»   » ట్రైలర్ చూస్తూంటే హిట్ కొట్టేటట్లున్నాడు(వీడియో)

ట్రైలర్ చూస్తూంటే హిట్ కొట్టేటట్లున్నాడు(వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : 'పరుత్తివీరన్ చిత్రంతో తమిళ పరిశ్రమలోకి అడుగుపెట్టిన హీరోకార్తి. తర్వాత చాలా చిత్రాల్లో గ్రామీణ పాత్రల్లో నటించే అవకాశం వచ్చినా.. ఆయన ఒప్పుకోలేదు. ప్రస్తుతం ముత్తయ్య దర్శకత్వంలో ఆయన ఈ తరహా కథాంశంతో తెరకెక్కే 'కొంబన్‌' చిత్రంలో హీరోగా నటించారు. లక్ష్మీ మేనన్‌ హీరోయిన్. ఇందులో రాజ్‌కిరణ్‌ కీలకపాత్ర పోషించారు. ఈ సినిమా ఆడియో విడుదల చెన్నైలోని ప్రసాద్‌ల్యాబ్‌లో జరిగింది. అలాగే చిత్రం ట్రైలర్ ని సైతం విడుదల చేసారు. ఆ ట్రైలర్ ని ఇక్కడ మీరు చూడండి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఈ సందర్భంగా కార్తి మాట్లాడుతూ.. '' మదురై నేపథ్యంలో సాగే 'పరుత్తివీరన్‌'లో నటించిన తర్వాత అలాంటి అవకాశాలు చాలా వచ్చినా నిరాకరించా. ఆ సినిమాకన్నా గొప్ప సబ్జెక్ట్‌ వస్తే తప్ప నటించకూడదని నిర్ణయించుకున్నా. అప్పుడే ముత్తయ్య 'కొంబన్‌' కథ చెప్పారు. మామ, అల్లుడు మధ్య నడిచే అంశాల ఆధారంగా ఈ కథ అల్లారు. రామనాథపురం జిల్లా నేపథ్యంలో దీన్ని తెరకెక్కించాం. కనీసం మౌలిక సదుపాయాలు కూడా లేని గ్రామంలో చిత్రీకరణ సాగింది.

Karthi's new film Komban audio launched

ఆ గ్రామస్తులు మాకు ఎంతో సహకరించారు. ఇందులో ఏ సినిమా ఛాయలూ కనిపించవని తెలిశాకే.. పలుసార్లు ఆలోచించి నటించేందుకు ఒప్పుకున్నా. తెరపై చూస్తుంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. లక్ష్మీ మేనన్‌ గ్రామీణ యువతిగా, నూతన వధువుగా అద్భుతంగా నటించారు. రాజ్‌కిరణ్‌ నాకు మామ పాత్ర పోషించారు. ఆయన నటన సినిమాకు పెద్ద బలం. తమిళనాడు సంప్రదాయాలు, గ్రామీణ అందాలు నిండిన ఈ సినిమా తప్పకుండా నా కెరీర్‌కు గుర్తింపు తీసుకొస్తుంద''ని పేర్కొన్నారు.

దర్శకుడు ముత్తయ్య ప్రసంగిస్తూ.. '' నా తొలిచిత్రం 'కుట్టిపులి' తల్లి సెంటిమెంట్‌తో వచ్చింది. ఇందులో మామ, అల్లుడు మధ్య బంధం గురించి చెప్పా. నా తదుపరి సినిమాలు కూడా తప్పకుండా బంధుత్వాలు, అనుబంధాల మీదే ఉంటాయి. 'కొంబన్‌' నా ఇంటి కథ. మా తాత, నాన్నల జీవితం ఆధారంగానే దీన్ని రూపొందించాన''ని చెప్పారు. స్టూడియోగ్రీన్‌ బ్యానరుపై జ్ఞానవేల్‌రాజా నిర్మిస్తున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్‌ సంగీతం సమకూర్చారు.

English summary
Karthi's new film Kombam audio has been launched. Kombam will be directed by Muthaiah of Kutti Puli fame. Lakshmi Menon will play the female lead. Kombam is a rural film set in the backdrop of Ramanathapuram. Yuvan is scoring the music. Velaraj is handling the camera. Editing by Praveen KL. The film is produced by Studio Green.
Please Wait while comments are loading...