Don't Miss!
- Lifestyle
Women Money Habits: మహిళల ఈ అలవాట్లతో ఉన్నదంతా పోయి బికారీ కావాల్సిందే!
- News
జేఈఈ మెయిన్స్ ఆన్సర్ కీ 2023 విడుదల: డౌన్లోడ్ చేసుకోండిలా!
- Sports
కోహ్లీ.. ఆ ఆసీస్ బౌలర్లను దంచికొట్టాలి! లేకుంటే మొదటికే మోసం: ఇర్ఫాన్ పఠాన్
- Finance
nri taxes: బడ్జెట్ వల్ల NRIలకు దక్కిన నాలుగు ప్రయోజనాలు..
- Technology
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
డ్రైవింగ్ రాదు.. కారు నడిపి హీరోని హడలెత్తించింది
చెన్నై: డ్రైవింగ్ తెలియకుండానే కారు నడిపి తమందరినీ కార్తిక హడలెత్తించిందని నటుడు అరుణ్ విజయ్ తెలిపారు. రత్న శివా దర్శకత్వంలో అరుణ్ విజయ్, కార్తిక జంటగా నటించిన చిత్రం వా'. కార్తీక గుర్తుండే ఉండి ఉంటుంది. గతంలో ఆమె తెలుగులో జోష్ చిత్రంతో పరిచయమైంది. రీసెంట్ గా దమ్ము, తర్వాత నా చెల్లెలు బొమ్మాళి చిత్రంలో అల్లరి నరేష్ కు చెల్లిగా నటించింది. ఇప్పుడు పూర్తిగా తమిళంలోనే చిత్రాలు చేస్తోంది.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
నటుడు అరుణ్ విజయ్ మాట్లాడుతూ... షూటింగ్ మొదటి రోజు కార్తిక కారు నడిపేటట్లు, ఆ కారులో తను, సతీష్ ఉన్నట్లు కొన్ని సన్నివేశాలను చిత్రీకరించాల్సి వచ్చిందన్నారు. దర్శకుడు కార్తికి డైలాగులు వివరించి షూటింగ్‌కు సిద్ధమయ్యారని, డైలాగులన్నీ శ్రద్ధగా విన్న కార్తిక కూడా చిత్రీకరణకు సిద్ధమైందని తెలిపారు. డ్రైవింగ్ సీట్లో కూర్చున్న ఆమె బ్రేక్ ఎక్కడ ఉంది' అంటూ అడిగిందని, దీంతో దిగ్భ్రాంతి చెందిన తాము డ్రైవింగ్ తెలియని తనతో ఆ సన్నివేశాలను ఎలా చిత్రీకరిస్తారంటూ అయోమయంలో పడ్డామని పేర్కొన్నారు.

ఇదే విషయం గురించి దర్శకుడి వద్ద ప్రస్తావించగా కార్తిక బాగా డ్రైవింగ్ చేస్తారని ఆమె అమ్మ రాధా చెప్పినట్లు ఆయన పేర్కొన్నారని తెలిపారు. దీంతో ఆట పట్టించడానికే ఆమె తమను అలా అడిగినట్లు భావించి కారులో కూర్చున్నామని, చిత్రీకరణ ప్రారంభమైన వెంటనే ఆమె బ్రేక్‌కు బదులుగా ఆక్సిలేటర్‌ను నొక్కడంతో కారు అస్తవ్యస్తంగా పరుగులు పెట్టిందని పేర్కొన్నారు.
దీంతో ఆందోళనకు గురైన తాను వెంటనే తేరుకుని కారుని అదుపులోకి తీసుకొచ్చి నిలిపివేశానని, అలాంటి థ్రిల్లింగ్ అనుభవాలను ఈ చిత్రం అందించిందన్నారు.