 'హేరామ్‌' చిత్రంలో నటించారని, అయితే అది ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో నష్టపోయిన థియేటర్‌ యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు తదితరులకు కమల్‌ తగిన రుసుం చెల్లించారనే అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు ఆయన సన్నిహితులు. మరి కమల్‌ ఇలాంటి బాటలో నడిస్తే ఆరోగ్యవంతమే. ఆయనతోపాటు భవిష్యత్తులో మిగిలిన నిర్మాతలు కూడా అదేమార్గంలో వెళ్లాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

  ప్రముఖ దర్శకుడు భారతీరాజా వంటివారు కమల్ కు మోరల్ సపోర్టు ఇచ్చారు. భారతీ రాజా మాట్లాడుతూ... 'థియేటర్‌లో సినిమా చూసేవారు తప్పకుండా అక్కడికే వస్తారు. టీవీల్లో చూసేవారు బుల్లితెరకే పరిమితం అవుతారు. దీనివల్ల థియేటర్‌ యాజమాన్యానికి నష్టమేముంది? ప్రారంభంలో శాటిలైట్‌ హక్కులకు కూడా పెద్ద సమస్యలు వచ్చిపడ్డాయి. నాలుగేళ్ల వరకు ఇవ్వకూడదని చెప్పారు. కానీ ఇప్పుడు వారం తర్వాతే విక్రయించేస్తున్నారు. ఏ విషయాన్నైనా రెండు కోణాల్లో ఆలోచించాల్సిన ఆవశ్యకత ఉంది. థియేటర్‌ వారు ఓ నిర్ణయానికి వచ్చి డిమాండ్‌ చేస్తున్నారు. వారు దీనిపై సానుకూల వాతావరణంలో చర్చించి అనంతరం నిర్ణయం తీసుకుంటే మంచిది'అని భారతిరాజా అభిప్రాయపడ్డారు.

  అలాగే నటనలోనే కాకుండా కాలానుగుణంగా రూపాంతరం చెందడం కమల్‌ ప్రత్యేకత అన్నారు. 'కమల్‌హాసన్‌ తొలి చిత్రం నుంచే ప్రయోగాలు చేస్తున్నారు. ప్రయోగాలకు ప్రతిరూపం ఆయన. ఆయన శ్వాస, ధ్యాస సినిమానే. డీటీహెచ్‌ విడుదల సినీ చరిత్రలో గొప్ప ప్రయోగంగా మిగిలిపోతుంది. ఆ క్రెడిట్‌ను విడుదల తర్వాత అందరూ గుర్తిస్తారు. ఇలాంటి విషయాలకు థియేటర్‌ వర్గాలు సహకరించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. థియేటర్‌ యజమానుల సంఘం ప్రకటనను పునఃపరిశీలించాలి'అని తెలిపారు.

  ఈ వివాదాన్ని ప్ర్కక్కన పెట్టి...ఓ సారి కమల్ ఈ సినిమాలో చూపిన విశ్వరూపం చూద్దాం....

  ఇప్పటికే బాగా లేటైన ఈ చిత్రం ..జడనరి 10 న ప్రపంచ వ్యాప్తంగా హిందీ,తెలుగు,తమిళ భాషల్లో భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు.

  జాతీయ నటుడు రాహుల్ బోస్ ఈ చిత్రంలో కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. ఆయన పాత్ర చిత్రానికి హైలెట్ కానుంది.

  విశ్వరూపం ఓ స్పై థ్రిల్లర్...ఈ చిత్రంలో పూజా ఓ ప్రధాన పాత్ర పోషిస్తోంది. ప్రపంచ సినిమా స్ధాయి అనుభూతిని ఈ చిత్రం ఇస్తుంది అని చెప్తున్నారు.

  గుర్తు పట్టారా..రాహుల్ బోస్... కరుడు గట్టిన టెర్రరిస్టుగా కనిపించనున్నాడని తెలుస్తోంది. ఈ చిత్రం కోసం కమల్ ప్రత్యేకంగా Auro 3D ని ఉపయోగిస్తున్నారు. ఈ టెక్నాలిజినీ జార్జ్ లూకస్ తన హాలీవుడ్ చిత్రం రెడ్ టెయిల్ కి వాడుతున్నారు.

  శేఖర్ కపూర్ ఈ చిత్రంలో ప్రత్యేకమైన పాత్ర పోషిస్తున్నారు.

  ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకీ తీవ్రవాద కార్యకలాపాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న వైనాన్ని చర్చిస్తూనే... వారి పని తీరుని, ఆలోచనల్నీ తన చిత్రంలో చూపించబోతున్నట్లు సమాచారం. తీవ్రవాదం గురించి కమల్‌ చిత్రంలో ఏం చర్చించారనే విషయాన్ని గోప్యంగా ఉంచారు. తెరపై ఆయన తీవ్రవాదిగా కనిపించబోతున్నారు.

  English summary
  Vishwaroopam has been hitting headlines over the DTH release issue in the recent times. While Kamal Hassan is clear on his stand and unwilling to bow down to the demands of theatre association, the latter is planning to boycott the film and does not like to encourage this trend as it could prove them costly in the future. In spite of these confusions, here is something for all Kamal Hassan fans. We are bringing you some of the unseen pictures from Vishwaroopam.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X