బ్రేకింగ్: రజనీకాంత్ కొత్త సినిమా పేరు పెట్ట. స్టైలిష్‌ లుక్‌లో కిరాక్

By Rajababu

సూపర్‌స్టార్ రజనీకాంత్, కార్తీక్ సుబ్బరాజ్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా టైటిల్‌ను పెట్టగా ఖరారు చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్‌ను శుక్రవారం సాయంత్రం రిలీజ్ చేశారు. రజనీకాంత్ చాలా స్టైలిష్‌గా చూపిస్తూ విడుదల చేసిన ఈ మోషన్ పోస్టర్ అద్బుతంగా ఆకట్టుకొంటున్నది. సూపర్ స్టార్ రజనీకాంత్ విభిన్నమైన గెటప్‌లో కనిపిస్తూ అభిమానులను థ్రిల్‌ చేస్తున్నాడు. ఈ చిత్రం రజనీ కెరీర్‌లో 165వ సినిమా. ఈ మోషన్ పోస్టర్‌పై మీరు లుక్కేయండి.

ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, త్రిష, బాలీవుడ్ విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖి చేరడంతో సెన్సేషనల్ ప్రాజెక్ట్‌గా మారింది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ ఉత్తర ప్రదేశ్‌లోని డెహ్రాడూన్, లక్నో, తదితర ప్రాంతాల్లో జరుగుతున్నది. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ షూటింగ్‌లో పాల్గొనడం కోసం రజనీకాంత్ యూపీకి వెళ్లారు. తాజా షెడ్యూల్‌లో రజనీ, నవాజుద్దీన్, విజయ్ సేతుపతిపై కాంబినేషన్ షాట్స్ చిత్రీకరించనున్నట్టు సమాచారం.

Karthik Subbarajs Petta motion poster out: Rajinikanth is stylish in first look

జనీకాంత్ సరసన అందాల నటి సిమ్రాన్ నటిస్తున్నది. రీ ఎంట్రీతోనే సూపర్‌స్టార్‌కు జోడిగా నటించే అవకాశం దక్కించుకోవడం గమనార్హం. రజనీ కుమారులుగా బాబీ సింహా, సనత్ రెడ్డి నటిస్తున్నారు. ఈ చిత్రంలో మేఘా ఆకాశ్, సనత్ జంటగా నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X