»   » హీరో సూర్య పరువు తీసిన కరీనా కపూర్, ఫ్యాన్స్ ఫైర్

హీరో సూర్య పరువు తీసిన కరీనా కపూర్, ఫ్యాన్స్ ఫైర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ సౌతిండియా స్టార్ హీరో సూర్య గురించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ఆమె వ్యాఖ్యలపై సూర్య అభిమానులు ఆగ్రహంగా ఉన్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కరీనా కపూర్ మాట్లాడుతూ సూర్య ఎవరో తనకు తెలియదు అని వ్యాఖ్యానించారు. పాపులర్ హీరోయిన అయిన సూర్య గురించి ఆమె ఇంత దారుణంగా మాట్లాడటాన్ని అభిమానులు అవమానంగా భావిస్తున్నారు.

సూర్య నటిస్తున్న తమిళ చిత్రం 'అంజాన్' చిత్రంలో కరీనా కపూర్ ఐటం సాంగు చేయబోతోందనే వార్తలు ఇటీవల ప్రచారంలోకి వచ్చాయి. లింగుస్వామి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం ద్వారానే కరీనా కపూర్ ఐటం సాంగు ద్వారా సౌత్ సినిమా పరిశ్రమలో అడుగు పెడుతోందని వార్తలు జోరందుకున్నాయి.

ఈ వార్తలపై కరీనా కపూర్ స్పందిస్తూ....నేను 'అంజాన్' చిత్రంలో ఐటం సాంగు చేయడం లేదు, అసలు సూర్య, లింగుస్వామి ఎవరో కూడా నాకు తెలియదు అని వ్యాఖ్యానించింది కరీనా కపూర్.

కరీనా కపూర్

కరీనా కపూర్

సౌండియా లాంగ్వేజ్‌లలో నటించడం తనకు ఎంతో ఇష్టమని, అదే విధంగా మరాఠీ, బెంగాలీ చిత్రాల్లో కూడా నటించడం అన్నా ఇష్టమే, వివిధ బాషల్లో పని చేస్తూ ఆ భాష నేర్చుకోవడం ఇష్టమని కరీనా కపూర్ తెలిపారు.

అసలు విషయం ఏమిటి?

అసలు విషయం ఏమిటి?

వాస్తవానికి కరీనా కపూర్ ‘అంజాన్' చిత్రంలో ఐటం సాంగు చేస్తోందంటూ....ఏప్రిల్ ఫూల్ కథనాలు వెలువడ్డాయి. దీంతో కొన్ని పబ్లికేషన్స్ అసలు విషయాన్ని గ్రహించక ఆమె సౌతిండియా ప్రవేశం చేస్తోందంటూ వార్తలు వెలువరించాయి. అదన్నమాట సంగతి.

కరీనా వ్యాఖ్యలకు సూర్య అభిమానులు హర్ట్

కరీనా వ్యాఖ్యలకు సూర్య అభిమానులు హర్ట్

సూర్య ఎవరో తెలియదని కరీనా కపూర్ వ్యాఖ్యానించడంతో ఆయన అభిమానులు హర్ట్ అయ్యారు.

కరీనా క్షమాపణ చెప్పాలి

కరీనా క్షమాపణ చెప్పాలి

సూర్య ఎవరో తెలియదు అంటూ కరీనా కపూర్ వ్యాఖ్యలపై మండిపడుతున్న అభిమానులు ఆమె క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

కరీనా కపూర్ స్పందిస్తుందా?

కరీనా కపూర్ స్పందిస్తుందా?

సూర్య అభిమానులు చేస్తున్న వ్యాఖ్యలకు కరీనా కపూర్ స్పందిస్తుందా? ఎలా స్పందిస్తుందా? అనే విషయాలకు కాలమే సమాధానం చెప్పాలి.

English summary
Kareena Kapoor's comment on Surya has sparked a controversy down South. The actor's fans are upset with her after she said in an interview that she doesn't know who he is. They have found her statement as an insult and have expressed their anger on Online platforms.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu