బాలీవుడ్ నిర్మాత, దర్శకులకు కార్తీక వల
బాలీవుడ్ పై ఆమెకు మొదటి నుంచీ ఆలోచన ఉన్నా తెలుగులో 'జోష్'తో తెరంగేట్రం చేయటం, ప్రస్తుతం దక్షిణాదిలోని మూడు భాషల్లో గుర్తింపు తెచ్చుకోవటం చకచకా జరిగిపోయాయి. దాంతో సంతృప్తి చెందని కార్తీక బాలీవుడ్‌లో పాదం మోపటమే ధ్యేయమని అంటోందట. తెలుగులో దమ్ము, తమిళంలో ఇటీవల విడుదలైన 'అన్నక్కొడి'లో నటనతో పాటు గ్రామీణ నేపథ్యంలోని గ్లామర్‌ను ప్రదర్శించింది.
గ్లామర్ ప్రదర్శన ద్వారా బాలీవుడ్ దర్శకులను సైతం ఆకర్షించి అక్కడా అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నదే అమ్మడి ఉద్దేశంగా ఉందట. మరి ఆమె ఆశలు ఎంతవరకు ఫలిస్తాయే వేచి చూడాల్సిందే అంటున్నారు బాలీవుడ్ జనం. స్టార్ హీరోల, హీరోయిన్ల కుమారులు, కూతుళ్ళు వారి తల్లిదండ్రుల పరువు ప్రతిష్టలని తమ భుజాల పై వేసుకొని ప్రయాణిస్తువుంటారు. అలాగే అలాంటి వారిలో అప్పటి స్టార్ హీరోయిన్ రాధిక కూతురు హీరోయిన్ కార్తీక ఒకరు.
ప్రస్తుతం కార్తీక తెలుగులో ఎక్కువగా సినిమాలలో నటించకపోయిన తమిళ, మలయాళం సినిమాలలో నటిస్తు అక్కడ మంచి పేరుకు సంపాదించుకుంది. కార్తీకని స్టార్ లేగేన్సి గురించి అడిగినప్పుడు, కార్తీక మాట్లాడుతూ ' అమ్మ నాకన్నచాలా గొప్ప స్టార్, చాలా గొప్పనటి. ఆమెతో నను పోల్చడం కరెక్టు కాదు. మా అమ్మ అంత పెద్ద స్టార్ అయినందుకు నాకు చాలా సంతోషంగా వుంది'. అని చెప్పింది. కార్తీక తెలుగులో చివరిగా ఎన్.టి.ఆర్ తో కలిసి 'దమ్ము' సినిమాలో నటించింది.


Click it and Unblock the Notifications












