»   » రచ్చ సృష్టిస్తున్న రజనీ ‘కొచ్చాడయాన్’ టీజర్

రచ్చ సృష్టిస్తున్న రజనీ ‘కొచ్చాడయాన్’ టీజర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా రూపొందిన 'కొచ్చాడయాన్' చిత్రం అఫీషియల్ టీజర్ వినాయక చతుర్థి సందర్భంగా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ టీజర్ ఒక్క రోజులోనే 1 మిలియన్ హిట్స్ సొంతం చేసుకుని... రజనీకాంత్‌‌కు ఫాలోయింగ్ ఏరేంజిలో ఉంటుందో నిరూపించింది.

తొలి టీజర్లో హీరోయిన్ దీపిక పదుకొనె లేక పోవడంపై దర్శకురాలు సౌందర్య స్పందిస్తూ...త్వరలో విడుదల కాబోయే రెండో టీజర్లో దీపిక ఉంటుందని తెలిపారు. ఈ సినిమాలో దీపిక ప్రిన్సెస్ వధనా పాత్రలో కనిపించనుంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈచిత్రం ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. విజువల్ ఎఫెక్ట్స్ కారణంగానే సినిమా విడుదల ఆలస్యం అవుతున్నట్లు యూనిట్ సభ్యులు చెబుతున్నారు.

Kochadaiiyaan trailer gets 1 million views

దర్శకుడు కె.ఎస్. రవికుమార్ పర్యవేక్షణలో రజనీ చిన్న కుమార్తె సౌందర్య దర్శకత్వం వహించగా...ఎ.ఆర్. రెహమాన్ సంగీతం సమకూర్చారు. ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సునీల్ లుల్లా, సునందా మురళి మనోహర్, మురళి మనోహర్ నిర్మాతలు.

దేశంలోనే తొలిసారిగా హాలీవుడ్ మూవీ అవతార్ తరహాలో మోషన్ కాప్చర్ టెక్నాలజీతో 3డి ఫార్మాట్‌లో ....ఇండియాలో ఇదివరకెన్నడూ కనీవినీ ఎరుగని భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ ఛాయాగ్రాహకుడుగా రాజీవ్‌ మీనన్‌ పని చేసారు. తెలుగులో ఈచిత్రాన్ని 'విక్రమ సింహా' పేరుతో విడుదల చేస్తున్నారు.

దేశీయ బాషలైన హిందీ, తెలుగు, తమిళంతో పాటు ఇంగ్లీష్, రష్య, జపాన్, చైనా బాషలలో విడుదలవుతుంది. 3డిలో రూపొందుతున్న ఈచిత్రం యానిమేషన్, గ్రాఫిక్స్ తో విజువల్ ట్రీట్‌లా ఉంటుందని యూనిట్ సభ్యులు తెలిపారు. శరత్‌కుమార్, శోభన, నాజర్, ఆది పినిశెట్టి, జాకీ ష్రాఫ్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. తమిళ, తెలుగు, హిందీ, జపనీస్ భాషల్లో వచ్చే దీపావళి సందర్భంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రజనీకాంత్ హీరో కావడం, అవతార్ సినిమాకు పని చేసిన టెక్నీషియన్స్ పని చేస్తుండటంతో ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి.

English summary
The first trailer of Tamil period film Kochadaiiyaan starring superstar Rajinikanth was unveiled on September 9 and within a day of its release, it has got almost a million views.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu