»   » వీళ్లకి ఇకనైనా హిట్ వస్తుందా..?

వీళ్లకి ఇకనైనా హిట్ వస్తుందా..?

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Karthi, Jeeva to fight it out at the B O
  చెన్నై :కార్తీ, జీవా.. ఇద్దరూ సంచలనాలు సృష్టించిన హీరోలే. 'పరుత్తివీరన్‌'తో తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుని విజయదుందుభి మోగించారు కార్తీ. ఆ తర్వాత 'పయ్యా', 'సిరుత్త్తె', నాన్‌ మహాన్‌ అల్ల'తో వరుస హిట్లు దక్కించుకున్నారు. జీవా వైవిధ్య బాటలో ప్రత్యేక చిత్రాలతో ప్రయోగాలు చేశారు. అలా 'ఈ', 'కో', 'డిష్యూం'తో మంచిపేరు తెచ్చుకున్నారు. వీరిద్దరి వేగానికి ఈ మధ్య కళ్లెం పడిందనే చెప్పాలి. రెండేళ్లుగా విజయం లేక విలవిల్లాడుతున్నారు.

  జీవాకు 'వందాన్‌ వెండ్రాన్‌', 'నీదానే ఎన్‌ పొన్‌వసందం', కార్తీకి 'ఆల్‌ఇన్‌ఆల్‌ ఇళగురాజా', 'అలెక్స్‌ పాండియన్‌', 'శకుని' వరుస పరాజయాన్ని రుచిచూపాయి. ఈ నేపథ్యంలో మంచి హిట్‌ కోసం వారు ఎదురుచూస్తున్నారు. ఈ రోజు (శుక్రవారం) తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వారి సినిమాలు యాధృచ్ఛికంగా ఒకేరోజున తెరపైకి రానున్నాయి.

  కార్తీ తొలి సినిమాతో తిరుగులేని పేరు సంపాదించుకున్నారు. అందుకు పదిరెట్ల విజయాన్నిచ్చింది 'సిరుత్త్తె'. ఆయనను మాస్‌ హీరోగా మార్చడం మాత్రమే కాదు... ప్రత్యేక స్టార్‌డం కూడా తెచ్చిపెట్టింది. అంతేకాకుండా.. ఈ సినిమాలు తెలుగులోనూ విడుదలై భారీగా కాసుల వర్షం కురిపించాయి. టాలీవుడ్‌లోనూ ఇక్కడికి దీటుగా మార్కెట్‌ ఏర్పడింది కార్తీకి. ఈ మధ్య తెలుగులో కూడా ఎదురుగాలులు వీస్తున్నాయి.

  పూర్వవైభవాన్ని సొంతం చేసుకునేందుకు వెంకట్‌ప్రభు వండిన 'బిరియాని'ని థియేటర్లలో ప్రేక్షకులకు రుచి చూపించేందుకు సిద్ధమవుతున్నారు. యువన్‌ శంకర్‌రాజా సంగీతం సమకూర్చారు. ఇది ఆయనకు వందో సినిమా కావడం విశేషం. 'మంగాత్తా' తర్వాత వెంకట్‌ప్రభు తెరకెక్కిస్తున్న సినిమా ఇది. దీపావళి సందర్భంగా తెరపైకి తీసుకురావాలని తొలుత నిర్ణయించారు. అప్పటికే 'ఆల్‌ఇన్‌ఆల్‌ అళగురాజా' సిద్ధమవడంతో వాయిదా వేశారు. ఈ నెల 20వ తేదీన విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉందీ చిత్రం. కార్తీకి జంటగా హన్సిక తొలిసారిగా ఆడిపాడింది.

  'కో' తర్వాత జీవాకు సరైన హిట్‌ లేదనే చెప్పాలి. గౌతంమీనన్‌ దర్శకత్వంలోని 'నీదానే ఎన్‌ పొన్‌వసందం'పై కోటి ఆశలు పెంచుకున్నారు. కానీ నిరాశే ఎదురైంది. ఇదే వరుసలో 'ముగమూడి', 'వందాన్‌ వెండ్రాన్‌', 'రౌద్ధిరం', 'డేవిడ్‌' కూడా వరుసగా బాక్సాపీసు వద్ద బోల్తా పడటంతో జీవా డీలాపడ్డారు. 'ఎండ్రెండ్రుం పున్నగై' ఆ లోటును తీర్చుతుందనే నమ్మకంలో ఉన్నారకాయన. కెరీర్‌ ప్రారంభించి పదేళ్లయినా తొలిసారిగా త్రిషతో జతకడుతున్నాడీ హీరో.

  హ్యారీస్‌ జయరాజ్‌ సంగీతం సమకూర్చుతున్నారు. 'వామనన్‌' ఫేం అహ్మద్‌ దర్శకత్వం వహిస్తున్నారు. సరికొత్త మ్యూజికల్‌, ప్రేమకథగా దీన్ని తెరకెక్కించారు. ఈ సినిమాలు సంక్రాంతికి రావాల్సి ఉన్నా.. అజిత్‌ నటించిన 'వీరం', విజయ్‌ హీరోగా 'జిల్లా' కూడా పండుగ బరిలో ఉండటంతో ముందుగానే రానున్నాయి.

  English summary
  It is going to be an interesting battle at the box-office, for Christmas festival next month. Though Pongal is expected to witness a three-pronged contest (Superstar Rajinikanth's Kochadaiyaan, Ajith’s Veeran and Vijay's Jilla are slated for release), the last weekend of December could be a big one too. Venkat Prabhu's Biriyani starring Karthi and Jiiva's Endrendrum Punnagai will hit screens for the festival.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more