ఆ హీరోయిన్‌తో స్టార్ హీరోకు ఎఫైర్... భార్య ఎంట్రీతో రచ్చ రచ్చ!
ఇటీవల కాటేరా చిత్రంతో ప్రేక్షకుల ముందకు వచ్చిన హీరో డి బాస్ దర్శన్. ఈ హీరో ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద 200 కోట్ల రూపాయలను వసూలు చేసి.. సంచలనం సృష్టించాడు. ఓవైపు ప్రభాస్ సలార్, షారుఖ్ డంకీ చిత్రాలకు తన చిత్రం కాటేరాతో వణుకు పుట్టించిన ఈ హీరో ఇప్పుడు శాండిల్ వుడ్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాడు. ఆయనకు ఓ హీరోయిన్ తో ఎఫైర్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఈ విషయం తెలుసుకున్న భార్య ఎంట్రీతో రచ్చగా మారింది. అసలు ఏం జరిగిందో ఈ స్టోరీలో చూద్దాం.

కన్నడ పరిశ్రమలో స్టార్ హీరోగా కొనసాగుతున్న డీ బాస్ దర్శన్... సినీ ప్రేమికులకు సుపరిచితమే. ఇక ఈ స్టార్ హీరో ఇటీవల కాటేరా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 200 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి సంచలనం సృష్టించింది. ఇక దర్శన్ అభిమానులు.. ఈ సినిమాతో పండగ చేసుకున్నారు. ఓవైపు షారుఖ్ డంకీ, ప్రభాస్ సలార్ చిత్రాలను కూడా ఈ కాటేరా చిత్రం వణికించింది.

ఇదిలా ఉంటే ఈ స్టార్ హీరో ఇంట్లో గొడవలు మొదలు అయ్యాయి. దానికి కారణం ఓ హీరోయిన్ అని తెలుస్తోంది. అభిమానులు అంతా డీ బాస్ గా పిలుచుకునే దర్శన్ ఇంట్లో రచ్చరచ్చగా మారింది. దర్శన్ భార్య విజయలక్ష్మి మరొక నటి అయిన పవిత్ర గౌడతో గొడవ పెట్టుకున్నట్లు శాండిల్ వుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీంతో స్టార్ హీరో ఇంట్లో గొడవలు హాట్ టాపిక్ గా మారాయి. ఈ విషయం తెలిసిన అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

అసలు విషయం ఏంటంటే... కన్నడ నటి పవిత్ర గౌడ్ కు, దర్శన్ కు ఎఫైర్ ఉందని ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. ఈ విషయం శాండిల్ వుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. దానికి కారణం ఏంటంటే.. పవిత్ర గౌత్ తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఫోటోలే కారణం అని తెలుస్తోంది. పవిత్ర గౌడ కొన్ని కన్నడ సినిమాల్లో నటించగా... ఈ హీరోయిన్ దర్శన్ తో ప్రేమలో ఉన్నట్లు రూమర్స్ వచ్చాయి. తరచూ దర్శన్ తో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం.. దానికి ఓ క్యాప్షన్ పెట్టడం ఇప్పుడు చర్చకు దారితీసింది.
దర్శన్ తో కలిసి ఉన్న ఫోటోలు షేర్ చేసి... మా రిలేషన్ పూర్తి అయి 10 సంవత్సరాలు దాటిందంటూ.. రాసుకువచ్చింది. దీంతో ఈ పోస్టు చూసిన నెటిజన్స్ షాక్ కు గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న భార్య విజయలక్ష్మి.. ఆమెతో గొడవ పెట్టుకుందట. దర్శన్ తో కనిపించొద్దని వార్నింగ్ ఇచ్చినట్లు శాండిల్ వుడ్ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. అంతే కాదు... లీగల్ గా యాక్షన్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఇక ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో కానీ... ఈ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది.


Click it and Unblock the Notifications











