For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ముదురుతోన్న కమల్ 'విశ్వరూపం' వివాదం

  By Srikanya
  |

  చెన్నై: విశ్వనటుడు కమల్ హాసన్ 'విశ్వరూపం' డీటీహెచ్‌ విడుదల ప్రస్తుతం గందరగోళంగా మారింది. ఈ తరహా సాంకేతిక ఆలోచన రావడమే గొప్పని ఓ వర్గం అభినందిస్తుండగా.. ఇలా చేస్తే థియేటర్లకు జనాలు రారని యాజమాన్యాలు వాదిస్తున్నాయి. సినీ పరిశ్రమ మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్థిల్లాలంటే ఇలా కొత్త ప్రయోగాలు తప్పవన్నది కమల్‌ మాట. ఆయనే కాదు.. ఇతర నిర్మాతలు కూడా దీనిపై సానుకూలంగా స్పందిస్తున్నారు. ఇది సఫలమైతే సినీలోకానికి మహర్దశే అంటున్నారు. కానీ తమ కడుపుకొట్టే ప్రక్రియే 'డీటీహెచ్‌' అని వాపోతున్నారు థియేటర్‌ యజమానులు. దీంతో వచ్చే నెల 11వ తేదీన విడుదల కానున్న 'విశ్వరూపం' అన్ని వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. డీటీహెచ్‌ విషయమై సోమవారం ఫిలిం ఛాంబర్‌లో సమావేశం జరిగింది.

  ఈ సందర్భంగా ప్రముఖ దర్శకుడు భారతీరాజా మాట్లాడుతూ... నటనలోనే కాకుండా కాలానుగుణంగా రూపాంతరం చెందడం కమల్‌ ప్రత్యేకత అన్నారు. 'కమల్‌హాసన్‌ తొలి చిత్రం నుంచే ప్రయోగాలు చేస్తున్నారు. ప్రయోగాలకు ప్రతిరూపం ఆయన. ఆయన శ్వాస, ధ్యాస సినిమానే. డీటీహెచ్‌ విడుదల సినీ చరిత్రలో గొప్ప ప్రయోగంగా మిగిలిపోతుంది. ఆ క్రెడిట్‌ను విడుదల తర్వాత అందరూ గుర్తిస్తారు. ఇలాంటి విషయాలకు థియేటర్‌ వర్గాలు సహకరించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. థియేటర్‌ యజమానుల సంఘం ప్రకటనను పునఃపరిశీలించాలి'అని తెలిపారు.

  అలాగే 'థియేటర్‌లో సినిమా చూసేవారు తప్పకుండా అక్కడికే వస్తారు. టీవీల్లో చూసేవారు బుల్లితెరకే పరిమితం అవుతారు. దీనివల్ల థియేటర్‌ యాజమాన్యానికి నష్టమేముంది? ప్రారంభంలో శాటిలైట్‌ హక్కులకు కూడా పెద్ద సమస్యలు వచ్చిపడ్డాయి. నాలుగేళ్ల వరకు ఇవ్వకూడదని చెప్పారు. కానీ ఇప్పుడు వారం తర్వాతే విక్రయించేస్తున్నారు. ఏ విషయాన్నైనా రెండు కోణాల్లో ఆలోచించాల్సిన ఆవశ్యకత ఉంది. థియేటర్‌ వారు ఓ నిర్ణయానికి వచ్చి డిమాండ్‌ చేస్తున్నారు. వారు దీనిపై సానుకూల వాతావరణంలో చర్చించి అనంతరం నిర్ణయం తీసుకుంటే మంచిది'అని భారతిరాజా అభిప్రాయపడ్డారు.

  'థియేటర్లకు జనం రాకపోతే?'.. డీటీహెచ్‌ విడుదలపై ప్రస్తుతం థియేటర్‌ యజమానులతోపాటు ప్రతి ఒక్కరిలోనూ మెదలుతున్న అంశం ఇదే. 'మరి మాకు నష్టమొస్తే పరిస్థితి ఏంటి?' అని కూడా డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్‌ యజమానులు వాపోతున్నారు. గతంలో కమల్‌హాసన్‌ స్వీయ దర్శకనిర్మాణంలో 'హేరామ్‌' చిత్రంలో నటించారని, అయితే అది ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో నష్టపోయిన థియేటర్‌ యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు తదితరులకు కమల్‌ తగిన రుసుం చెల్లించారనే అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు ఆయన సన్నిహితులు. మరి కమల్‌ ఇలాంటి బాటలో నడిస్తే ఆరోగ్యవంతమే. ఆయనతోపాటు భవిష్యత్తులో మిగిలిన నిర్మాతలు కూడా అదేమార్గంలో వెళ్లాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

  ఈ అంశంపై థియేటర్‌ యజమానుల సంఘం ప్రతినిధి శ్రీధర్‌ మీడియాతో మాట్లాడుతూ... 'డీటీహెచ్‌ చిత్రాలకు మేం సహకరించబోమని తీర్మానించాం. ఇందులో ఎలాంటి మార్పూ లేదు. వెండితెర కంటే ఎనిమిది గంటల ముందే నట్టింట్లో సినిమా విడుదలైతే థియేటర్‌కు ఎవరు వస్తారు? నాలుగు కాసులు సంపాదించుకోవడం కాదుకదా.. పెట్టిన డబ్బైనా మేం రాబట్టుకోగలమా? ప్రయోగాలు నష్టాలు తెచ్చేలా ఉంటే మేం మాత్రం ఎలా సహకరించగలము'అని పేర్కొన్నారు. మరి ఈ డీటీహెచ్‌ విడుదల అంశం రెండు పట్టాల్లా వెళుతూ ఉంటే.. సమస్యకు పరిష్కారం ఏంటని ప్రేక్షకుడు ఎదురుచూస్తున్నాడు.

  English summary
  Kamal Hassan has decided to go with his plan of releasing his ambitious film, Vishwaroopam, on Direct-To-Home (DTH) platform much before its theatrical release. He will premiere Viswaroopam on DTH, eight hours before the theatrical release on Jan 11, 2013. And it costs Rs 1000 for DTH subscribers at home. The film will be released on DTH as video on demand.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X