»   » కాంట్రవర్షియల్ హీరోయిన్ తో కమిటైన కార్తీ..!?

కాంట్రవర్షియల్ హీరోయిన్ తో కమిటైన కార్తీ..!?

By Sindhu
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  ఇటీవల కన్నడ పరిశ్రమలో హీరో దర్శన్ తో లవ్ ఎఫైర్ సాగిస్తోందంటూ వివాదం లో ఇరుక్కున్న నికిత నిషేధానికి గురై వార్తల్లోకెక్కిన అందాలభామకు, ఇప్పుడు దశ తిరుగుతున్నట్టు కనిపిస్తోంది. ఆమెపై మూడేళ్లు నిషేదం విధించిన కన్నడ నిర్మాత మండలి...క్షమాపణ చెప్పి మరీ ఆ నిషేధాన్ని ఉపసంహరించుకుంది. కన్నడ పరిశ్రమ వివాదంతో ఎంతో పాప్యులారిటీ తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా ఓ తమిళ సినిమాలో బుక్ అయిందని సమాచారం.

  'ఆవారా' ఫేం కార్తీ, అనుష్క జంటగా నటిస్తున్న ఓ చిత్రంలో నిఖిత సెకండ్ హీరోయిన్ గా ఎంపికైంది. ఇందులో తాను ఓ పల్లెటూరి అమ్మాయిగా నటిస్తున్నాననీ, అనుష్కలానే తనకూ ఇందులో రెండు డ్యుయేట్స్ ఉన్నాయనీ ఆమె చెబుతోంది. కాగా, తెలుగులో అల్లరి నరేష్ నటించే సినిమాలోనూ, మరో రెండు హిందీ సినిమాలలోనూ ప్రస్తుతం తాను నటిస్తున్నట్టు నిఖిత చెప్పింది. కన్నడ సినిమాలలో కూడా నటిస్తాననీ, మంచి ఆఫర్ల కోసం ఎదురుచూస్తున్నాననీ అంటోంది. మరి ఒక్క వివాదం(ఐడియా)తన జీవితాన్ని ఇలా మార్చుతుందని ఊహించని నికిత ఆనందంతో తలమునకలవుతోందట.

  English summary
  Director Suraaj is gearing up to direct Karthi soon after the star completes Saguni. For Suraj's film, Anushka has already been signed up as the heroine. The latest addition to this team is Nikitha Thukral, the infamous Kannada actress who shot to limelight for being banned by the Karnataka Film Producers Association for her alleged affair with actor Darshan.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more