»   » కమల్ 'శభాష్ నాయుడు' లాంచ్, ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్

కమల్ 'శభాష్ నాయుడు' లాంచ్, ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  చెన్నై: లోకనాయకుడు కమల్ హాసన్ నటించనున్న తదుపరి చిత్రం అట్టహాసంగా చెన్నైలోని నడిగర్ సంఘ మైదానంలో ప్రారంభం అయ్యింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కుతుండగా.. ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్ ను ఈ కార్యక్రమంలోనే విడుదల చేశారు.

  ఈ చిత్రంలో కమల్ భార్య పాత్రలో రమ్యకృష్ణ, కూతురు పాత్రలో శృతి హాసన్ కనిపించనున్నారు. కామెడీ డ్రామాగా రాజ్ కమల్ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

  ఇళయరాజా ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ చిత్రంలో బ్రహ్మానందం ఓ ప్రముఖ పాత్రలో నటిస్తున్నాడు. కాగా ఈ చిత్ర ప్రారంభోత్సవానికి ఇళయరాజా, శృతి హాసన్, విశాల్, కార్తీతో పాటు తదితర తమిళ ప్రముఖులు హాజరైయ్యారని కోలీవుడ్ వర్గాల సమాచారం.

  ఇళయరాజా సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో పరేష్ రావల్ మరో ముఖ్య పాత్రలో దర్శనమివ్వనున్నారు. కమల్ హాసన్, శృతి హాసన్ తెరపైనా తండ్రీ కూతుళ్లుగా కనపడనున్న సంగతి తెలిసిందే.

  మరిన్ని విశేషాలు, లాంచింగ్ ఫొటోలతో ...

  మూడు భాషల్లో...

  మూడు భాషల్లో...

  విశ్వనాయకుడు కమల్‌హాసన్ త్వరలో మూడు భాషల్లో ఒకేసారి సినిమా తీయబోతున్నారు.తెలుగు, తమిళ భాషల్లో 'శభాష్ నాయుడు', హిందీలో 'శభాష్ కుందు' అనే పేర్లతో ఈ సినిమా తీయబోతున్నారు. ఈ విషయాన్ని కమల్ హాసన్ తన సినిమా లాంచింగ్ సందర్భంగా వెల్లడించారు.

  మరో విశేషం..

  మరో విశేషం..

  ఈ సినిమాకు టీకే రాజీవ్‌ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. కమల్‌తో పాటు ఆయన కూతురు శ్రుతిహాసన్ కూడా ఈ సినిమాలో నటించడం మరో విశేషం.

  బ్రహ్మీ స్పెషల్ రోల్

  బ్రహ్మీ స్పెషల్ రోల్

  విశ్వనాయకుడి సరసన రమ్యకృష్ణ హీరోయిన్‌గా చేస్తుండగా, బ్రహ్మానందం కూడా ఓ ముఖ్యపాత్రలో మెరుస్తారు.

  అదే పాత్ర కంటిన్యూషన్

  అదే పాత్ర కంటిన్యూషన్

  గతంలో 2008 సంవత్సరంలో కమల్ తీసిన దశావతారం సినిమాలో 'బలరాం నాయుడు' అనే సీబీఐ ఆఫీసర్ పాత్రను మళ్లీ ఇందులో పోషిస్తున్నారు. ఆయన అసిస్టెంట్‌గా బ్రహ్మానందం కనిపిస్తారు.

  కమల్ 'శభాష్ నాయుడు' లాంచ్, ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్

  కమల్ 'శభాష్ నాయుడు' లాంచ్, ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్

  రాజ్‌కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్‌లో తీస్తున్న ఈ సినిమా షూటింగ్ మే రెండోవారం నుంచి ప్రారంభమవుతుంది. దీనికి ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు.

  హిట్ కాంబినేషన్ మళ్లీ...

  హిట్ కాంబినేషన్ మళ్లీ...

  కమల్‌హాసన్-ఇళయరాజాలది ఓ సూపర్‌హిట్ కాంబినేషన్. కానీ, దాదాపు 11 ఏళ్లుగా కమల్ నటించిన ఏ చిత్రానికీ ఇళయరాజా పనిచేయలేదు. తాజాగా వీరిద్దరూ కలిసి మళ్లీ పనిచేస్తున్నారు.

  ఇళయరాజానే పేరు పెట్టారు.

  ఇళయరాజానే పేరు పెట్టారు.

  శ్రుతీహాసన్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి టీకే రాజీవ్‌మీనన్ దర్శకుడు.విశేషమేమిటంటే, ఈ సినిమాకు నామకరణం ఇళయరాజానే చేశారట!

  అప్పట్లో కూడా..

  అప్పట్లో కూడా..

  పాతికేళ్ల క్రితం తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఓ చిత్రానికి 'గుణ' అనే టైటిల్ పెట్టింది కూడా ఇళయరాజానే. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత కమల్ సినిమాకు ఇళయరాజా టైటిల్ సూచించారు.

  స్వయంగా చెప్పారు

  స్వయంగా చెప్పారు

  ఈ విషయాన్ని కమల్ స్వయంగా ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. మరి ఈ సినిమా టైటిల్ ఏంటో ఇప్పుడు మీకు అర్దమైంది కదా

  వినోదమే ప్రధానం

  వినోదమే ప్రధానం

  ఒక మంచి వినోదంతో కూడిన తండ్రీకూతుళ్ల అనుబంధాల కథను ఈ సినిమాకు ఎంపిక చేసుకున్నారు.

  ఇంతకు ముందు

  ఇంతకు ముందు

  దీనికి మలయాళ దర్శకుడు టీకే.రాజీవ్‌కుమార్ దర్శకత్వం వహించనున్నారు.ఈయన కమలహాసన్‌తో ఇంతకు ముందు చాణక్యన్ అనే మలయాళ చిత్రాన్ని తెరకెక్కించారన్నది గమనార్హం.

  41 వ చిత్రం

  41 వ చిత్రం

  తాజా చిత్రాన్ని కమల్ రాజ్‌కమల్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మించనుంది. ఇది ఈ సంస్థ నిర్మిస్తున్న 41వ చిత్రం అవుతుంది.

  క్రేజీగా..

  క్రేజీగా..

  దీనికి హాస్యనటుడు, కథకుడు క్రేజీ మోహన్ సంభాషణలు అందించడం విశేషం .వీరి కలయికలో ఇంతకు ముందు పలు భాషల్లో వందకు పైగా చిత్రాలు రూపొందాయన్నది గమనార్హం.

  చివరి చిత్రం

  చివరి చిత్రం

  అయితే తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కిన ముంబై ఎక్స్‌ప్రెస్‌నే కమల్, ఇళయరాజాల కాంబినేషన్‌లో రూపొందిన చివరి చిత్రం.

  స్పెషల్

  స్పెషల్

  ఇకపోతే ఇందులో ముఖ్య పాత్రను నటి రమ్యక్రిష్ణ పోషించనుండడం మరో విశేషం. గతంలో వీరి కాంబినేషన్ లో పంచతంత్రం చిత్రం వచ్చి హిట్టైంది.

  English summary
  Today, 29th April, Kamal revealed the title of his next as Sabash Naidu in the Nadigar Sangam complex in Chennai. He also introduced the cast and crew. Shruti Haasan plays his daughter in the film. Other cast members are Ramya Krishnan, Brammanandam, and Saurab Shukla to start with.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more