కోలుకున్న రజనీకాంత్ చూసిన మొదటి సినిమా
అనారోగ్యం నుంచి కోలుకున్న రజనీకాంత్ చాలా గ్యాప్ తర్వాత చూసిన మొదటి చిత్రం కాంచన. రాఘవ లారెన్స్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ఆయన స్పెషల్ స్క్రీనింగ్ వేయించుకుని మరీ చూసారు. చూసి లారెన్స్ ను తెగ మెచ్చకున్నారని, ముఖ్యంగా శరత్ కుమార్ నటనకు ఆయన ఆశ్చర్యపోయారని తెలుస్తోంది. ఇక ఇప్పటికే కాంచన చిత్రం మెగా హిట్ గా తెలుగులో నమోదు అయ్యింది. ఈ చిత్రాన్ని రీమేక్ చేయటానికి సల్మాన్ ఖాన్ ఆసక్తి చూపెడుతున్నారు.సంజయ్ దత్.. శరత్ కుమార్ పాత్రలో చేయటానికి ఓకే అన్నారు. అయితే బెల్లంకొండ సురేష్ ఈ చిత్రాన్ని హిందీలో నిర్మించాలని ప్లాన్ చేసి చర్చలు జరుపుతున్నారు.
బెల్లంకొండ మాట్లాడుతూ.... విడుదలైన రోజు నుంచి ఇప్పటివరకు భారీ కలెక్షన్స్ తో ప్రదర్శింపబడుతుండటం ఆనందంగా వుంది. అన్నివర్గాల ప్రేక్షకులని ఆకట్టుకునే విధంగా లారెన్స్ ఈ చిత్రాన్ని చాలా చక్కగా రూపొందించారు. శరత్ కుమార్ పోషించిన పాత్రవల్లే 'కాంచన" ఈ స్థాయిలో కలెక్షన్స్ వసూలు చేస్తోంది. ఈ చిత్రం ప్రస్తుతం 'చంద్రముఖి" కలెక్షన్స్ ని దాటి 'అరుంధతి" కలెక్షన్స్ ని క్రాస్ చేసే దశలో వుంది. సినిమా ఏ స్థాయి విజయాన్ని సాధించిందో మరి కొన్ని రోజుల్లో తెలుస్తుందన్నారు.


Click it and Unblock the Notifications











