»   »  "వ్యాపారం చేస్తే ఊరుకునేది లేదు"

"వ్యాపారం చేస్తే ఊరుకునేది లేదు"

Posted By:
Subscribe to Filmibeat Telugu


కమల్ హాసన్ కు కొత్త సమస్య ఎదురైంది. ఆయన పేరుమీద గుర్తుతెలియని వ్యక్తులు వెబ్ సైట్ ను నడుపుతున్నారట. ఈ వెబ్ సైట్ విషయం తెలిసిన కమల్ హాసన్ అగ్గిమీద గుగ్గిలం అయ్యాడు. ఇందుకు సంబంధించి వార్నింగ్ ఇస్తూ కమల్ హాసన్ సోమవారం పత్రికా ప్రకటన విడుదల చేశాడు. ఫ్యాన్స్ అని చెప్పుకుంటూ తన పేరిట వెబ్ సైట్ ను ప్రారంభించి బిజినెస్ చేస్తున్నవారు ఇలాంటి పనులు మానుకోవాలని ఆయన హెచ్చరించారు. దీనంతటికీ ఈ మధ్య జరిగిన ఒక గొడవే కమల్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

కమల్ హాసన్ మాటల్లోనే...కొంతమంది నా పేరుపై www.universalherokamal.com ఓపెన్ చేసి ఈ సైట్ పేరు మీద టీ-షర్ట్స్ రూపొందించి అమ్ముతున్నారు. ఈ టీ-షర్ట్స్ పై నా బొమ్మలు ముద్రించారు...ఇంకా విశేషమేమంటేwww.orkut.com కమల్ హాసన్ ఫ్యాన్స్ కమ్యూనిటీతో కలిసి ఈ పని చేస్తున్నారు. ఇదంతా నా పర్మిషన్ లేకుండా చేస్తున్నారు. ఇలాంటివి మున్ముందు కూడా చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సివస్తుంది. వెంటనే మానుకోండి...అని వార్నింగ్ ఇచ్చాడు.

తన ఫ్యాన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పెట్టింది కేవలం సమాజ సేవ చేయడానికి తప్ప వ్యాపారం చేసి డబ్బు సంపాదించడానికి కాదని ఆయన అన్నాడు. 20 ఏళ్ల కిందటే కమల్ హాసన్ తన ఫ్యాన్స్ సంఘాలను సామాజిక సేవవైపు మళ్లించిన ఘనత కలవాడు. మయ్యమ్ అనే మ్యాగజైన్ ఫ్యాన్స్ వెల్పేర్ అసోసియేషన్ తీస్తున్నది. కమల్ ఏదైనా చెప్పదలచుకుంటే ఈ పత్రిక ద్వారా చెబుతాడు. కమల్ భర్త్ డే రోజు పలు సామాజిక కార్యక్రమాలు చేపట్టడం చాన్నాళ్లుగా జరుగుతూవస్తోంది. పోర్టల్స్ విషయంలో తన ఫ్యాన్స్ అప్రమత్తతతో ఉండాలని సూచించారు. తన పేరిట వ్యాపారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడం ఖాయమని కమల్ చెప్పారు.

Read more about: kamal hasan business t shirts
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X