For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సూపర్ స్టారా..మజాకా!, కోట్ల గుమ్మరిస్తున్న వైనం!

  By Bojja Kumar
  |

  చెన్నై : తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. కొందరు అభిమానులు ఆయన్ను గుండెల్లో పెట్టుకుని పూజిస్తారంటే అతిశయోక్తి కాదు. రజనీ నటించిన చివరి చిత్రం శంకర్ దర్శకత్వం 'రోబో' విడుదలై దాదాపు మూడేల్లయింది.

  రజనీకాంత్ తర్వాతి సినిమా కోసం మూడేళ్లుగా కళ్లలొ వత్తులు వేసుకుని ఎదురు చూస్తున్న అభిమానులాంతా ఆయన తాజాగా నటిస్తున్న 'కొచ్చాడయాన్' చిత్రంపై భారీ అంచనాలే పెట్టుకున్నారు. అందరి అంచనాలకు తగిన విధంగా ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో, అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో, భారతీయ సినీ చరిత్రలో మునుపెన్నడూ కనీ వినీ ఎరుగని రీతిలో మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని ఉపయోగించి దీన్ని తెరకెక్కిస్తున్నారు.

  ఈ సంవత్సరం జులైలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈచిత్రంపై బిజినెస్ ఇప్పటి నుంచే ఊపందుకుంది. ఈ చిత్ర ప్రదర్శన హక్కులు దక్రించుకునేందుకు పలువురు డిస్ట్రిబ్యూటర్లు కోట్లాది రూపాయలు గుమ్మరించేందుకు పోటీ పడుతున్నారు. ఇప్పటికే ఈచిత్రం ఆంధ్రప్రదేశ్ థియేట్రికల్ రైట్స్, యూఎస్ థియేట్రికల్ రైట్స్ భారీ రేటుకు అమ్ముడయినట్లు తెలుస్తోంది.

  ATMUS Entertainment అనే డిస్ట్రిబ్యూషన్ సంస్థ అమెరికాలో ఈచిత్ర హక్కులను దక్కించుకున్నట్లు ప్రకటించింది. మూడేళ్ల క్రితం వచ్చిన 'రోబో' చిత్రం డబ్బింగ్ రైట్స్ అప్పట్లోనే రూ. 30 కోట్లు పలికింది. మరి ఇప్పుడు వస్తున్న 'కొచ్చాడయాన్' రైట్స్ ఎన్ని కోట్లు వసూలు చేస్తుందో అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారంతా.

  కొచ్చాడయాన్ సినిమా ఆసియాలోనే తొలి మోషన్ క్యాప్చర్ సినిమా. గతంలో ఈ టెక్నాలజీ హాలీవుడ్ సినిమాలు అవతార్, టిన్ టిన్ చిత్రాల్లో మాత్రమే ఉపయోగించారు.

  శరత్ కుమార్, ఆది పనిశెట్టి, దీపిక పడుకొనె, శోభన, జాకీ ష్రాఫ్, నాజర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

  ఈరోస్ ఇంటర్నేషనల్, మీడియా వన్ గ్లోబర్ ఎంటర్ టైన్మెంట్స్ సంయుక్తంగా ఈచిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ప్రఖ్యాత మ్యూజీషియన్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. రాజీవ్ మీనన్ సినిమాటోగ్రఫీ చేస్తున్నారు.

  తెలుగులో ఈచిత్రం ‘విక్రమ సింహా' పేరుతో విడుదలకానుంది.

  ఈ చిత్రం ద్వారా రజనీకాంత్ కూతురు సౌందర్య దర్శకురాలిగా పరిచయం అవుతోంది.

  English summary
  
 After three years, Rajinikanth is giving his fans a reason to cheer. The superstar, whose last release was Endhiran directed by Shankar in 2010, is ready to thrill his fans in his forthcoming movie Kochadaiyaan, which will hit the screens this July. The preparation to bring the movie before audience in July is in full swing with the Kochadaiyaan team busy with the post production on one end and inviting distributors to purchase the rights of the film for different regions on the other.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X