»   » కీర్తి సురేష్ ని హీరోయిన్ గా, బన్ని మామూలు స్కెచ్ వేయలేదుగా?

కీర్తి సురేష్ ని హీరోయిన్ గా, బన్ని మామూలు స్కెచ్ వేయలేదుగా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: నేను శైలజ చిత్రంతో ఓవర్ నైట్ లో హీరోయిన్ గా స్టార్ డం అందుకుందికీర్తి సురేష్. ఆ తర్వాత ఆమె చేసిన రైల్ చిత్రం నెగిటివ్ టాక్ తెచ్చుకున్నా ఆమె నటనకు మంచిమార్కులే పడ్డాయి. మరో ప్రక్క ఆమె నాచురల్ స్టార్ నాని సరసన నేను లోకల్ చిత్రంలో హీరోయిన్ గా చేస్తోంది. ఈ నేపధ్యంలో తెలుగులో మరో భారీ ఆఫర్ రావటం ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఏమిటా భారీ ఆఫర్...ఎవరి సరసన ఆమె చేయబోతోంది అంటే..

వివరాల్లోకి వెళితే... అల్లు అర్జున్‌ హీరోగా స్టూడియో గ్రీన్‌ సంస్థ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ తమిళ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి జ్ఞానవేల్‌రాజా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి దీన్ని రూపొందిస్తున్నారు. అయితే.. ఈ చిత్రంలో బన్నీ సరసన కీర్తీసురేశ్‌ నటించనున్నట్లు సమాచారం .

ఈ భామకు ఇటు తెలుగు, అటు తమిళ చిత్ర పరిశ్రమలో క్రేజ్‌ ఉన్నందున ఆమైతే ఈ చిత్రానికి సరిపోతుందని నిర్మాతలు భావించి ఆమెను తమ సినిమాలోకి తీసుకున్నారని తెలుస్తోంది. అలాగే ఆమె మళయాళి కావటంతో మళయాళంలో సినిమా రిలీజ్ చేయటానికి కూడా క్రేజ్ కు కలిసివస్తుంది. ఇదంతా విన్న వారంతా బన్ని మామూలు స్కెచ్ వేయలేదు..చాలా ఫెరఫెక్ట్ గా ప్లాన్ గీసాడంటున్నారు.

Keerthy Suresh in Allu Arjun’s Tamil debut

'కీర్తీసురేశ్‌.. అల్లు అర్జున్‌తో నటించబోతున్నారు. వాళ్లిద్దరు కలిసి తెరపై కనిపించడం ఇదే తొలిసారి. నిర్మాతలు చాలా మంది హీరోయిన్లను అనుకున్నారు. కానీ.. కీర్తీసురేశ్‌కు తమిళంతోపాటు తెలుగు చిత్ర పరిశ్రమలోనూ పాపులారిటీ ఉంది. ఆమె కూడా సంతోషంగా ఈ చిత్రంలో నటించడానికి సంతకం చేశారు' అని చిత్ర యూనిట్ చెప్తోంది. కీర్తీసురేశ్‌ ప్రస్తుతం తమిళ నటుడు విజయ్‌తో కలిసి 'బైరవా'లో, టాలీవుడ్‌ హీరో నానితో కలిసి 'నేను లోకల్‌' చిత్రంలో నటిస్తున్నారు.

మరో ప్రక్క సరైనోడు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు తన మార్కెట్ పరిధిని మరింత పెంచుకునేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే మలయాళంలో మల్లూ అర్జున్ గా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న స్టైలిష్ స్టార్ ప్రస్తుతం కోలీవుడ్ మీద కన్నేశాడు. అందుకు తగ్గట్టుగా ఓ స్ట్రయిట్ తమిళ సినిమాతో అరవ ప్రేక్షకులను అలరించేందుకు ప్లాన్ చేశాడు.

ఇటీవలే అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కబోయే తమిళ సినిమాను పలువురు తమిళ సినీ ప్రముఖ సమక్షంలో ఘనంగా ప్రారంభించారు. మాస్ డైరెక్టర్ లింగుసామి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత జ్ఞానవేల్ రాజా స్టూడియో గ్రీన్ బ్యానర్ లో ఈ సినిమాను నిర్మిస్తూండటంతో తమిళ తంబీల దృష్టి కూడా ఈ సినిమాపై పడనుంది.

ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో డిజె దువ్వాడ జగన్నాథమ్ సినిమాలో నటిస్తున్న బన్నీ, ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగానే తమిళ సినిమాను కూడా సెట్స్ మీదకు తీసుకెళ్లాలని భావిస్తున్నాడు.

English summary
Keerthy Suresh, last seen in Dhanush's Rail, has been roped in to play Allu Arjun's love interest in his upcoming yet-untitled bilingual project which marks his Tamil debut.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu