»   » రజనీకాంత్‌ ఫ్యాన్స్ కు మళ్లీ చేదువార్త

రజనీకాంత్‌ ఫ్యాన్స్ కు మళ్లీ చేదువార్త

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై : తమ తలైవర్‌ రజనీకాతం చిత్రాన్ని చూసేందుకు అభిమానులు అంతా వేయి కళ్లతో ఎదురుచూస్తుంటే.. 'కోచ్చడయాన్‌' (తెలుగులో విక్రమ్ సింహా) మళ్లీ వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. 'రోబో' తర్వాత రజనీకాంత్‌ హీరోగా 'రాణా' చిత్రం తెరకెక్కాల్సింది. ఆయన అనారోగ్యానికి గురికావటంతో అది ఆగిపోయింది. తన చిన్న కుమార్తె సౌందర్య దర్శకత్వంలో 'కోచ్చడయాన్‌'కు పచ్చజెండా వూపి అభిమానులను ఖుషీ చేశారు సూపర్‌స్టార్‌.

సీనియర్‌ దర్శకుడు కేయస్‌ రవికుమార్‌ పర్యవేక్షణలో అత్యాధునికి సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిందీ చిత్రం. ఇందులో రాణా, కోచ్చడయాన్‌గా రజనీకాంత్‌ ద్విపాత్రాభినయం చేశారు. కథానాయకిగా బాలీవుడ్‌ భామ దీపికా పదుకొనే ఎంపికైంది. ఇప్పటికే ట్రైలర్‌ విడుదల చేశారు. ఆడియోను అక్టోబరులో, రజనీకాంత్‌ పుట్టినరోజు డిసెంబరు 12న చిత్రాన్ని విడుదల చేస్తారనే వార్తలు వినిపించాయి.

Kochadaiyaan

ఇప్పటివరకూ ఆడియో విడుదలపై ఎలాంటి ప్రకటన లేకపోవటంతో డిసెంబరులో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావటంపై సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలో కోచ్చడయాన్‌ ఇంకా తుది మెరుగులు దిద్దుకుంటోందని సమాచారం. ఈ నేపథ్యంలో ఆడియోను డిసెంబరు 12న ఆవిష్కరించి, రజనీకాంత్‌కు ఎంతో అచ్చొచ్చిన ఏప్రిల్‌ 14న చిత్రాన్ని విడుదల చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు అంటున్నాయి.

రజనీకాంత్ నటించిన చివరి చిత్రం 'రోబో' 2010లో విడుదలైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన సినిమా విడుదల కాలేదు. దీంతో అభిమానులు చాలా నిరాశగా ఉన్నారు. ఈ విషయాన్ని గ్రహించిన రజనీకాంత్, దర్శకురాలు సౌందర్య 'కొచ్చాడయాన్' చిత్రాన్ని ఈ దీపావళికి విడుదల చేస్తామని అభిమానులకు మాటిచ్చారు. అయితే సినిమా షూటింగ్ ఇంకా సగం కూడా పూర్తి కాలేదు. విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ కూడా చాలా పెండింగులో ఉంది. ఈ నేపథ్యంలో కొచ్చాడయాన్ చిత్రం విడుదల లేటవుతోంది.

'విక్రమ్ సింహా' చిత్రంలో రజనీకాంత్..రణధీరన్‌ అనే రాజు పాత్రలో కనిపించనున్నారు. పల్లవుల కాలంలో చోటు చేసుకొన్న కొన్ని సంఘటనల ఆధారంగా అల్లుకొన్న కథ. ఈ చిత్రానికి ప్రముఖ ఛాయాగ్రాహకుడు రాజీవ్‌ మీనన్‌ కెమెరా వర్క్ అందిస్తున్నారు. ఈచిత్రంలో రజనీకాంత్ లాంగ్ హెయిర్ తో శివున్ని పోలి ఉంటాడని, కత్తులతో పోరాటం చేసే యోధుడిగా కనిపించనున్నాడని తెలుస్తోంది. దీపికా పదుకొనే ఇందులో హీరోయిన్ గా నటిస్తున్న విషయం విదితమే. భారతదేశంలోనే తొలిసారిగా మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో తెరకెక్కుతోన్న చిత్రం ఇదే కావడం గమనార్హం. ఏఆర్ రెహమాన్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

English summary
Superstar Rajinikanth’s 3D magnum opus Vikrama Simha’s (Kochadaiyaan in Tamil) has been postponed to Aprial 14, as a gift to Superstar fans on his birthday amid high expectations. Earlier, it was scheduled to release this Diwali. The first look of VikramaSimha has impressed a lot everyone and created huge expectations on the movie of the year. Superstar Rajini’s daughter Soundarya has wielded the megaphone for this prestigious movie and taking utmost care in every department.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu