»   » మీడియా తీరుపై రజనీకాంత్ ‘పెట్టా’ మూవీ డైరెక్టర్ ఫైర్...

మీడియా తీరుపై రజనీకాంత్ ‘పెట్టా’ మూవీ డైరెక్టర్ ఫైర్...

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తమిళ యంగ్ డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో 'పెట్టా' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శర వేగంగా జరుగుతుండగా... షూటింగ్ స్పాట్ నుండి చిత్రీకరణకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు బయటకు లీవ్ అవుతున్నాయట.

  ఈ లీకుల ఇష్యపై దర్శకుడు సీరియస్ అయ్యాడు. వెంటనే సెట్స్‌లో ఎవరూ మొబైల్స్ వాడకుండా ఆంక్షలు విధించాడు. మరో వైపు లీకైన 'పెట్టా' ఫోటోలు, వీడియాలో టీవీ ఛానల్స్ ప్రసారం చేస్తుండటంపై కార్తీక్ సుబ్బరాజ్ అసహనం వ్యక్తం చేశారు.

  Kind request from Petta team

  'షూటింగ్ స్పాట్ నుండి లీకైన ఫోటోలు, వీడియోలను దయచేసి ఎవరూ సోషల్ మీడియాలో షేర్ చేయవద్దు. పెట్టా టీమ్ నుండి ఇది మా రిక్వెస్ట్. మీ అందరి సపోర్ట్ కావాలి. కొన్ని టీవీ ఛానల్స్‌లో ఈ లీకైన ఫోటోలు, వీడియోలు ప్రసారం కావడం చూసి షాకయ్యాను. రేపు వీళ్లు పైరేటెడ్ సినిమాలను కూడా న్యూస్ కింద ప్రసారం చేస్తారేమో? ఇలా చేయడం అనైతికం... అంటూ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ మండి పడ్డారు.

  కాగా... సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తున్న 'పెట్టా' చిత్రంలో రజనీ గ్యాంగ్‌స్టర్‌ పాత్రలో కనిపించబోతున్నారు. ఇందిరాగాంధీ హయాంలో ఎమర్జెన్సీ విధించినప్పుడు అరెస్ట్‌ అయిన 109వ ఖైదీగా రజనీ కనిపించనున్నట్లు టాక్.

  ఈ చిత్రంలో రజనీకాంత్‌తో పాటు త్రిష, విజయ్ సేతుపతి, శశి కుమార్, బాబీ సింహా, సిమ్రన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం 2019లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

  English summary
  "Kind request from #Petta team.. Pls do not share leaked stills or videos from shooting Spot..Need all your support. Shocked to see channels like ThanthiTV are publishing leaked video as news.Guess next they would even telecast pirated movies as news... Completely Unethical." karthik subbaraj tweeted.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more