»   » షాక్ : సీబీ-సీఐడీ ని ఆశ్రయించిన హీరో కార్తీ

షాక్ : సీబీ-సీఐడీ ని ఆశ్రయించిన హీరో కార్తీ

Posted By:
Subscribe to Filmibeat Telugu
చెన్నై : తమిళ,తెలుగు చిత్రాలతో దూసుకుపోతున్న హీరో కార్తీ ...సీబీసీఐడిని ఆశ్రయించాల్సిన పరిస్దితి వచ్చింది. కార్తీ తాజా చిత్రం 'బిరియానీ' చిత్ర బృందానికి ఇంటర్నెట్ దెబ్బ తగిలింది. చిత్రం ఆడియో ఆవిష్కరణ కాకముందే ఆ చిత్రంలోని అన్ని పాటలు ఇంటెర్నెట్‌లో హల్‌చల్ చేస్తుండడంతో షాక్ అయిన యూనిట్ సీబీసీఐడీని ఆశ్రయించింది. నటుడు కార్తీ, హన్సిక జంటగా నటిస్తున్న 'బిరియానీ'చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

సక్సెస్‌ఫుల్ దర్శకుడు వెంకట్ ప్రభు ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, ఇళయరాజా తనయుడు యువన్ శంకర్‌రాజా చిత్రానికి సంగీతం అందించారు. ఈ చిత్రం యువన్ శంకర్‌రాజాకు 100 వ చిత్రం కావడంతో ఆయన ప్రతిష్ఠాత్మకంగా సంగీతాన్ని సమకూర్చినట్లు తెలుస్తోంది.

ఈ నెల 31న యువన్ పుట్టినరోజు కావడంతో అదే రోజున ఆడియోను విడుదల చేసేందుకు చిత్ర నిర్మాత నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఇంటర్నెట్‌లో బిరియానీ చిత్రంలోని ఎనిమిది పాటలు దర్శనమివ్వడంతో దిక్కుతోచని చిత్ర బృందం సోమవారం స్థానిక గిండీలోని సీబీసీఐడీ కార్యాలయానికి చేరుకుని ఫిర్యాదు చేశారు. చిత్ర హీరో కార్తీ, దర్శకుడు వెంకట్‌ప్రభు, నిర్మాత జ్ఞానవేల్‌రాజా, నటుడు ప్రేమ్‌జీ, సంగీత దర్శకుడు యువన్ శంకర్‌రాజాలు సీబీసీఐడీ కార్యాలయానికి వచ్చిన వారిలో ఉన్నారు.

ఈ సందర్భంగా చిత్ర హీరో కార్తీ మాట్లాడుతూ.. కోట్ల రూపాయల వ్యాపారంతో కూడిన చిత్ర నిర్మాణం రంగాన్ని దెబ్బతీసేందుకు పైరసీ దారులు కుయుక్తులు పన్నుతున్నారని ఆరోపించారు. సినిమాను కొంత మంది ఆట అనుకుంటున్నారని, అందుకే ఇలాంటి పనులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. తమ చిత్రం పాటలను ఇంటర్నెట్‌లో విడుదల చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ సీబీసీఐడీని ఆశ్రయించామన్నారు.

ఇక ఈ చిత్రంపై తమిళనాట మంచి అంచనాలే ఉన్నాయి. తెలుగులోనూ బాగానే మార్కెట్ అవుతుందని భావిస్తున్నారు. తెలుగులో కార్తీకి ఉన్న బిజినెస్ ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ వారికి నచ్చే ఎలిమెంట్స్ కలిపి మరీ నిర్మించారని చెప్తున్నారు. శకుని,బ్యాడ్ బోయ్ చిత్రాలు నిరాశ పరిచిన నేపధ్యంలో ఈ చిత్రం కార్తీకి ఊపునిస్తుందని భావిస్తున్నారు.

English summary

 Now that all the songs of Biryanai film have been illegally out on the net. Not wanting to take any more on this issue, the team of Biriyani comprising of director Venkat Prabhu, Karthi, Yuvan Shankar Raja and producer Gnanavel Raja would be meeting the CB-CID officer at Guindy, Chennai today (19th August 2013) at 11.30 A M to lodge a complaint against the perpetrators of this act and to bring them to books.
 The music of this Yuvan’s 100th film is scheduled to officially be launched on the 31st of August 2013.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu