twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సీక్రెట్ రివీలైంది... అది మన తెలుగు చిత్రం రీమేకే

    By Srikanya
    |

    చెన్నై:నారా రోహిత్ హీరోగా వచ్చిన 'ప్రతినిధి' తెలుగులో మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఇఫ్పుడు తమిళంలో 'కో2' (రంగం సీక్వెల్ )రీమేక్ అవుతోంది. అయితే ఈ విషయాన్ని చాలా సీక్రెట్ గా ఉంచారు. కానీ తాజాగా మీడియాకు ఈ విషయం లీక్ అయ్యి బయిటకు వచ్చింది.

    ఈ తమిళ రీమేక్ లో బాబి సింహా హీరోగా చేయనున్నారు. అలాగే...ప్రకాష్ రాజ్...కిడ్నాపైన ఛీఫ్ మినిస్టర్ గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆర్.ఎస్ ఇన్ఫోటైన్మెంట్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని శరత్ మండవ డైరక్ట్ చేస్తున్నారు. లెనిన్ జేమ్స్ ...ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. కెమెరాని ఫిలిఫ్ ఆర్ .సుందర్ మరియు ఎమ్ వెంకట్ చేస్తున్నారు. 30 కోట్లు బడ్జెట్ తో ఈ పొలికటికల్ థ్రిల్లర్ రూపొందనుంది. పిభ్రవరిలో ఈ చిత్రం రిలీజ్ అవుతోంది.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    చిత్రం కథేమిటంటే.... అవినీతి, అక్రమాలులతో నిండిపోయిన రాజకీయ వ్యవస్దతో విసుగెత్తిన శ్రీను(నారా రోహిత్)... ముఖ్యమంత్రి(కోట శ్రీనివాసరావు)ని కిడ్నాప్ చేస్తాడు. ఆయన్ని విడిపించటానికి రంగంలోకి దిగిన పోలీస్ కమీషనర్ (పోసాని) శ్రీను తో మాట్లాడి డిమాండ్స్ తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. సమాజానికి ఉపయోగపడే అతని డిమాండ్స్ విన్న కమీషనర్ ఆశ్చర్యపోతాడు. ప్రజలు,మీడియా అంతా శ్రీను ని హీరోగా గా జేజేలు కొడతారు.

     Ko 2 An Official Remake Of Telugu Film 'Pratinidhi'?

    మరోప్రక్క పోలీసులు అసలు శ్రీను ఎవరు...ఎందుకిలా చేసాడు అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అప్పుడు బయిటపడిన ఓ విషయం వారిని షాక్ కు గురి చేస్తుంది. ఇంతకీ వారు తెలుసుకున్న శ్రీను ఫ్లాష్ బ్యాక్ ఏమిటి...శ్రీను కి సహకరించిన వారు ఎవరు...చివరకు ముఖ్యమంత్రిని వదిలేసారా...శ్రీను ని పోలీసులు ఏం చేసారు వంటి ప్రశ్నలకు సమాధానం కావాలంటే సినిమా చూడాల్సిందే.

    నారా రోహిత్ మాట్లాడుతూ... ఓటు వేయని ప్రజలకు ప్రశ్నించే అధికారం లేదు. నోటుకు ఓటు అమ్ముకొనే జనానికి ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం లేదు. ముందు ప్రజలు నిజాయతీగా ఉంటే తప్ప పాలనలో, ప్రభుత్వంలో మార్పురాదు. అదే మా 'ప్రతినిధి' ఇచ్చే సందేశం అంటున్నారు నారా రోహిత్‌.

    దర్శకుడు మాట్లాడుతూ ''సమకాలీన సమాజ పరిస్థితుల్ని ప్రతిబింబించే చిత్రమిది. ఓ సామన్య పౌరుడు తలచుకొంటే ఏం చేయగలడో చూపిస్తున్నాం. ప్రభుత్వంతో పని చేయించుకోవడం మన హక్కు. ఆ హక్కుతో పాటు కొన్ని బాధ్యతలు కూడా ఉన్నాయి. వాటిని గుర్తు తెచ్చే చిత్రమిది. సంభాషణలు ఆకట్టుకొంటాయ''ని చెప్పారు.

    ఈరోజుల్లో రూపాయికే విలువ లేదు. ఇక పైసల్ని పట్టించుకొనేదెవరు? కానీ అతను అలా కాదు. ప్రతి పైసాకీ సమాధానం చెప్పాల్సిందే. ఎనభై నాలుగు పైసల కోసం ఏకంగా.. ముఖ్యమంత్రిని కిడ్నాప్‌ చేశాడు. ప్రభుత్వ యంత్రాంగాన్ని తన కాళ్ల దగ్గరకు రప్పించాడు. ఇంతకీ అతనెవరు? ఆ తరవాత ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి? తెలుసుకోవాలంటే మా సినిమా చూడండి అన్నారు.

    దర్శకుడు మాట్లాడుతూ ''సమకాలీన సమస్యలపై ఓ సామాన్యుడు సాగించిన సమరం ఇది. ప్రతినిధిగా నారా రోహిత్‌ నటన, ఆయన పలికే సంభాషణలు అందరికీ నచ్చుతాయి. ఇటీవల విడుదల చేసిన పాటలకు మంచి స్పందన వచ్చింది. ప్రచార చిత్రం కూడా ఆకట్టుకొంటోంద''న్నారు. ''ప్రస్తుత రాజకీయాలు సగటు మనిషి జీవితాన్ని ఎలా మారుస్తున్నాయో ఈ చిత్రంద్వారా చూపిస్తున్నాం''అని నిర్మాత చెప్పారు.

    ఇక ‘18 సంవత్సరాల వయసులో ప్రేమించి పెళ్లిచేసుకుంటే జీవితం పాడైపోతుందని అందరూ అంటారు. అదే 18 సంవత్సరాల వయసులో ఓటేస్తే ప్రభుత్వం పాడైపోతుందని ఎవరూ అడగరే...వస్తున్నా...అడగడానికే వస్తున్నా..' అనే డైలాగు హైలెట్ అయ్యింది.

    English summary
    Upcoming Tamil thriller Ko 2 is the official remake of Nara Rohith-starrer Telugu film Pratinidhi, according to sources. "The makers of 'Ko 2' have kept it a secret but the film is the remake of Telugu film 'Pratinidhi'," a source from the film's unit told IANS. Starring Bobby Simhaa, Prakash Raj and Nikki Galrani in important roles, Ko 2 is about the events that unfolds after a Chief Minister gets kidnapped by a common man. Prakash Raj will be essaying the role of the Chief Minister, while Simhaa will play the common man disguised as a television reporter.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X