»   » కమల్‌ 'చీకటి రాజ్యం' ఆ సినిమాకి కాపీనా?

కమల్‌ 'చీకటి రాజ్యం' ఆ సినిమాకి కాపీనా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : ఏదేని స్టార్ హీరో చిత్రం ఫస్ట్ల్ లుక్ లేదా ట్రైలర్ రిలీజైన వెంటనే ఆ చిత్రం కథ ఇదిగో లేదా ఫలానా కాపీ అంటూ ఒకటి ప్రచారంలోకి వచ్చేస్తోంది. తాజాగా కమల్‌ హీరోగా రాజేష్‌ ఎమ్‌.సెల్వ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం పేరే... 'చీకటి రాజ్యం'. త్రిష హీరోయిన్. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్స్ ని రీసెంట్ గా వీడుదల చేసారు.

ఈ చిత్రం Sleepless Night (2011) అనే ఫ్రెంచ్ చిత్రం ఆధారంగా రూపొందుతోందని చెన్నై ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. గతంలోనూ కమల్ చిత్రాలు రకరకాల పరభాషా చిత్రాల నుంచి ప్రేరణ పొందినవి కావటంతో ఇదే నిజమే కావచ్చుననే అంటున్నారు.


ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


ఓ పోలీస్ అధికారి.. ఒక రాత్రిలో తన కొడుకుతో పాటు ఉద్యోగాన్ని ఎలా కాపాడుకున్నాడు...చీకటి రాజ్యంలోని పెద్ద మనుష్యులను ఎలా బయిటపెట్టి, తుదముట్టించాడు అనేదే కథ.


Kamal to remake of a French film?

ఫ్రెంచ్ లో హిట్టయిన ఓ సినిమా కథను ఆధారంగా చేసుకుని.. దర్శకుడు రాజేశ్.. చీకటిరాజ్యం కథను తయారు చేసినట్టు చెప్పుకుంటున్నారు. త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో... టాలీవుడ్ బ్యూటీ మధుశాలిని హాట్ హాట్ గా కనిపించనుందట.


సినిమా కథ అంతా ఓ రాత్రిలోనే ముగిసిపోతుందని.. అందులోనూ ట్విస్ట్ లు, లిప్ లాక్ సీన్లు ఉంటాయని ఇండస్ట్రీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే... ఈ సినిమా స్టోరీని ఫ్రెంచ్ సినిమా నుంచి కాపీ కొట్టారనే ప్రచారాన్ని దర్శకుడు రాజేశ్ కు క్లోజ్ గా ఉండే కొందరు ఖండిస్తున్నారు.


అప్పట్లో 'ఆకలి రాజ్యం' అన్నారు కమల్‌ హాసన్‌. ఇప్పుడు 'చీకటి రాజ్యం' అంటున్నారు. ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్‌ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని రాజ్‌కమల్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌ పతాకంపై ఎన్‌.చంద్రహాసన్‌ నిర్మిస్తున్నారు.


కమల్‌హాసన్‌ మాట్లాడుతూ ''ఇదివరకు ఇక్కడికి వచ్చినప్పుడు తెలుగు సినిమా ఎప్పుడు చేస్తారు? అని అడిగారు. త్వరలోనే చేస్తానని చెప్పా. కానీ ఎవ్వరూ నమ్మలేదు. నేను మాత్రం నా మాటని నిలబెట్టుకొంటూ 'చీకటి రాజ్యం'మొదలుపెట్టా. ఈ సినిమాతో ఆగను. ఇకపై తరచుగా తెలుగులో సినిమాలు చేస్తుంటా. రాజేష్‌ నా శిష్యుడు. ఏడేళ్లుగా నాతో కలిసి ప్రయాణం చేస్తున్నాడు. ఇప్పటికి తనతో సినిమా చేయడం కుదిరింది. ప్రస్తుతం రాజేష్‌కి నేనొక బాలచందర్‌లా కనిపిస్తున్నా.


Kamal to remake of a French film?

నా గురువు బాలచందర్‌గారితో 37 సినిమాలకు కలిసి పని చేశాను. చివరి సినిమా 'ఉత్తమవిలన్‌' చేశాక ఆయన మరణించారు. ఇప్పుడు ఆయన లక్షణాలు నాలో కొన్ని కనిపిస్తున్నాయి. నా కోపం, నటన అన్నీ బాలచందర్‌గారి నుంచి వచ్చినవే. 'చీకటి రాజ్యం' ఒక విభిన్నమైన కథతో రూపొందుతున్న చిత్రం. రెండు గంటలు ఎలా గడిచిపోయాయో తెలియనంతగా ఈ సినిమా చూసిన ప్రేక్షకులు థియేటర్‌ నుంచి బయటికొస్తారు. సినిమా అనేది ఎవరి కారణంగా విజయం సాధిస్తుందో చెప్పలేం. 'షోలే'లో అందరికీ గబ్బర్‌సింగ్‌ పాత్రే గుర్తుంటుంది. అలా ఏ సినిమాతో ఎవరికి గుర్తింపు లభిస్తుందో తెలియది''అన్నారు.


దర్శకుడు మాట్లాడుతూ ''ఈ సినిమాకి దర్శకత్వం వహించే అవకాశం రావడం ఓ వరం. ఆ వరాన్ని కాపాడుకొంటూ అందరికీ నచ్చేలా ఓ మంచి సినిమాని తీస్తాను''అన్నారు. 'కమల్‌హాసన్‌ సినిమాకు పనిచేసే అవకాశం రావడం ఆనందంగా ఉంది'' అన్నారు మాటల రచయిత అబ్బూరి రవి.


ప్రకాష్‌రాజ్‌ మాట్లాడుతూ ''కమల్‌ హాసన్‌ ఫోన్‌ చేసి సినిమా గురించి చెప్పారు. తెలుగులోనూ తీయాలనుకొంటున్నాను అన్నారు. 'కమల్‌ ఓ మహానది. ఆ నది తెలుగుభాషని తాకుతూ వెళితే అంతకంటే ఆనందం ఏముంటుంది? అందుకే ప్రేక్షకులు కూడా అదే కోరుకొంటున్నారు' అని కమల్‌తో చెప్పాను''అన్నారు.


''ఇదివరకు ఎప్పుడూ చేయని ఓ కొత్త తరహా పాత్ర పోషించే అవకాశం లభించింది. కమల్‌ హాసన్‌ సర్‌తో కలిసి పనిచేస్తుండడం ఆనందంగా ఉంది''అని చెప్పింది త్రిష. కిషోర్‌, సంపత్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కూర్పు: విజయ్‌శంకర్‌, కళ: ప్రేమ్‌నివాస్‌.

English summary
Kamal Haasan's upcoming Tamil-Telugu thriller "Thoongaavanam" is reportedly said to be the official remake of French film "Nuit Blanche" aka "Sleepless Night". Kamal Hasan is coming with bilingual entertainer titled Cheekati Rajyam under the direction of Rajesh Selva. He was seen kissing ferociously but whom he is kissing is not shown. Seems Kamal is out killing with a kiss.
Please Wait while comments are loading...