For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  తమిళ హీరోయిన్‌పై దాడి.. గొంతు పిసికి చంపేందుకు ప్రయత్నం.. కాల్చిపడేస్తామంటూ వార్నింగ్

  |

  దక్షిణాదిలో వర్ధమాన తారగా రాణిస్తున్న నేహా సక్సేనా తమిళ సినిమా యూనిట్‌పై ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. తమిళ షినిమా షూటింగులో తనపై కొందరు భౌతికంగా దాడి చేశారు అని ఫిర్యాదులో పేర్కొన్నారు. మలయాళ చిత్ర దర్శకుడు రూపొందిస్తున్న ఓ సినిమా షూటింగ్ సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకొన్నది అని నేహా సక్సేనా పేర్కొన్నారు. ఈ మేరకు బెంగళూరు పోలీస్ స్టేషన్‌లో పిటిషన్ దాఖలు చేశారు.

  తమిళ సినిమా షూటింగ్ సందర్భంగా

  తమిళ సినిమా షూటింగ్ సందర్భంగా

  తమిళంలో తాను నటిస్తున్న సినిమాకు సంబంధించిన దర్శకుడు తనపై దాడికి పాల్పడ్డాడు. తనను చంపివేస్తానని బెదిరించారు. కొన్ని దారుణ సంఘటనలు ఎదురు కావడంతో తాను ఉంటున్న హోటల్ నుంచి తన అసిస్టెంట్లతో కలిసి పారిపోయాను అని నేహా సక్సెనా తెలిపారు. ప్రముఖ ఆంగ్ల మీడియాకు చెందిన పత్రికతో మాట్లాడుతూ.. షూటింగ్‌ మొదలైన రోజు నుంచే నాకు సెట్స్‌లో చేదు అనుభవాలు ఎదురయ్యాయి. కొందరు తనతో ప్రవర్తించిన తీరు చాలా బాధకలిగించింది అని నేహా సక్సేనా అన్నారు.

  డైరెక్టర్ నాతో అసభ్యంగా

  డైరెక్టర్ నాతో అసభ్యంగా


  కొన్ని సంఘటనలు అసౌకర్యంగా మారాయి. వాళ్లు ఇచ్చిన స్క్రిప్టు కూడా సరిగా లేదు. కొన్ని అభ్యంతరకరమైన సీన్లలో నటించనని చెప్పాను. సినిమా ప్రారంభానికి ముందు చెప్పిన క్యారెక్టర్ వేరు.. సెట్స్‌లో నాతో చేయించే సీన్లు చాలా దారుణంగా ఉన్నాయి. దాంతో నేను అభ్యంతరం వ్యక్తం చేశాను. దాంతో నన్ను బెదిరించడం మొదలుపెట్టారు. నిర్మాతకు మాఫియాతో సంబంధాలు ఉన్నాయి. ఆయన నిర్వహించే కసినోలో టార్చర్ రూమ్ ఉంటుంది. అందులో పడేసి నీపై దాడి చేస్తారని, రేప్ చేయడమే కాకుండా, కాల్చి పడేయడానికి కూడా వెనుకాడరు అని బెదిరించారు అని నేహా సక్సేనా వెల్లడించారు.

  నేను బస చేసిన హోటల్ ఓనర్ కూడా

  నేను బస చేసిన హోటల్ ఓనర్ కూడా

  సెప్టెంబర్ 19వ తేదీన దారుణమైన సంఘటన జరిగింది. నేను ఉంటున్న హోటల్‌ ఓనర్ నాతో తప్పుడు రీతిలో ప్రవర్తించాడు. ఆ సమయంలో నా అసిస్టెంట్లు డిన్నర్ కోసం అదే హోటల్‌లో ఉన్న రెస్టారెంట్‌కు వెళ్లారు. ఆ సమయంలో హోటల్ ఓనర్ వచ్చి ఈ రాత్రికి నాతో, నా స్నేహితులతో గడుపుతావా అని అడిగాడు. ఓనర్ ప్రవర్తనను వెంటనే నా డైరెక్టర్‌కు తెలిపారు. అయితే ఓనర్ ప్రవర్తనను అడ్డుకోకపోగా.. డైరెక్టర్‌ కూడా తేడాగా ప్రవర్తించాడు అని నేహా సక్సేనా తెలిపారు.

  ఆ రాత్రి నాకు నరకంగా అంటూ

  ఆ రాత్రి నాకు నరకంగా అంటూ

  ఇక ఆ రాత్రి నాకు నరకంగా మారింది. ఓనర్ పిచ్చిచేష్టల తర్వాత నాకు గుర్తు తెలియని వ్యక్తులు నాకు ఫోన్ చేయడం ప్రారంభించారు. అర్ధరాత్రి వచ్చి తలుపు కొట్టారు. దాంతో నేను చాలా భయాందోళనలకు గురయ్యాను అని నేహా సక్సేనా తెలిపారు. నేను నటించే సినిమాలో డైరెక్టర్ కొడుకే హీరో. ఇక షూటింగ్ చివరి రోజున డైరెక్టర్ కొడుకు నా మెడ పట్టుకొని పిసికి చంపేందుకు ప్రయత్నించాడు. హోటల్ మెట్ల మీద నుంచి తోసేశాడు అని నేహా సక్సేనా తెలిపారు.

  Mahesh Babu Is The Brand Ambassador For Big C
  పదేళ్ల నా కెరీర్ ఇలాంటి చేదు అనుభవాలు లేవు..

  పదేళ్ల నా కెరీర్ ఇలాంటి చేదు అనుభవాలు లేవు..

  తనకు జరిగిన అవమానంపై నేహా సక్సేనా తీవ్ర దిగ్బ్రాంతికి గురైంది. గత పదేళ్లుగా సినిమా పరిశ్రమలో ఉన్నాను. కానీ ఎన్నడు ఎలాంటి చేదు సంఘటనలు ఎదురు కాలేదు. ఎంతో పేరు ఉన్న కోలీవుడ్ పరిశ్రమలో ఇలాంటి వ్యక్తులు తారసపడటం ఇదే మొదటిసారి. నాలాంటి సీనియర్ నటికే ఇలాంటి దాడులు, వేధింపులు ఎదురైతే.. కొత్తగా వచ్చే వారి పరిస్థితి ఏమిటి? వినోద పరిశ్రమలో భద్రత ఉందా అనే అనుమానం ఇలాంటి సంఘటనల వల్ల వస్తుంది అని నేహా సక్సేనా పేర్కొన్నారు.

  English summary
  Actress Neha Saxena alleges she was physically assaulted on the sets of a Tamil movie. She filed a complaint at the Bangalore police station. She said, I received dire threats.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X